takkellapadu
-
అయ్యో తపస్వి.. ఆ కిరాతకుడు ఎంత పని చేశాడు!
సాక్షి, కృష్ణా జిల్లా: గుంటూరు తక్కెళ్లపాడులో సోమవారం జరిగిన ఘోరం.. రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది డెంటల్ విద్యార్థిని తపస్వి(21). దగ్గర్లో పరీక్షలు ఉండడంతో స్నేహితురాలి ఇంటికి చదువుకోవడానికి వెళ్లిన తపస్విపై హఠాత్తుగా దాడికి దిగిన జ్ఞానేశ్వర్.. ఆమె గొంతు కోసి పైశాచికంగా హతమార్చాడు. ఈ ఉదంతంతో కృష్ణా జిల్లా పామిడిముక్కల మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన కొన్నిరోజులకే తపస్విని వృత్తిరిత్యా తల్లిదండ్రులు తన తాత-నానమ్మల దగ్గర వదిలేశారు వెళ్లారు. అలా పెరిగి ఐదో తరగతి దాకా కృష్ణాపురంలోనే చదువుకుంది తపస్వి. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇక్కడే ఇంటర్మీడియెట్ దాకా చదువుకుంది ఆమె. నాలుగేళ్ల కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు ముంబైకి బదిలీ అయ్యింది. దీంతో.. బీడీఎస్ చదివేందుకు విజయవాడ వచ్చి హాస్టల్లో ఉంటోంది తపస్వి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జ్ఞానేశ్వర్.. ఇన్స్టాగ్రామ్ ద్వారా తపస్వితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ, పెళ్లి అంటూ వేధింపులు మొదలుపెట్టాడు. సోమవారం సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించి.. సర్జికల్ బ్లేడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె స్నేహితురాలి అరిచి.. సాయం కోసం పరిగెత్తగా తలుపులు వేసి మరీ తపస్విని ఘోరంగా చంపాడు. ఇక తపస్వి ఘోర హత్యోదంతాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కళ్ల ముందే పుట్టి పెరిగిన బిడ్డ.. ఇలా విగత జీవిగా టీవీల్లో, ఫోన్లలో కనిపించడాన్ని స్వగ్రామం కృష్ణాపురం వాసులు తట్టుకోలేకపోతున్నారు. తపస్వి చాలా ధైర్యవంతురాలని.. తనకు ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తమకేం చెప్పలేదని బంధువులు అంటున్నారు. ప్రేమ-వేధింపులు, తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన విషయం కూడా తమకేమీ తెలియదని చెప్పారు. అలాగే.. ఇలాంటివి ఇంకెక్కడా జరగకుండా చూడాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తపస్వి బంధువులు ఆవేదనగా కోరుతున్నారు. ఇదీ చదవండి: పోలీసులు హెచ్చరించినా కూడా తపస్విపై.. -
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో దారుణం
-
గుంటూరు: మెడికో గొంతు కోసి చంపిన టెకీ
పెదకాకాని: ప్రేమను నో చెప్పిందనే కోపంలో యువతి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21) విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) తృతీయ సంవత్సరం చదువుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్‌తో రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా జ్ఞానేశ్వర్ ప్రేమిస్తున్నానంటూ ఆ యువతిని వేధిస్తుండటంతో ఇటీవల విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ జ్ఞానేశ్వర్ వేధింపుల్ని ఆపలేదు. దీంతో తపస్విని 10 రోజుల క్రితం తక్కెళ్లపాడు డెంటల్ కాలేజీ విద్యార్థిని అయిన తన స్నేహితురాలి రూమ్‌కు వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ సోమవారం రాత్రి సర్జికల్ బ్లేడు, కత్తి వెంట తీసుకుని తపస్వి ఉంటున్న ప్రాంతానికి చేరుకుని.. సర్జికల్ బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనంతరం తన చేతిని కూడా కోసుకున్నాడు. ఆమె స్నేహితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని జ్ఞానేశ్వర్‌కు దేహశుద్ధి చేసి తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. తపస్విని చికిత్స నిమిత్తం మొదట ప్రైవేట్ ఆస్పత్రికి, ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి తపస్వి (21) మరణించింది. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
వైఎస్సార్–జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ప్రారంభం
-
ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
సాక్షి, జగ్గయ్యపేట : మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు. (జనం ఆస్తికి అధికారిక ముద్ర) సాహసోపేత నిర్ణయం ఎంతో కాలంగా పల్లె నుంచి పట్టణాల వరకు భూ వివాదాలు.. గట్టు వద్ద రైతన్నలు తరుచూ కీచులాటలు.. ఏళ్ల తరబడి సర్వే చేసే నాథుడే కనిపించలేదు. అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. భూమి ఒకరిదైతే మరొకరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేసిన ఘటనలు అనేకం. భూ వివాదాలను చెరిపేందుకు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైంది. -
తక్కెళ్లపాడులో సర్వే ఎలా చేశారంటే..?
సాక్షి, మచిలీపట్నం: తక్కెళ్లపాడు.. వందేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా చేసిన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్త రీసర్వేకి ఆదర్శంగా నిలిచింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో దేశంలోనే తొలిసారిగా కంటిన్యూస్ ఆపరేటింగ్ రిసీవింగ్ స్టేషన్ (కోర్స్) నెట్వర్క్ ద్వారా డ్రోన్లను ఉపయోగించి రీసర్వేకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 11 ప్రత్యేక బృందాలు 31 రోజులపాటు శ్రమించాయి. సర్వే ఎలా చేశారంటే.. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా వెబ్‌ల్యాండ్ రికార్డుల్ని అప్డేట్ చేసి తొలుత గ్రామ సరిహద్దుల గుర్తింపు చేపట్టారు. గల్లంతైన 102 సరిహద్దురాళ్లు వేశారు. రెండోదశలో 86 సర్వే నంబర్లలో ఉన్న 272.52 ఎకరాల ప్రభుత్వ భూములను, మూడోదశలో 221 సర్వే నంబర్లలో ఉన్న 1,266.45 ఎకరాల ప్రైవేటు భూములను సర్వేచేసి హద్దులు గుర్తించారు. చివరగా గ్రామంలో ఉన్న ఆలయాలు, ప్రభుత్వ భవనాలు, ఇళ్లు, ప్రైవేటు ఆస్తులు సర్వే చేశారు. గుర్తించిన వ్యత్యాసాలకు సంబంధించిన 9 (2) నోటీసులపై 147 అప్పీళ్లు వచ్చాయి. వీటిలో 112 అప్పీళ్లను పరిష్కరించారు. మిగిలిన కేసులను పరిష్కరించి 10వ తేదీన ఫైనల్ పబ్లికేషన్ జారీచేశారు. కొత్తగా రూపొందించిన గ్రామ మ్యాప్, ఎఫ్ఎంబీ, ఆర్ఎస్ఆర్, అడంగల్, ఐబీ, ప్రభుత్వ భూముల రిజిష్టర్లను నేడు (సోమవారం) ప్రకటిస్తారు. భూ యజమానులకు కొత్త పాస్‌పుస్తకాలు జారీచేస్తారు. కొత్త సర్వే రాళ్లు పాతుతారు. గుర్తించిన వ్యత్యాసాలు ఎఫ్ఎంబీ ప్రకారం 6.04 శాతం, అడంగల్ ప్రకారం 11.25 శాతం వ్యత్యాసం ఉన్నట్లుగా గుర్తించారు. సబ్ డివిజన్ల ప్రకారం అత్యధికంగా 2.10 ఎకరాలు, అత్యల్పంగా 0.01 ఎకరాలు, అడంగల్ ప్రకారం అత్యధికంగా 3.73 ఎకరాలు, అత్యల్పంగా 0.01 సెంట్ల తేడా ఉన్నట్లు నిర్ధారించారు. పాత ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నంబరు 97లో 1.46 ఎకరాలు ఎక్కువ, సర్వే నంబరు 125లో 0.80 ఎకరాలు తక్కువ ఉన్నట్టుగా గుర్తించారు. అడంగల్ ప్రకారం 3.73 ఎకరాలు తక్కువగా నమోదైనట్టుగా లెక్క తేల్చారు. (చదవండి: జనం ఆస్తికి అధికారిక ముద్ర) -
నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్ళపాడులో నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు తమిళనాడులోని పళని జిల్లాకు చెందిన నక్కలవెల్లి రాజాగా పోలీసులు గుర్తించారు. నాలుగు నెలలుగా చేపల చెరువువద్ద పిట్టలు తోలడానికి కాపలాగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండవల్లి పోలీసులు వెల్లడించారు. -
తక్కెళ్లపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్ర 105రోజు ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తక్కెళ్లపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి జె.వంగులూరు, అరికట్లవారిపాలెం, గంగవరంలో ఆయన ప్రజలతో మమేకం అవుతారు. ఇంకొల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ ఆయన 1,414.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటే తప్పేంటి?: అంబటి
* జగన్‌ను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? * టీడీపీపై అంబటి రాంబాబు ధ్వజం హైదరాబాద్: రైతులను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తూ కర్కశంగా వారిని అణగదొక్కాలని చూస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూలిపోవాలని రైతాంగం కోరుకుంటే తప్పేమిటని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పరిస్థితులు వివరించడానికి వచ్చిన రైతులను ఉద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాన్ని తప్పు పడుతూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు ఆయనపై ముప్పేట దాడి చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ ‘జగన్ రైతులనుద్దేశించి మాట్లాడిన ప్రతి మాట ఆయనది కాదు, జగన్ మాట్లాడింది జనం మాట’ అని సమర్థించారు. ప్రభుత్వం పడిపోవాలనేది జగన్ కోరిక కాదని తుళ్లూరు ప్రాంత రైతులు తమను బాధలు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే పడిపోతే బాగుండుననే భావనతో ఉన్నారని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పోలీసులను ప్రయోగించి ఫాసిస్టులాగా వ్యవహరిస్తున్నారన్నారు. శ్రీనాథ్ చౌదరి అనే వ్యక్తి రాజధానికి తాము భూములు ఇవ్వము అన్నందుకు ఏడు రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లి ఇప్పటి వరకూ వదల్లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని, జగన్ ప్రతిపక్ష నేతే కాదని చంద్రబాబు తాబేదార్లు విమర్శిస్తున్నారని వారన్నట్లు నిజంగా జగన్ ప్రతిపక్ష నేత కాకుంటే ఆయనపై ఎందుకింత అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన ప్రశ్నించారు. నాడు కబడ్దార్ అన్నారే...! మే 14, 2011లో చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నపుడు గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో మాట్లాడుతూ రైతుల భూముల జోలికి వస్తే కబడ్దార్ అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇపుడేమో రాజధాని ప్రాంత రైతులనే కబడ్దార్ అంటూ బెదిరిస్తున్నారని అంబటి దుయ్యబడుతూ అప్పట్లో టీడీపీ అనుకూల పత్రిక ఒకటి ఈ మేరకు రాసిన వార్త ప్రతిని విలేకరులకు చూపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి భూములను సేకరించాలని, ఆ లాభం రైతులకే చెందాలని, రైతులే సెజ్‌లు పెట్టాలని, తాడేపల్లి, పెనుమాక గ్రామాల్లో భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హెచ్చరించిన చంద్రబాబు ఇపుడు మాట్లాడుతున్నదేమిటని ఆయన అన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులను అధికారులపై తిరగబడాలని పిలుపు నిచ్చిన చంద్రబాబు ఇపుడు అదే అధికారులు, పోలీసుల చేత రైతులను అణచివేయాలని చూస్తున్నారని ఆయన నిలదీశారు. ప్రభుత్వంలో ఉన్నపుడు రైతులకు అనుకూలంగా మాట్లాడి, ఇపుడు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంపై చంద్రబాబు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు. రాజధాని రైతుల పక్షాన జగన్ మాట్లాడితే ఆయన ఇడుపులపాయలో రాజధాని పెట్టాలంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు జగన్ ఎపుడైనా ఆ మాట అన్నారా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు భూసేకరణతో ఏంపని? పోలీసులు భూసేకరణ వ్యవహారంలో తలదూరిస్తే ప్రజాస్వామిక వాదులు సహించరని అంబటి హెచ్చరించారు. పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షించాలే తప్ప భూములివ్వబోమని చెప్పిన రైతులను వేధించడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయం గుర్తెరిగి వారు వ్యవహరించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పనితీరు భేష్! అని లోకేష్ చేయించిన సర్వేలో ప్రజాభిప్రాయం వ్యక్తమైందని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావిస్తూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు అనేకసార్లు తప్పి పాసైన మొద్దబ్బాయ్ కథను ఈ వ్యవహారం గుర్తుకు తెస్తోందని వ్యంగంగా అన్నారు. తన పాలనకు లోకేష్ 70 మార్కులు వేశారని ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న చంద్రబాబు తుళ్లూరు ప్రాంతానికి వెళితే అక్కడ ఒక్క మార్కు కూడా వేయరన్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రతిపక్ష నేత జగన్ తప్పకుండా పర్యటిస్తారని అంబటి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.