re-survey
-
తప్పలేదు.. రీ సర్వే మళ్లీ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూములను యజమానులకు పూర్తి హక్కులతో అప్పజెప్పేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేను చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొనసాగించక తప్పడంలేదు. రైతులు, ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన ఈ రీసర్వేపై ఎన్నికల సమయంలో చంద్రబాబు, కూటమి నేతలు ఎంతగా దు్రష్పచారం చేసినప్పటికీ, అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రారంభించాల్సిన తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత్యంతరం లేక రీ సర్వేను మళ్లీ ప్రారంభించాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందుకనుగుణంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో రీ సర్వే కొనసాగించేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రీ సర్వే, అందులో భాగమైన లాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూములు లాగేసుకున్నారని, కబ్జా చేశారని, విస్తీర్ణం తగ్గించేశారని, రికార్డులు ట్యాంపర్ చేశారంటూ చంద్రబాబు ఎన్నికల్లో రకరకాల తప్పుడు ఆరోపణలు చేశారు. భూముల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే లాండ్ టైట్లింగ్ చట్టంపై అభూతకల్పనలు సృష్టించి, దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే రద్దు చేశారు. 17 వేల గ్రామాలకుగానూ 6,800కి పైగా గ్రామాల్లో పూర్తయిన భూముల రీ సర్వేను కూడా నిలిపివేశారు. సర్వేలో తప్పులు జరిగాయని, వాటిని సరి చేస్తామంటూ హడావుడి చేశారు. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ రీ సర్వేలో జరిగిన తేడాలపై వినతులు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు వచి్చన విజ్ఞాపనల్లో భూతద్దం పెట్టి వెతికినా రీ సర్వేలో వారు ఆశించిన స్థాయిలో తప్పులు దొరకలేదు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన రీ సర్వేలో లోపాలు లేవని రెవెన్యూ సదస్సుల్లోనే స్పష్టమైంది.జగన్ హయాంలో జరిగిన సర్వేకురూ.200 కోట్ల ప్రోత్సాహకంకేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో దేశంలోనే మొదటిసారిగా జరిగిన రీ సర్వేను కొనియాడింది. అన్ని రాష్ట్రాలు భూముల రీ సర్వే చేసి డిజిటల్ రికార్డులు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. అలా చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఆమె చెప్పిన రీ సర్వేను ఏపీ అప్పటికే చాలా వరకు చేయడంతో ఈ ప్రోత్సాహకానికి రాష్ట్రం ఎంపికైంది. జగన్ హయాంలో జరిగిన రీ సర్వేకి ప్రోత్సాహకంగా వచి్చన రూ.200 కోట్లను ఇప్పడు టీడీపీ ప్రభుత్వం స్వీకరించింది. ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వయంగా ప్రకటించారు. రీ సర్వేలో పెద్దగా లోపాలు లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం దానికి ప్రోత్సాహకం ప్రకటించడంతో అనివార్య పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం దానిని కొనసాగిస్తోంది. మండలానికో గ్రామంలో పైలట్‌గా సర్వే రీసర్వే కొనసాగింపునకు ప్రభుత్వం కలెక్టర్లకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. మొదట మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌గా తీసుకుని 200 నుంచి 250 ఎకరాల్లో రీ సర్వే చేయాలని సూచించింది. సర్వేలో ప్రైవేటు భూములతోపాటు గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, నీటి వనరులున్న భూములు, పోరంబోకు భూములను కొలిచి సరిహద్దు రాళ్లు నాటాలని చెప్పింది. సర్వే బృందాలు భూ యజమానులతోపాటు చుట్టుపక్కల భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. సర్వే గురించి ఆ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, సోషల్ మీడియా ద్వారా కూడా సమాచారం పంపాలని సూచించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలు సర్వే బృందాలను నియమిస్తుండగా మరికొన్ని జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రీ సర్వే ప్రారంభించాలని భావిస్తున్నారు. -
రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గొప్ప సంస్కరణ
రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఎన్నికల ముందు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం నుంచి బయట పడటానికి చట్టాన్ని రద్దు చేశారు. ల్యాండ్ రిఫారŠమ్స్ చేపట్టే రాష్ట్రాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ఎన్నికల ముందు చేసింది దుష్ప్రచారంఅని చెప్పడానికి ఇంతకంటే రుజువుఏం కావాలి? – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘భూముల రీసర్వే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు.. ఇదొక గొప్ప సంస్కరణ. ఈ చట్టం ద్వారా భూములు కొనుగోలు చేసే వాళ్లకే కాదు.. అమ్మే వాళ్లకు సైతం రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. ఇన్సూ్యరెన్స్ కూడా కల్పిస్తుంది. టైటిల్స్‌ను వెరిఫై చేసి భూ యజమానుల సమక్షంలోనే సరిహద్దు రాళ్లు పాతి.. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం. ఇలాంటి చట్టంపై ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు దారుణంగా తప్పుడు ప్రచారం చేశారు. దాన్నుంచి బయట పడేందుకు ఇప్పుడు పాట్లు పడుతున్నారు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. శ్వేతపత్రం పేరిట ఈ చట్టంపై చంద్రబాబు చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఫ్యాక్ట్ పేపర్ పేరిట వైఎస్ జగన్ శుక్రవారం తిప్పికొట్టారు. ‘రీ సర్వే కోసం సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఈ ప్రాజెక్టు కోసం నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు 9.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఒరిజినల్ డాక్యుమెంట్లే పొందారు. ఇలా రిజిస్ట్రేషన్ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. అయినా సరే పనిగట్టుకొని ఈ చట్టంపై ఎన్నికల్లో దుర్మార్గంగా ప్రచారం చేశారు. లేని పోని అపోహలు, భయాందోళనలకు గురిచేశారు. పదేపదే చెప్పిన అబద్ధాలు.. దుష్ప్రచారం నుంచి బయట పడేందుకు అసెంబ్లీలో ఆ చట్టాన్ని రద్దు చేశారు. తీరా ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్‌ను ముందుకు తీసుకెళ్లే రాష్ట్రాలకు ఇన్సెంటివ్‌గా 50 ఏళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో రీ సర్వేపై మళ్లీ యూ టర్న్ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. రికార్డులన్నీ అప్గ్రేడ్అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా ల్యాండ్ టైటిల్ వివాదాలు విన్పించవు. క్రయవిక్రయాల సందర్భంగా ఎక్కడా భూ వివాదాలు తలెత్తవు. కారణం అక్కడ టైటిల్స్ పక్కాగా ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ ఈరోజు భూములు కొనుక్కోవాలంటే భయపడే పరి స్థితి. రేప్పొద్దున మీ భూమికి ఓనర్ తామే అంటూ ఎవరో ఒకరు వస్తారని కొనే వాళ్లకు భయం. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకే ల్యాండ్ టైట్లింగ్ యాక్టును తీసుకొచ్చాం. ఈ యాక్టు ద్వారా కొనే వారికి, అమ్మే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. బీమా ఇస్తుంది. ఇందు కోసం 15వేల మంది సర్వేయర్లను నియామకంతో పాటు రోవర్స్, సరిహద్దు రాళ్లు పెట్టాం. రికార్డులన్నీ అప్‌గ్రేడ్ చేశాం. మ్యూటేషన్ పూర్తి చేశాం. సబ్ డివిజన్ చేశాం. ప్రతి రికార్డును సచివాలయంలోనే అందుబాటులో ఉంచాం. టెటిల్స్ వెరిఫై చేసి మీ సమక్షంలోనే సరిహద్దు రాళ్లు పాతి గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశాం. ఒక్క ఫిర్యాదు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలుంటే వాటిలో 8 వేల గ్రామాలలో రీ సర్వే పూర్తి చేశాం. ఇప్పటికే 9.50 లక్షల మంది రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇచ్చాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచే కాకుండా, రీ సర్వే పూర్తయిన గ్రామాల నుంచి కూడా ఏ ఒక్కరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అలాంటి ఈ యాక్టుపై ప్రజల్లో అపోహలు సృష్టించి చేసి ఓ మంచి కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు. ఆ దుష్ప్రచారం నుంచి బయటపడలేక అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది. అసైన్డ్, షరతులు, చుక్కల భూముల విషయంలో దశాబ్దాలుగా ఇబ్బందులు పడిన రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేసింది. 97 వేల మందికి.. 2,06,171 ఎకరాల చుక్కల భూములపై హక్కులు కల్పించింది. 35 వేల ఎకరాల షరతులు కలిగిన భూములను 22ఏ నుంచి తొలగించి 22వేల మంది రైతులకు మేలు చేస్తే అవినీతి అన్నారు. 20 ఏళ్లు పూర్తయిన 27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై 15,21,160 మంది దళితులు, పేద రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తే అవినీతి, అన్యాయమంటూ దుష్ప్రచారం చేశారు. మా ప్రభుత్వంలో 42,397 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేశాం. 1.54 లక్షల మంది గిరిజనులకు 3.26 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశాం. విలేజ్ సర్వీస్ ఇనాం ల్యాండ్స్ కింద 1.58 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించి, 1.61లక్షల మంది రైతులకు మంచి చేశాం. చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లక్షల మందికి మంచి చేస్తే ప్రశంసించాల్సింది పోయి దాన్ని తమకు అనుకూలంగా వక్రభాష్యం చెప్పగలిగినó నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. భూముల విషయంలో ఆయన ఆలోచన విధానం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేయనీయకుండా అడ్డుకుంటున్నాడో ఆలోచించాలి. బహుశా.. ఈ భూములపై హక్కులను తమ వాళ్ల పేరిట మార్చుకొనేందుకు అవకాశం కల్పించేందుకే చంద్రబాబు అడ్డుకుంటున్నాడా.. అని ప్రజలు ఆలోచించాలి. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇలాగే కొనసాగించి, తన మనుషులతో తక్కువ రేటుకు కాజేయాలని అడ్డుకుంటున్నాడేమో అనిపిస్తుంది. పేదలకు వాళ్ల భూములు వాళ్లు అమ్ముకునే స్వేచ్చ ఉండకూడదు. అప్పుడే తక్కువ రేటుకు కాజేయొచ్చన్న ఆలోచన చంద్రబాబుది. -
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించిన రాషŠట్ర ప్రభుత్వం, అన్ని గ్రామాల్లో శరవేగంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా 2,526 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. రీ సర్వే పూర్తయి, ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ నంబర్) వచ్చిన గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దశలవారీగా విస్తరణ తొలిసారి 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించి, రెండోదశలో 1500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు మళ్లీ 2,526 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నది. ఇందుకోసం సచివాలయాలను సబ్ డిస్ట్రిక్టులుగా నోటిఫై చేసి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రభుత్వం ప్రకటించింది. బాధ్యతలు ఎవరికంటే... అక్కడ పనిచేసే కార్యదర్శులకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా అధికారం కల్పించారు. డిజిటల్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కార్యదర్శులకు సహకరించే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం సీఎస్ జవహర్ రెడ్డి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. త్వరలో మరో రెండువేల గ్రామాల్లో... ఇప్పటివరకు గ్రామ సచివాలయాల్లో 4 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందుకోసం సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై శిక్షణ ఇచ్చారు. గ్రామ సచివాలయాలతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూముల రీ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాలు, రెండో దశలో మరో 2 వేల గ్రామాల్లో పూర్తవడంతో ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలుండడంతో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభంకానున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ ఇక ఈజీ ఆయా గ్రామాల ప్రజలు ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లను తమ సచివాలయాల్లోనే సులభంగా చేసుకోవచ్చు. తాజాగా అనుమతించిన గ్రామాలతో కలిపి మొత్తం 4,077 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించినట్లయింది. అలాగే ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు, ఈసీలు పొందడం వంటి పనుల్ని ఈ కార్యాలయాల్లోనే చేసుకోవచ్చు. -
ముమ్మరంగా డీజీపీఎస్ సర్వే
సాక్షి, అమరావతి: జీపీఆర్ఎస్ సిగ్నల్స్ అందని ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా భూములు రీ సర్వే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) చేపట్టిన సర్వే విజయవంతమైంది. ఆరు గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ప్రైవేట్ ఏజెన్సీలు డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నాయి. త్వరలో నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సర్వే చేపట్టనున్నారు. కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో... ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా శాటిలైట్ల నుంచి వచ్చే జీపీఆర్ఎస్ సిగ్నల్స్ ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. కానీ కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ ద్వారా పనిచేసే రోవర్లు సరిగా పనిచేయడంలేదు. దీంతో ఇటువంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 2,800 గ్రామాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను డీజీపీఎస్ ద్వారా సర్వే చేయనున్నారు. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య ఎక్కువగా ఉండడంతో అక్కడే ఎక్కువ దృష్టి పెట్టారు. మొత్తం 2,800 గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి డీజీపీఎస్ సర్వేకు టెండర్లు పిలిచారు. తొలి ప్యాకేజీని గతంలోనే ఖరారు చేసి ఐదు ఏజెన్సీలకు పనులు అప్పగించడంతో సర్వే ముమ్మరంగా సాగుతోంది. మిగిలిన మూడు ప్యాకేజీల టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. త్వరలో అక్కడ కూడా సర్వే ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
భూ రికార్డుల స్వచ్ఛీకరణ వేగవంతం
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే నేపథ్యంలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) కార్యక్రమం వేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు పథకం కింద వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న రీ సర్వేలో రికార్డుల స్వచ్ఛీకరణ అత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయితేనే ఆయా గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే రీ సర్వే ప్రారంభానికి ముందే గ్రామాల్లో భూ రికార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌ల్యాండ్ అడంగల్స్ను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడటం, అడంగల్‌లో పట్టాదారుని వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం వంటి పనులు పక్కాగా చేయాలి. ఈ పనిని కింది స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం చేయాలి. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయిన గ్రామాల్లోనే రీ సర్వేలో మొదట నిర్వహించే డ్రోన్ ఫ్లైయింగ్‌ను సర్వే బృందాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణపై ఫోకస్ పెట్టింది. మొత్తంగా 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేయిస్తున్నారు. అనంతపురంలో నూరు శాతం పూర్తి అనంతపురం జిల్లాలోని మొత్తం 504 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 315 గ్రామాలకు గాను.. 314 గ్రామాల్లో స్వచ్ఛీకరణను పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాలో 846 గ్రామాలకు గాను 835 గ్రామాల్లోను, సత్యసాయి జిల్లాలో 461 గ్రామాలకు గాను 455 గ్రామాల్లో స్వచ్ఛీకరణ పూర్తయింది. విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో స్వచ్ఛీకరణ నెమ్మదిగా జరుగుతుండటంతో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రీ సర్వే షెడ్యూల్‌కు అనుగుణంగా భూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేసేందుకు గడువును నిర్దేశించారు. దాని ప్రకారం ఆరు రకాల సర్క్యులర్ ప్రకారం రికార్డులను అప్డేట్ చేసే పని వేగంగా జరుగుతోంది. తద్వారా రీ సర్వే కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సర్వే బృందాలు వడివడిగా నిర్వహిస్తున్నాయి. ప్రతి నెలా సమీక్ష స్వచ్ఛీకరణ ఎలా చేయాలనే దానిపై రెవెన్యూ శాఖ ఆరు సర్క్యులర్లు జారీ చేసింది. ఒక్కో సర్క్యులర్ ప్రకారం ఒక్కో దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం స్వచ్ఛీకరణ ఎంత మేరకు జరిగిందనే దానిపై ప్రతి నెలా కలెక్టర్లు, జేసీలతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఆరు రకాల సర్క్యులర్ల ప్రకారం పని జరిగిందో పరిశీలిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. -
డ్రోన్ పైలట్లుగా సర్వేయర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భూముల రీ సర్వే కోసం ప్రభుత్వ సర్వేయర్లే డ్రోన్ పైలట్లుగా మారారు. ఇలా సర్వేయర్లే డ్రోన్లను ఆపరేట్ చేస్తూ భూములను సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి. సామర్లకోటలోని సర్వే శిక్షణ అకాడెమీలో ఎంపిక చేసిన సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. రీ సర్వే కోసం ప్రభుత్వం మొదట సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించింది. కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలతోనూ సర్వే చేయిస్తోంది. మొదట్లో ఆ డ్రోన్లను ఆపరేట్ చేసే సంస్థల పైలట్లకు సర్వేయర్లు కో–పైలట్లుగా పని చేశారు. రీ సర్వేను మరింత వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వమే ఇటీవల సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రైవేటు డ్రోన్లతోపాటు వీటిని ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లకు పైలట్లుగా ప్రభుత్వ సర్వేయర్లే ఉండాలని సర్వే శాఖ భావించింది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు సర్వేయర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. డ్రోన్లు విక్రయించిన సంస్థ నిపుణులే సామర్లకోట వచ్చి తొలి విడతగా 94 మందికి వారం రోజులు శిక్షణ ఇచ్చి సరిఫికెట్లు కూడా ఇచ్చారు. డ్రోన్‌ను సర్వేకు సిద్ధం చేయడం (అసెంబ్లింగ్), ఆపరేషన్, సర్వే అయిన తర్వాత డేటాను స్వీకరించడం (క్యాప్చర్ చేయడం), ఆ డేటాను హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియాకు పంపించేవరకు మొత్తం బాధ్యత పైలట్లదే. సర్వే శాఖ డ్రోన్లతోనే రోజుకు 2,470 ఎకరాలు సర్వే చేస్తున్నారు. తాజాగా మరో 10 డ్రోన్లను సర్వే శాఖ కొనుగోలు చేసింది. వాటిని ఆపరేట్ చేసేందుకు మరో 20 మంది సర్వేయర్లకు బుధవారం నుంచి సామర్లకోటలో శిక్షణ ప్రారంభమయ్యింది. విడాల్ ఏవియేషన్ సంస్థ నిపుణులు ఈ శిక్షణ ఇస్తున్నారు. సర్వేయర్లు డ్రోన్ ఫ్లై చేయడం గర్వకారణం ప్రభుత్వ సర్వేయర్లు డ్రోన్ల ద్వారా రీ సర్వేలో భూములు కొలవడం గర్వించదగ్గ విషయం. సర్వే శాఖలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్నా. చైన్లు, క్రాస్లు పట్టుకుని లాగుతూ సర్వే చేసేవాళ్లం. ఇప్పుడు మా సర్వేయర్లు డ్రోన్ పైలట్లుగా మారి రీ సర్వే చేస్తున్నారు. వారికి అప్పగించిన పనిని సమర్ధంగా చేస్తున్నారు. – డీఎల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
2,783 గ్రామాల్లో డీజీపీఎస్ పరికరాలతో రీ సర్వే
సాక్షి, అమరావతి: జీపీఆర్ఎస్ సిగ్నల్స్ అందని 2,783 గ్రామాల్లో ప్రభుత్వం డీజీపీఎస్ పరికరాల ద్వారా భూముల రీ సర్వే చేపట్టింది. కొన్ని గ్రామాల్లో ఈ సర్వే మొదలైంది. డ్రోన్లు, జీఎన్ఎస్ఎస్ రోవర్ల ద్వారా అత్యంత ఆధునికమైన హైబ్రిడ్ టెక్నాలజీతో సర్వే సెటిల్మెంట్ శాఖ రీ సర్వేలో భాగంగా భూములను కొలుస్తోంది. ఇందుకోసం జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా 70 సీవోఆర్‌ఎస్ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్) బేస్‌స్టేషన్లను శాశ్వతపద్ధతిలో ఏర్పాటు చేసింది. శాటిలైట్ల ద్వారా వచ్చే జీపీఆర్ఎస్ సిగ్నల్స్ ఆధారంగా జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా ఈ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. కానీ కొండలు, దట్టమైన అటవీప్రాంతాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ ద్వారా రోవర్లు సరిగా పనిచేయడంలేదు. ఇలాంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 189 మండలాల్లో 2,783 గ్రామాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను రీ సర్వే చేయాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 1,809 గ్రామాల్లో సిగ్నల్స్ అందడంలేదని గుర్తించారు. మొత్తం 2,783 గ్రామాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా డీజీపీఎస్ ద్వారా రీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అత్యధిక గ్రామాలున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్యాకేజీ–1కి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విశాఖకు చెందిన జియోకాన్ సర్వేస్, విశాఖకు చెందిన సిల్వర్ టెక్నో సొల్యూషన్స్ కంపెనీలు ఈ టెండరు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరుగ్రామాల్లో కొద్దిరోజుల కిందట ప్రయోగాత్మక సర్వేని విజయవంతంగా నిర్వహించాయి. రెండురోజుల కిందట ఈ గ్రామాల్లో డీజీపీఎస్ సర్వేను ప్రారంభించాయి. మిగిలిన మూడు ప్యాకేజీలకు త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. -
భూముల రీ సర్వేపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్ట్‌ను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని టేపీ జియో స్పేషియల్ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయా శాఖల అధికారులు చర్చించారు. ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో నిర్వహించిన ఈ కీలక సమావేశానికి 12 మంది నోడల్ అధికారులతో కలిసి రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థజైన్ నేతృత్వం వహించగా, జియో స్పేషియల్ డేటా సెంటర్ డైరెక్టర్ ఎస్వీ సింగ్ తన బృందంతో పాల్గొన్నారు. డేటా సెంటర్‌కు సంచాలకులుగా సింగ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రీసర్వే ప్రాజెక్ట్‌కు సంబంధించి పలు అంశాలపై లోతుగా చర్చించారు. ప్రాజెక్ట్ పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అంశాలు, ఇకపై చేయవలసిన కార్యక్రమాలు, కాలపరిమితి వంటి అంశాలపై సమావేశం సాగింది. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయడంతో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ సాగింది. మెరుగైన సామర్థ్యం కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలి, మరిన్ని శిక్షణలు ఇవ్వాల్సిన ఆవశ్యకత తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సమావేశంలో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ కార్యాలయ సంయుక్త సంచాలకుడు ప్రభాకరరావు, రాష్ట్ర సర్వే శిక్షణ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ కుమార్, ప్రత్యేక అధికారి అజయ్‌నాయక్ పాల్గొన్నారు. -
వక్ఫ్ భూములపై డిజిటల్ నిఘా
కర్నూలు (రాజ్‌విహార్): వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వక్ఫ్ భూములు, స్థలాలను రీ సర్వే చేసి, డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపట్టింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో టీడీపీ నాయకులు ఎక్కువగా ఆక్రమించుకున్నారు. వక్ఫ్ గెజిట్, రికార్డుల్లో ఉన్నప్పటికీ సబ్ డివిజన్లు, సర్వే నంబర్లు మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మసీదులు, దర్గాల నిర్వహణ కోసం ముస్లిం పెద్దలు, దాతలు వక్ఫ్‌కు ఇనాంగా ఇచ్చిన ఆస్తులను అప్పనంగా కాజేసి సొంత ఆస్తుల్లా అనుభవిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,553 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. వీటి విలువ రూ.2,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆక్రమణల్లో చిత్తూరు ఫస్ట్ వక్ఫ్ ఆస్తులు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉండగా ఆక్రమణల్లో చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో 22,599.89 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. గెజిట్‌లో లేని భూములు మరో పది వేల ఎకరాల దాకా ఉంటాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 6,671 ఎకరాలు ఉండగా ఏకంగా 5,162.99 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. రూ.2,500 కోట్ల ఆస్తుల అన్యాక్రాంతం గెజిట్–1963 ప్రకారం 13 జిల్లాల్లో 3,502 మసీదులు, దర్గాలు, ఇతర సంస్థలకు చెందిన భూములు 65,260.97 ఎకరాలున్నాయి. గెజిట్‌లో లేని భూములు మరో 20వేల ఎకరాల దాకా ఉంటాయి. ఒకసారి వక్ఫ్‌లోకి వస్తే శాశ్వతంగా వక్ఫ్‌లోనే అనే చట్టం ఉన్నా ఆక్రమణలు మాత్రం యథేచ్ఛగా కొనసాగాయి. రాష్ట్రంలో 22,553.06 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.2,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పర్యవేక్షణ లేక.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. అక్రమార్కులు అడ్డదారుల్లో ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. కొందరు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు అనుభవదారులమంటూ కోర్టుకెళ్తున్నారు. రీ సర్వే, డిజిటలైజేషన్ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రీ సర్వే, డిజిటలైజేషన్ చేయిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విధివిధానాలు జారీ చేసింది. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, రెవెన్యూ సెక్రటరీల సహకారం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆక్రమణలకు గురైన ఆస్తులు తిరిగి స్వాధీనం కావడంతో పాటు భద్రంగా ఉంటాయని భావిస్తున్నారు. తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి వక్ఫ్ భూములను రీ సర్వే చేసి డిజిటలైజ్ చేయడానికి చర్యలు చేపట్టడం అభినందనీయం. అది పూర్తయ్యాక గెజిట్‌లో పొందుపర్చాలి. వాటిని పరిరక్షించేందుకు సీసీఎల్ఏకు అధికారమిచ్చి తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలివ్వాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్ష రెగ్యులర్‌గా నిర్వహించాలి. – ఎస్.రోషన్‌అలీ, రిటైర్డు తహసీల్దార్, కర్నూలు కరోనా వల్ల తాత్కాలికంగా ఆగింది రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్‌బోర్డు భూములు, స్థలాల రీ సర్వేకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే సర్వే కమిషన్ ఆఫ్ వక్ఫ్ ద్వారా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సర్వే చేస్తున్నాం. కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిపివేశాం. ఈ ప్రక్రియ పూర్తయితే గెజిట్‌లో పొందుపరుస్తాం. – అలీమ్ బాషా, సీఈవో, వక్ఫ్ బోర్డు -
‘పాఠశాల విద్య’ ఆస్తుల 'రీ సర్వే'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తమ అదీనంలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు.. వివిధ కార్యాలయాలకు సంబంధించిన భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల పరిరక్షణకు పాఠశాల విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ శాఖతో పాటు వివిధ విభాగాల పరిధిలో మొత్తం 42,069 స్కూళ్లు, గురుకుల సంస్థలు, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం పెద్దఎత్తున భూములు, స్థలాలు, భవనాలు, ఇతర పరికరాలతోపాటు కాలక్రమంలో అనేక సదుపాయాలు సమకూర్చింది. ప్రభుత్వంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ప్రభుత్వ స్కూళ్లు, విద్యాసంస్థలకు భూములు, స్థలాలు, ఇతర వస్తువులను అందించారు. అయితే, ఇప్పటివరకు వీటికి సంబంధించి సరైన నిర్వహణ లేకుండాపోయింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డులు, ఇతర పత్రాలు కనిపించని పరిస్థితి. పలుచోట్ల భూములు, స్థలాలు కూడా అన్యాక్రాంతమయ్యాయి. పరికరాలు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంకొన్నిచోట్ల.. కంచే చేను మేసిందన్నట్లు ఆయా గ్రామాలకు చెందిన నేతలు, స్కూళ్ల సిబ్బంది ఆస్తుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. గత ప్రభుత్వాల పరిరక్షణ లేకే.. ఈ విద్యా సంస్థలకు సంబంధించిన భూములు, స్థలాల విలువ ఏటేటా పెరిగిపోతుండడంతో అనేకచోట్ల అక్రమార్కులు వాటి రికార్డులు తారుమారు చేసి వాటిని కబ్జాచేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నివాసాలూ ఏర్పాటుచేసుకున్నారు. ఇవేకాక.. స్కూళ్లకు కొన్నేళ్లుగా వివిధ పథకాల కింద ప్రభుత్వాలు లక్షలాది రూపాయల విలువ చేసే కంప్యూటర్లు, టీవీలు, ఫర్నీచర్, ఇతర పరికరాలను అందించినా వాటిలో చాలా శాతం ఇప్పుడు కనిపించవు. కొన్నేళ్ల క్రితం వరకు వాచ్మెన్లు ఉండేవారు. కాలక్రమంలో ఆ పోస్టుల భర్తీ లేకపోవడంతో కొన్నేళ్లుగా స్కూళ్లకు భద్రత లేకుండాపోయింది. ప్రభుత్వాలు లక్షలాది రూపాయలతో సమకూర్చిన పరికరాలకు రక్షణ కరువైంది. గత ప్రభుత్వాలు కూడా ఈ స్కూళ్లకు సంబంధించిన ఆస్తులు, ఇతర అంశాలను పూర్తిగా విస్మరించాయి. రీసర్వేకు ఏర్పాట్లు ప్రభుత్వ స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు, కార్యాలయాల భూములు, స్థలాల రీసర్వేకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు, ఆర్జేడీలకు ఆదేశాలు జారీచేసింది. దీంతో వారంతా తమ పరిధిలోని స్కూళ్లు, మండల రిసోర్సు సెంటర్లు, భవిత కేంద్రాలు, జిల్లా ఎలిమెంటరీ విద్యాబోధనా శిక్షణ సంస్థలు (డైట్స్) ఇతర కార్యాలయాలు, సంస్థల భూములు, స్థలాల రీసర్వేకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ ఆస్తుల సరిహద్దులను డీమార్కింగ్ చేసి వాటికి సరైన రికార్డులను రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం డ్రోన్ రోవర్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా ఆదేశాలిచ్చారు. ఇకపై ఈ ఆస్తులకు సంబంధించి ‘కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్సు స్టేషన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. -
ఆస్తులకు సర్కారు భరోసా
తల్లికి బిడ్డ.. రైతుకు భూమి బిడ్డ మీద తల్లికెంత మమకారం ఉంటుందో భూమిపై రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది. భూమి రైతు కుటుంబానికి ప్రాణ సమానం. ప్లాటు అయినా, ఇల్లు అయినా, వ్యవసాయ భూమి అయినా వివాదంలో ఇరుక్కుంటే అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో కళ్లారా చూశా. గట్టు జరిపి ఒక రైతు భూమిని మరొకరు ఆక్రమిస్తే ఆ రైతన్న ఎంత క్షోభకు గురవుతారో మనకు తెలుసు. రాబందుల్లాంటి మనుషులు దొంగ రికార్డులు సృష్టించి భూములు కొట్టేయాలని స్కెచ్ వేస్తే చట్టపరంగా పోరాడే శక్తి లేని కుటుంబాల పరిస్థితి ఏమిటని మనమంతా ఆలోచించాలి. మార్చాలా వద్దా..? మీ ఆస్తికి మిమ్మల్నే