Taj
-
తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు
-
ఒక్క జిలేబీ చాలు.. కుటుంబానికి పండుగే!
కళ, సాహిత్యం, సంస్కృతి, ఆహారం.. ఇవే తాజ్ మహోత్సవ్ ప్రత్యేకతలు. యూపీలోని ఆగ్రాలోగల శిల్పగ్రామ్లో ఫిబ్రవరి 17న తాజ్ మహొత్సవ్ ప్రారంభమయ్యింది. ఇది ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది. ప్రస్తుతం జరుగుతున్న తాజ్ మహోత్సవ్‌లో 300లకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వంటకాలకు సంబంధించిన స్టాల్స్ ఆహార ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి. వీటిలో హరియాణా జిలేబీ స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. హరియాణాకు చెందిన నరేష్ కుమార్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ముందు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ జిలేబీ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క జిలేబీ కుటుంబం అంతటికీ సరిపోతుంది. ఐదుగురు సభ్యులు కలిగిన కుటుంబం ఈ ఒక్క జిలేబీని హాయిగా ఆరగించి ఆనందించవచ్చు. 1952లో తన తాత హరిశ్చంద్ర హల్వాయి ఈ జిలేబీని తయారు చేయడం ప్రారంభించాడని నరేష్ తెలిపారు. తమ మూడో తరం కుటుంబ సభ్యులు కూడా జిలేబీ వ్యాపారంతోనే ఆదాయం సమకూర్చుకుంటున్నామన్నారు. గత 15 ఏళ్లుగా తాజ్ మహోత్సవ్‌లో జలేబీ స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాము తయారు చేసే జిలేబీ బరువు దాదాపు 250 గ్రాములు ఉంటుందని తెలిపారు.ఈ జిలేబీ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని పేర్కొన్నారు. తాజ్ మహోత్సవ్‌ను సందర్శించే ప్రతీఒక్కరూ ఈ జిలేబీని రుచి చూడాలని కోరుకుంటారని, ఒక్కో జిలేబీ ధర రూ. 400 అని స్టాల్ నిర్వాహకులు నరేష్ తెలిపారు. తాము రూపొందించే జిలేబీని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రుచి చూశారని నరేష్ కుమార్ మీడియాకు తెలిపారు. -
ఘనంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి నిశ్చితార్థం
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్ చౌదరికి బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వేత్త మేక సత్యనారాయణ కుమార్తె జ్ఞానితతో నిశ్చితార్థం శనివారం తాజ్ బెంగళూరులో ఘనంగా జరిగింది. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? ఈ వేడుకలో టీటీడీ చైర్మన్,ఉమ్మడి విశాఖ జిల్లా కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి,విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని,ఎంపీలు మద్దిల గురుమూర్తి, సంజీవ్‌కుమార్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎ.అదీప్‌రాజ్, కె.శ్రీనివాసరావు,రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ రఘరాజు, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, సమన్వయకర్త కె.కె.రాజు, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ఆశీర్వదించారు. డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి,వైఎస్సార్సీపీ నాయకుడు ఆళ్ల శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. -
తాజ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ప్రవాసీ తెలుగు సంఘమైన తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్దా) ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న తెలుగు ప్రవాసీయులను అభినందిస్తూ పురస్కరించారు. తెలుగు భాష వ్యాప్తి కొరకు ప్రవాసీయులకు సాఫ్ట్‌వేర్‌ను ఉచింతగా అందించిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ సయీదోద్దీన్ను ఈ కార్యక్రమంలో సన్మానించారు. అక్కడి పాఠశాలలో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల కొరకు తెలుగు భాషను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన వారిని కూడ ఈ సందర్భంగా తాజ్ సత్కరించింది. సౌదీ అరేబియాలో తెలుగు భాష వ్యాప్తి కొరకు తాజ్ చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు మోహమ్మద్ యూసుఫ్ వివరించారు. కుల, మత మరియు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తెలుగు ప్రవాసీయుల కొరకు తాజ్ కృషి చేస్తున్నదని ప్రధాన కార్యదర్శి మేడికొండు భాస్కర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వహీద్, శ్రీ లక్ష్మిలు పాడిన గేయాలు అలరించాయి. చిన్నారి సాయి దీక్షిత సాంప్రదాయ నృత్యం, తెలుగు ప్రముఖులను అనుకరిస్తూ చిన్నారుల వేషధారణలు సభికులను ఆకట్టుకున్నాయి. -
జెద్దా తెలుగు సంఘం 'తాజ్' నూతన కార్యవర్గం
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ప్రవాసీ తెలుగు సంఘమైన తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్దా) కార్యవర్గానికి నూతన కార్యవర్గం ఎంపికైంది. సంఘం నూతన అధ్యక్షునిగా మహ్మద్ యూసుఫ్ (కరీంనగర్), ప్రధాన కార్యదర్శిగా మెడికొండు భాస్కర్ రావు (గుంటూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజ్ అవిర్భావం నుంచి ఈ ఇద్దరు సంస్థ కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషించారు. తమ సంఘంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాంత, కుల, మతాతీలకు అతీతంగా సభ్యులుగా ఉన్నారని, తాము సౌదీలోని తెలుగు ప్రవాసీయుల సంక్షేమం, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తామని యూసుఫ్, భాస్కర్ పేర్కొన్నారు. తెలుగువారు 00966561361280 లేదా 00966549103071 నెంబర్లలో సంప్రదించవచ్చుని వారు వివరించారు. -
'ఆప్' నేతకు తాజ్ ఆహ్వానం
ముంబై: ఎన్ఎస్జీ మాజీ కమాండో, ఆప్ నేత సురేందర్ సింగ్ ను ముంబైలోని తాజ్ హోటల్ యాజమాన్యం విందుకు ఆహ్వానించింది. 26/11 ముంబై దాడుల సందర్భంగా సురేందర్ వీరోచితంగా పోరాడి ఇద్దరు ముష్కరులను హతమర్చారని, అందుకే ఆయను ఇలా గౌరవించాలనుకున్నామని తాజ్ ప్రతినిధి రఘు రామ్ తెలిపారు. ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడంలో అత్యంత సాహసం ప్రదర్శించిన సురేందర్ ను గౌరవించడం సంతోషంగా ఉందని రఘు రామ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ షేర్ చేశారు. 26/11 దాడిలో అసువులు బాసిన వారికి గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముంబైలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజ్ హోటల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 2008లో ముష్కరులు తాజ్ హోటల్ పై దాడి చేసినపుడు ఎన్ఎస్జీ కమాండో గా విధుల్లో ఉన్న సురేందర్, అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో బాంబులతో దాడిచేసి, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడడంతో 166 మంది చనిపోగా వందల సంఖ్యలో గాయపడ్డారు. 26 నవంబర్ నుండి 29 నవంబర్ వరకూ మూడు రోజుల పాటు ముష్కర మారణకాండ కొనసాగింది. -
జెడ్డాలో ఉగాది సంబరాలు
జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డా, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీ కుటుంబాలు తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్ధా అధ్వర్యంలో ఉగాది పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన్మథ నామ ఉగాది పర్వదినం సందర్భంగా తమ చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడానికి నిర్ణయించిందీ సంస్థ. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ముస్లిం కుటుంబ పెద్దలకు, వారి చిన్నారులకు ఇస్లామిక్ క్విజ్ మరియు ఖురాన్ గ్రంధ పోటీలను కూడ ఉగాది సందర్భంగా తాజ్ నిర్వహించింది. తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్ధా) అధ్వర్యంలో సిలికానాంధ్ర మనబడి సహాయంతో తెలుగు బోధన కార్యక్రమాలకు ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా తాము తాజ్ అధ్వర్యంలో తెలుగు బోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికి ఉగాది నుండి దానికి పదును పెట్టడానికి సిలీకానంధ్ర మనబడితో కలిసామని తాజ్ ప్రధాన కార్యదర్శి కుంట సాగర్ చెప్పారు. ఈ సందర్భంగా సీలికానాంధ్ర మనబడి అంతర్జాతీయ విభాగానికి చెందిన శరత్ వేట అమెరికా నుండి ఫోన్ ద్వార సమావేశంలో పాల్గోన్న వారిను ఉద్దెశిస్తూ తెలుగు భాష అవశ్యకత గూర్చి నొక్కిచెప్పారు. గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల ఆర్ధిక పరిస్ధితి మరియు ఇక్కడి పాఠశాలలో తెలుగు భాష అందుబాటులో ఉన్నందున మనబడి ఫీజు ఎడారి దేశాలలో తగ్గించాలని విజ్ఞప్తి చేసారు. తాజ్ అధ్యక్షుడు శేఖ్ మస్తాన్ మరియు ప్రధాన కార్యదర్శి కుంట సాగర్ మాట్లాడుతూ కుల,మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తమ సంఘం కేవలం తెలుగు ప్రవాసీయుల కొరకు పని చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా క్విజ్ లో గెలుపొందిన వారికి తాజ్ ప్రతినిధులు విజయలక్ష్మి, శారదాంబ, మీనాక్షి, సాగర్, మస్తాన్ , యూసుఫ్ లు బహమతులు ప్రధానం చేసారు. ప్రతిభ కనబర్చిన చిన్నారులను తాజ్ మహిళ విభాగం కార్యదర్శి విజయలక్ష్మి ప్రశంసించారు. -
అదరహో అనిపించిన ఫ్యాషన్ షో