సాక్షి, జగ్గయ్యపేట : మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు. (జనం ఆస్తికి అధికారిక ముద్ర)
సాహసోపేత నిర్ణయం
ఎంతో కాలంగా పల్లె నుంచి పట్టణాల వరకు భూ వివాదాలు.. గట్టు వద్ద రైతన్నలు తరుచూ కీచులాటలు.. ఏళ్ల తరబడి సర్వే చేసే నాథుడే కనిపించలేదు. అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. భూమి ఒకరిదైతే మరొకరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేసిన ఘటనలు అనేకం. భూ వివాదాలను చెరిపేందుకు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైంది.
ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
Published Mon, Dec 21 2020 11:17 AM | Last Updated on Mon, Dec 21 2020 7:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment