tahir ali
-
పాక్ లో భారత మహిళకు విముక్తి
-
పాక్ లో భారత మహిళకు విముక్తి
న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత మహిళకు పాకిస్థాన్‌లో విముక్తి లభించింది. బలవంతంగా తనను పెళ్లి చేసుకున్న ఓ పాకిస్థాన్ వ్యక్తి నుంచి విడిపోయి తిరిగి భారత్ వచ్చేందుకు పాక్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు పాక్‌కు చెందిన ఓ టీవీ చానెల్ తెలిపింది. ఉజ్మా అనే 20 ఏళ్ల భారతీయ మహిళ గత నెలలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వెళ్లి తనను భారత్‌కు పంపించాలని, తనకు తుపాకీ గురిపెట్టి మరీ తాహిర్ అలీ అనే ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడని విజ్ఞప్తి చేసుకుంది. ఆ తర్వాత ఇస్లామాబాద్ కోర్టుకు వెళ్లిన ఉజ్మా.. తాహిర్ తనను వేధిస్తున్నాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తనకు తన దేశం వెళ్లే అనుమతి ఇవ్వాలని కోరింది. తనకు ప్రాణహానీ కూడా ఉందంటూ అందులో పేర్కొంది. ఆమె పిటిషన్‌ను విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు బెంచ్ జస్టిస్ మోసిన్ అక్తర్ ఖయానీ ఆమెకు భారత్ వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే, ఉజ్మాను కలిసేందుకు అనుమతివ్వాలంటూ తాహిర్ కోరగా తన గదిలో మాత్రమే కలవాలని న్యాయమూర్తి చెప్పారు. అయితే, అతడిని కలిసేందుకు ఉజ్మా నిరాకరించింది. దీంతో ఉజ్మా భారత్ వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, వాఘా సరిహద్దు దాటి వెళ్లే వరకు భద్రంగా చూడాలని న్యాయమూర్తి పోలీసుశాఖను ఆదేశించారు. ఈ నెల 30కే ఆమె వీసా గడువు ముగియనున్న నేపథ్యంలో త్వరగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. -
తుపాకీ గురిపెట్టి పెళ్లి చేసుకున్నాడు
ఇస్లామాబాద్: తన భార్యను భారత హైకమిషన్ అధికారులు నిర్బంధించారని తాహిర్ అలీ అనే పాకిస్తానీ ఫిర్యాదు చేసిన కేసు కొత్త మలుపు తీసుకుంది. తలకు తుపాకీ గురిపెట్టి అలీ తనను వివాహమాడాడని అతని భార్య ఉజ్మా(20) ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చింది. అలీ తన ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను సైతం లాక్కున్నాడని పేర్కొంది. తనను స్వదేశం పంపించాలని కోరింది. ఇంతకు ముందే వివాహమై, నలుగురు పిల్లలున్నారన్న విషయాన్ని దాచిపెట్టి అలీ తనను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఉజ్మా కేవలం విజిటింగ్ వీసాలతోనే తమ దేశంలోకి అడుగుపెట్టినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఆమెకు న్యాయసహాయం అందించడంతో పాటు ఈ విషయమై పాక్ విదేశాంగ కార్యాలయం, ఉజ్మా కుటుంబంతో చర్చిస్తున్నట్లు భారత్ పేర్కొంది. మలేసియాలో పరిచయమైన అలీ, ఉజ్మాలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాఘా సరిహద్దు ద్వారా మే1న పాక్ చేరుకున్న ఉజ్మా, మే 3న అలీని పెళ్లాడింది. -
‘తుపాకీ గురిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు’
ఇస్లామాబాద్: తలకు తుపాకీని గురిపెట్టి మరీ పాకిస్థాన్ వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ భారతీయురాలు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. తిరిగి తనను మాతృదేశం(భారత్) పంపించే వరకు వెళ్లబోనంటూ స్పష్టం చేసింది. మరోపక్క, ఆమె భర్త మాత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక వర్గాల సమాచారం ప్రకారం ఉజ్మా అనే భారతీయ మహిళకు తాహిర్ అలీ పాక్ వ్యక్తికి మలేషియాలో పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో తన బంధువులను చూసేందుకు వెళుతున్నానని చెప్పి ఉజ్మా వాఘా సరిహద్దు గుండా మే 1న పాక్‌కు వెళ్లింది. అక్కడే వారి వివాహం మే 3న అయినట్లు తెలుస్తోంది. అయితే, అతడికి అంతకు ముందే వివాహం అయినట్లు, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఉజ్మాకు తెలియదు. పైగా, కేవలం చూసేందుకు వెళ్లిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బెదిరించి, తుపాకీ గురి పెట్టి మరి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుంచి శారీరకంగా, లైంగికంగా హింసిస్తున్నాడంటూ భారత హైకమిషనర్‌ను ఆశ్రయించింది. వెంటనే తనను భారత్ పంపించాలని, తన వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ దస్తా వేజులు కూడా వారు దొంగిలించారని ఆరోపించింది. ఈ విషయంపై అటు ఇండియాలోని పాక్ హైకమిషనర్, పాక్‌లోని భారత హైకమిషనర్ సమన్వయ పరుస్తున్నాయి.