నిత్య యవ్వనులు..! | Everlasting young ladies .. | Sakshi
Sakshi News home page

నిత్య యవ్వనులు..!

Published Sun, Jul 2 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

నిత్య యవ్వనులు..!

నిత్య యవ్వనులు..!

వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతూ వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అది ఒక రకంగా కరెక్టే ఏమో కానీ ఈ ఫొటోలోని తైవాన్‌ మహిళలను చూస్తే మాత్రం కచ్చితంగా తప్పని ఒప్పుకోవాల్సిందే. ఈ ఫొటోలోని ముద్దుగుమ్మలను చూసి వారి వయసు అటు ఇటుగా టీనేజ్‌కు దగ్గరగా ఉందని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ ముగ్గురు సోదరీమణుల వయసులు వరుసగా 41, 40, 36 సంవత్సరాలు. ఇదంతా ఒక ఎత్తయితే ఇన్‌సెట్లో ఉన్న వారి తల్లి వయసు చెప్తే ఇంకేమంటారో!! ఆమెకు అక్షరాలా 60 ఏళ్లు. ఇంత లేటు వయసులోనూ అందంలో తన కూతుళ్లతో పోటీ పడుతూ అందరినీ దృష్టిని ఆకర్షిస్తోందీమె.

సోదరీమణుల్లో ఒకరైన ల్యూర్‌ సూ (41) ఇంటీరియర్‌ డిజైనర్, ఫ్యాషన్‌ బ్లాగర్‌గా పనిచేస్తోంది. మిగిలినవారి  పేర్లు.. షారోన్‌ (36), ఫేఫే (40). వీళ్లిద్దరూ కూడా టీనేజ్‌లో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే అంతే అందంతో ఉండడం గమనార్హం. వీరి ఫొటోలను తైవాన్‌ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరి మైండ్లు బ్లాక్‌ అయిపోతున్నాయి. ఈ నలుగురిని అక్కడి ప్రజలు నిత్య యవ్వనులు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే 40వ ఏటా అడుగిడిన ఫేఫేకు 8 ఏళ్లు, 10 ఏళ్లు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారంటే నమ్మగలమా? ఈ సందర్భంగా ఫేఫే మాట్లాడుతూ తమ తండ్రి (74) కూడా వయసులో చక్కగా అందంగా ఉండేవాడని, ఫొటో సెషన్‌కు రమ్మంటే సిగ్గుతో వెనుకడుగు వేశాడని చెబుతోంది. తాము ఇప్పటికీ ఇంత యవ్వనంగా ఉండడానికి తమ తల్లిదండ్రుల జీన్స్‌ ఒక కారణం అయితే మంచి నీరు ఎక్కువగా తీసుకోవడం మరొక కారణమని చెబుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement