Tablets for children
-
National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష
నులిపురుగులు చిన్న సమస్య కాదు. అలాగని పెద్ద సమస్యా కాదు. చిన్న పిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. మన దేశంలో 65 శాతం మంది చిన్నారులు నులిపురుగులతో బాధ పడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నులిపురుగుల మందు వేసే వారు. ఇప్పుడు తల్లులకు వ్యవధి ఉండటం లేదు. కాని తప్పదు జాగ్రత్త. నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెబుతుంటారు. పదేపదే అక్కడ గీరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా ‘కడుపులో నులిపురుగులున్నాయేమో’ అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరుబయలులో విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లల్లో టాయిలెట్లు వాడి ఫ్లష్ చేయడం వల్ల నులి పురుగులను గమనించే అవకాశం లేదు. పెద్దల కంటే పిల్లలకు నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. నులి పురుగులంటే? నులి పురుగులు పేగుల్లో చేరి మన ΄ోషకాలను దొంగిలించి తినే పరాన్న జీవులు. వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘అస్కారియాసిస్’ అంటారు, మన దేశంలోదాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అకలి మందగిస్తుంది. ‘మా పిల్లవాడు ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినడం లేదు’ అని తల్లులు కంప్లయింట్ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరిగా నిద్ర΄ోలేక ఇబ్బంది పడతారు. ఎలా ప్రవేశిస్తాయి? చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా ΄పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత ΄ాటించక΄ోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు. ఏం చేయాలి? ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో అల్బెండజోల్ మాత్రలు వాడాలి. ప్రకృతి వైద్యంలో ఎనిమా ద్వారా కూడా ఈ నులి పురుగుల బెడద తొలగిస్తారు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా కూడా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక ΄ాత్ర ΄ోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాగించడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. బొప్పాయి పండును తినిపించడం, సన్నగా ఉండే ఆవాలను వేయించి ΄పొడిచేసి మజ్జిగలో కలిపి తాగించడం వంటి వాటి ద్వారా నులిపురుగుల బెడదను అధిగమించేలా చేయవచ్చు. అన్నింటికీ మించి వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం అవసరం. -
ప్రాణం తీసిన టాబ్లెట్
అవగాహనా రాహిత్యం ఆ చిన్నారి ప్రాణాలను బలిగొంది. సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఆ కుటుంబానికి కడుపుకోత మిగిల్చింది. నులిపురుగుల నివారణకోసం ఇచ్చిన మాత్ర అభంశుభం తెలియని ఆ బాలుని ఆయుష్సు తీసింది. గరుగుబిల్లి మండలం కె.ఆర్.ఎన్.వలస అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలు అందించిన మాత్ర బాలుని నాన్నమ్మ మింగించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన అందరి మనసులనూ కలచివేసింది. సాక్షి, పార్వతీపురం (విజయనగరం): పొట్టలో నులి పురుగులు చంపేందుకు వేసిన మాత్ర ఓ బాలుడు ప్రాణం తీసిన ఘటన కేఆర్‌ఎన్‌వలస గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కేఆర్‌ఎన్‌వలస గ్రామం అంగన్వాడీ కేంద్రంలో కొట్నాన జశ్వంత్‌నాయుడు(2)కు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఆల్బెండ్జోల్ మాత్రను అంగన్వాడీ నిర్వాహకులు అందించారు. బాలుడి నాన్నమ్మ అప్పమ్మ ఒడిలో పడుకోబెట్టి ఏఎన్ఎం మరడాన సుమతి, అంగన్వాడీ నిర్వాహకురాలు కొట్నాన సరస్వతి మాత్రను మింగించారు. తొలుత బాలుడు మాత్రను మింగలేక కక్కేయడంతో రెండోసారి బాలునిచే మింగించారు. మాత్ర మింగిన కొద్ది సేపటికే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు కొట్నాన చంద్రశేఖరరావు, సుజాత పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లమని అక్కడి వైద్యులు చెప్పడంతో వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించే సమయానికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకొన్న అధికారులు మాత్ర వికటించిన సంఘటనలో బాలుడు మృతి చెందాడని తెలుసుకొన్న డీఎంహెచ్ఓ విజయలక్ష్మీ,స్థానిక వైద్యులు పీఏ ప్రియాంక, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ అజూరఫీజాన్, ఎస్ఐ సింహచలం ఆస్పత్రికి చేరుకొని సంఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. దర్యాప్తు చేసి క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. విషయం తెలుసుకున్న తహ సీల్దార అజూరఫీజాన్, ఎంపీడీఓ ఎంవీ గోపాలకృష్ణ, కేఆర్ఎన్ వలస వెళ్లారు. వివరాలు సేకరించారు. మరో నలుగురు అల్బెండజోల్ మాత్రను వేసుకొన్న మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు బావించి చిన్నారులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారి పరిస్థితి బాగానే వుందని వైద్యులు తనిఖీలు చేసి పంపించారు. నివేదిక ఇవ్వండి : మంత్రి బాలుడి మృతికి కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను అందించాలని డీఎంహెచ్ఓ విజయలక్ష్మికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఫోన్లో ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంటో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు.. రైల్వేలో ఉద్యోగం చేసుకుంటూ కాకినాడలో స్థిరపడిన చంద్రశేఖర్, సుజాతలు తన సొంత గ్రామమైన కొట్నాన రామినాయుడు వలస వచ్చారు. తల్లిదండ్రులు శివున్నాయుడు, అప్పమ్మలను చూసేందుకు వచ్చారు. శుక్రవారం కాకినాడ వెళ్లేందుకు సిద్ధం కాగా గురువారం నులిపురుగులు దినోత్సవం కావడంతో తన కుమారుడికి కూడా మాత్రవేసి పొట్టలో నులిపురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయని భావించి అంగన్వాడీ కేంద్రానికి నాన్నమ్మ అప్పమ్మతో పంపించారు. అక్కడ ఇచ్చిన మాత్రను మింగిన తరువాత తన కుమారుడు మృతి చెందాడని రోదిస్తూ పుట్టెడు దుఖఃంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మొదటి సంతానానికి మాత్ర కాటేసింది చంద్రశేఖర్, సుజాతల మొదటి సంతానం జశ్వింత్‌నాయుడు సొంత గ్రామంలో మాత్ర రూపంలో మృత్యువు కాటేసిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఈ సంఘటన అందర్ని కన్నీరు తెప్పించింది. కాగా సుజాత ప్రస్తుతం గర్భిణి కావడంతో మరణించిన వార్త ఆమెకు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. -
నులి పురుగులను నలిపేద్దాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పిల్లల్లో నులి పురుగుల నిర్మూలనకు సమయం ఆసన్నమైంది. ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందజేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేస్తారు. జిల్లావ్యాప్తంగా ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 8.30 లక్షల మంది ఉన్నారు. వీరికి ఆల్బెండజోల్ మాత్రలే వేసేందుకు మొత్తం 4,516 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 10వ తేదీన మాత్రలు వేసుకోకుండా మిగిలిపోయిన వారికి ఈనెల 17వ తేదీన మరోసారి వేస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ పవార్ తెలిపారు. ఇవే కేంద్రాల్లో మాత్రలు వేస్తారని పేర్కొన్నారు. నిర్దిష్ట వయసు గల పిల్లలందరికీ మాత్రలు వేయించాలని ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. రక్తహీనత.. బలహీనత ముఖ్యంగా 19 ఏళ్లలోపు పిల్లలపై నులి పురుగులు, ఏలికపాములు, కొంకి పురుగుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి సంక్రమిస్తే పిల్లల్లో రక్తహీనతకు గురవుతారు. పోషకాహార లోపం కనిపిస్తుంది. కడుపునొప్పి బాధతోపాటు శరీరం బలహీనతగా అనిపిస్తుంది. ఆందోళనకు గురవుతున్నారు. క్రమంగా బరువు కూడా తగ్గుతారు. ఏకాగ్రత లోపిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. తదితర లక్షణాలు కనిపిస్తే సదరు పిల్లలకు నులి పురుగులు సంక్రమించినట్లుగా భావించాలని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వీటిని నివారించవచ్చు. కలుషిత ఆహారం తీసుకోవడం, బహిరంగ మల విసర్జన, చేతులు సరిగ్గా కడగకపోవడం తదితర వాటి వల్ల నులి పురుగులు అధికంగా సంక్రమిస్తాయి. -
నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ 10న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఆల్బెండజోల్ మాత్రలను ఇస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన మాత్రలు ఇస్తామన్నారు. 1–19 ఏళ్ల మధ్య వయసు కలిగిన 99.56 లక్షల మంది పిల్లలకు ఈ మాత్రలు అందజేస్తామని పేర్కొన్నారు. పిల్లల్లో సాధారణంగా ఏలిక, నులి, కొంకి పురుగులు కనిపిస్తుంటాయని, ఇవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధి చెందుతాయన్నారు. ఈ పురుగులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణాలు బహిరంగ మల విసర్జన, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 41,337 మంది ఉపాధ్యాయులు, 35,700 అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆల్బెండజో ల్ మాత్ర వేయడంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవని, నులిపురుగుల సంక్రమణ ఎక్కువగా ఉన్న పిల్ల ల్లో వికారం, వాంతులు, కళ్లు తిరగడం లాంటివి ఉండే అవకాశముందన్నారు. ప్రతికూల ప్రభావాల కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఈ మందులు ఎక్కడివి ?
యాగగిరిగుట్ట(ఆలేరు) : ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న అమ్మాయిల అక్రమ రవాణా.. బాలికల శరీర ఎదుగుదలకు ఇస్తున్న ఈస్ట్రోజన్ ఇంజక్షన్లకు సంబంధించిన కేసులు నడుస్తున్న క్రమంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం కొన్ని టాబ్లెట్లు, సిరంజీలు లభ్యమయ్యాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ చేసే దారిలోని హైస్కూల్ వెనకాల ఏవరో గుర్తు తెలియని వ్యక్తులు ట్యాబ్లెట్స్, సిరంజీలు పడేశారు. దీంతో స్థాని కులు కొందరు వాటిని చూసి ఆందోళన చెం దారు. వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో గుర్తుతెలియని వ్యక్తులు వీటి ని పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మందుల పక్కకే బాలామృతానికి సంబందించిన బ్యాగ్‌లు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. బ్యాగ్‌ను ఓ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ కింద పడేసి వెళ్లడంతో అక్కడ ఉన్న కోతులు బయటకు తీసుకురావడంతో అందులో అన్ని మందులు, సిరంజీలు బయటపడ్డాయని గిరి ప్రదక్షిణ చేసిన ప్రజలు తెలిపారు. -
డీ వార్మింగ్ మాత్రలు అందించాలి
డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎంజీఎం : జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన నిర్వహించే డీవార్మింగ్ డే కార్యక్రమంలో భాగంగా 19 ఏళ్లలోపు ఉన్న పిల్లలు, విద్యార్థులకు డీ వార్మింగ్ (నులి పురుగుల నిర్మూలన) మాత్రలు అందించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు వైద్య సిబ్బందికి సూచించారు. ఈ మేరకు మంగళవారం వరంగల్‌లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సీనియర్ పబ్లిక్ హెల్ ఆఫీసర్స్, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నులిపురుగుల కారణంగా చిన్నపిల్లల్లో రక్తహీనత, పోషకహార లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి సమస్యలు తలెత్తుతాయన్నారు. నులిపురుగులతో చదువులో వెనుకబడడంతో పాటు చురుకుదనం తగ్గి పాఠశాలకు హాజరుకారన్నారు. వైద్య సిబ్బంది పిల్లలు, విద్యార్థులందరికీ తప్పకుండా డీ వార్మింగ్ మాత్రలు అందించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, జబ్బార్, కోఆర్డినేటర్ శ్యామనీరజ, డీఐఓ హరీష్‌రాజు, ఐడీఎస్పీ వైద్యాధికారి కృష్ణారావు, డెమో అశోక్‌రెడ్డి, డిప్యూటీ డెమో స్వరూపరాణి, నాగరాజు హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్ పాల్గొన్నారు.