
హైస్కూల్ వెనకాల లభ్యమైన మందు బిళ్లలు
యాగగిరిగుట్ట(ఆలేరు) : ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న అమ్మాయిల అక్రమ రవాణా.. బాలికల శరీర ఎదుగుదలకు ఇస్తున్న ఈస్ట్రోజన్ ఇంజక్షన్లకు సంబంధించిన కేసులు నడుస్తున్న క్రమంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం కొన్ని టాబ్లెట్లు, సిరంజీలు లభ్యమయ్యాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ చేసే దారిలోని హైస్కూల్ వెనకాల ఏవరో గుర్తు తెలియని వ్యక్తులు ట్యాబ్లెట్స్, సిరంజీలు పడేశారు.
దీంతో స్థాని కులు కొందరు వాటిని చూసి ఆందోళన చెం దారు. వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో గుర్తుతెలియని వ్యక్తులు వీటి ని పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మందుల పక్కకే బాలామృతానికి సంబందించిన బ్యాగ్‌లు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. బ్యాగ్‌ను ఓ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ కింద పడేసి వెళ్లడంతో అక్కడ ఉన్న కోతులు బయటకు తీసుకురావడంతో అందులో అన్ని మందులు, సిరంజీలు బయటపడ్డాయని గిరి ప్రదక్షిణ చేసిన ప్రజలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment