Taiwanese women
-
తైవాన్ అమ్మాయి.. తెలుగింటి అబ్బాయి
సాక్షి, చల్లపల్లి(అవనిగడ్డ): ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా చల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్, తైవాన్ దేశానికి చెందిన యూటింగ్ లియూ పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. చల్లపల్లికి చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరపిస్ట్ యూటింగ్ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి వరుడి తండ్రి కిషోర్, వధువు తండ్రి ఈషెంగ్ లియూ అంగీకరించారు. దీంతో ఈ నెల రెండో తేదీ ద్వారకా తిరుమలలో సాయి దినకర్, యూటింగ్ లియూ వివాహం తెలుగు సంప్రదాయంలో వైభవంగా నిర్వహించారు. సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు వధువు యూటింగ్ లియూ కుటుంబ సభ్యులు, బంధువులైన తైవాన్ దేశస్థులందరూ తెలుగు సంప్రదాయం ప్రకారం మహిళలు పట్టు చీరలు, పురుషులు పట్టు పంచెలు ధరించి ఆకట్టుకున్నారు. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
‘ఏడాదికోసారి స్నానం.. ఆమెతో ఉండలేను’
మన జీవితాల్లో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. దేహశుభ్రత గురించి పట్టించుకోకుంటే సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. తైవాన్‌లో వెలుగుచూసిన ఉదంతమే దీనికి తాజా రుజువు. తైపీ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ తైవాన్ పౌరుడొకరు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. భార్య నుంచి విడిపోవడానికి అతడు చెప్పిన కారణాలు విని న్యాయమూర్తులు అవాక్కయ్యారు. తన భార్య ఏడాదికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని చెప్పి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు ఉదయాన్నే పళ్లు తోముకోదని, శిరోజాలను కూడా శుభ్రంగా ఉంచుకోదని తెలిపాడు. తాము ప్రేమించుకునేటప్పడు వారానికి ఒకసారి స్నానం చేసేదని, పెళ్లైన తర్వాత పరిస్థితి దారుణంగా మారిందన్నాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్నానమాడేదని, దీని కోసం 6 గంటల సమయం తీసుకునేదని వివరించాడు. ఉద్యోగం చేయొద్దని ఆమె పెట్టే బాధ భరించలేక కొన్నాళ్లు జాబ్ మానేసి, అత్తారింట్లో ఉన్నానని చెప్పాడు. 2015 చివర్లో తన భార్యకు చెప్పకుండా ఇళ్లు విడిచి వెళ్లిపోయి సించు అనే ప్రాంతంలో ఉద్యోగంలో చేరానని తెలిపాడు. అయితే నెల రోజుల తర్వాత తన ఆచూకీ తెలుసుకుని వచ్చిన ఆమె ఉద్యోగం మానేయాలని మళ్లీ ఒత్తిడి చేయడంతో భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానన్నాడు. తనపై భర్త చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. అతడిని తన తల్లిదండ్రులు సొంత కొడుకులా చూసుకున్నారని తెలిపింది. -
నిత్య యవ్వనులు..!
వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతూ వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అది ఒక రకంగా కరెక్టే ఏమో కానీ ఈ ఫొటోలోని తైవాన్ మహిళలను చూస్తే మాత్రం కచ్చితంగా తప్పని ఒప్పుకోవాల్సిందే. ఈ ఫొటోలోని ముద్దుగుమ్మలను చూసి వారి వయసు అటు ఇటుగా టీనేజ్‌కు దగ్గరగా ఉందని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ ముగ్గురు సోదరీమణుల వయసులు వరుసగా 41, 40, 36 సంవత్సరాలు. ఇదంతా ఒక ఎత్తయితే ఇన్సెట్లో ఉన్న వారి తల్లి వయసు చెప్తే ఇంకేమంటారో!! ఆమెకు అక్షరాలా 60 ఏళ్లు. ఇంత లేటు వయసులోనూ అందంలో తన కూతుళ్లతో పోటీ పడుతూ అందరినీ దృష్టిని ఆకర్షిస్తోందీమె. సోదరీమణుల్లో ఒకరైన ల్యూర్ సూ (41) ఇంటీరియర్ డిజైనర్, ఫ్యాషన్ బ్లాగర్‌గా పనిచేస్తోంది. మిగిలినవారి పేర్లు.. షారోన్ (36), ఫేఫే (40). వీళ్లిద్దరూ కూడా టీనేజ్‌లో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే అంతే అందంతో ఉండడం గమనార్హం. వీరి ఫొటోలను తైవాన్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరి మైండ్లు బ్లాక్ అయిపోతున్నాయి. ఈ నలుగురిని అక్కడి ప్రజలు నిత్య యవ్వనులు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే 40వ ఏటా అడుగిడిన ఫేఫేకు 8 ఏళ్లు, 10 ఏళ్లు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారంటే నమ్మగలమా? ఈ సందర్భంగా ఫేఫే మాట్లాడుతూ తమ తండ్రి (74) కూడా వయసులో చక్కగా అందంగా ఉండేవాడని, ఫొటో సెషన్‌కు రమ్మంటే సిగ్గుతో వెనుకడుగు వేశాడని చెబుతోంది. తాము ఇప్పటికీ ఇంత యవ్వనంగా ఉండడానికి తమ తల్లిదండ్రుల జీన్స్ ఒక కారణం అయితే మంచి నీరు ఎక్కువగా తీసుకోవడం మరొక కారణమని చెబుతోంది.