అసలైన యజమానిగా ధ్రువీకరించే వ్యవస్థ ఉండాలా? వద్దా? మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా? వద్దా? మీ ఆస్తిని వేరెవరికో అమ్మేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలా? వద్దా? మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా కచ్చితంగా నిర్ధారణ చేయాలా? వద్దా? మీ భూమి కొలత ఏమిటో, అది ఏ ఆకారంలో ఉందో, రికార్డుల్లో కనిపించాలా? వద్దా? గిట్టని వారో, కబ్జారాయుళ్లో రాళ్లు పీకేసినా, గట్టు చెదరగొట్టినా చెక్కు చెదరని పత్రాలు, ఆధారాలు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నారో? లేదో ఒక్కసారి ఆలోచించండి. – జగ్గయ్యపేట బహిరంగ సభలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రాజెక్టు దేశానికే రోల్ మోడల్ కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన ఆస్తులు వివాదంలో చిక్కుకుంటే ఆ కుటుంబాలు పడే మానసిక వేదన మాటలకందనిదని, ఇలా ఎవరికీ జరగకూడదనే సంకల్పంతో స్థిరాస్తులపై యజమానులకు శాశ్వత హక్కులు కల్పించాలని నిర్ణయించామని ప్రకటించారు. సోమవారం కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో సర్వే రాయి వేసి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’ (రీ సర్వే) ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ విప్ ఉదయబాను, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. జగ్గయ్యపేట సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పవిత్ర సంకల్పంతో సర్వేకు శ్రీకారం.. భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటే రికార్డులు పక్కాగా ఉండాలి. భూముల రికార్డులు దోషరహితంగా ఉంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు ఉండవు. మీ ఆస్తులకు మనందరి ప్రభుత్వం హామీగా ఉంటుందని మాట ఇస్తూ ‘వైఎస్సార్ జగనన్న భూహక్కు – భూరక్ష కార్యక్రమం’ ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాం. దీనిద్వారా మీ పిల్లలు, వారసులకు మోసాలకు తావులేని విధంగా ఆస్తులపై హక్కులు కల్పిస్తాం. ఇందుకోసమే మొన్న అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఆమోదించాం. పవిత్ర సంకల్పంతో సర్వే ప్రారంభిస్తున్నాం. వందేళ్లలో ఎన్నో మార్పులు.. వందేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పాలకులు మారిపోయారు. స్వాతంత్య్రం వచ్చింది. రాజ్యాంగం, చట్టాలు, హక్కులు వచ్చాయి. ఒకప్పుడు రేడియో కూడా లేని గ్రామాలు ఉండేవి. ఇవాళ స్మార్ట్ ఫోన్ లేని మనిషి ఎక్కడున్నాడా? అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇంత మారినా 1920లో బ్రిటీష్ హయాం తరువాత ఇప్పటి వరకూ భూముల రీసర్వే జరగలేదు. పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే.. రాష్ట్రంలో కొందరికి రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరో చోట ఉంది. సబ్ డివిజన్ సమస్యలున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ భూతద్దంతో వెతికినా ఒక్క పొరపాటు కూడా లేకుండా సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత ఆస్తి హక్కు పత్రం యజమానులకు ఇస్తాం. మిల్లీమీటర్లతో సహా కొలిచి మ్యాపు కూడా ఇస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్ పరిధిలో విలేజ్ మ్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా యూనిక్ ఐడీ నెంబర్ కేటాయిస్తాం. ఆ నెంబర్‌తో భూమి ఎక్కడ ఉందో, సరిహద్దులు ఏమిటో సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది. అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రామ/ వార్డు సచివాలయాల్లో పొందుపరిచి అనంతరం భూ యజమానికి శాశ్వత టైటిల్ ఇస్తాం. సర్వే పూర్తయిన గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభిస్తాం. ప్రజలపై పైసా భారం ఉండదు.. ప్రజలపై పైసా కూడా భారం మోపకుండా మొత్తం సర్వే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుంది. రాళ్ల ఖర్చు కూడా భరిస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ పవిత్ర యజ్ఞం సాగుతుంది. 4,500 సర్వే బృందాలతో 17,600 రెవెన్యూ గ్రామాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే నిర్వహిస్తాం. 2023 నాటికి చివరి వార్డు, గ్రామంలో కూడా ఈ సర్వేను పూర్తి చేస్తాం. కబ్జాలతో కోట్లకు పడగ పరుల సొమ్ము పాము లాంటిదని పెద్దలు చెబుతారు. కబ్జా భూములతో కోట్లకు పడగెత్తాలనే దుర్మార్గమైన ఆలోచన చేసే వాళ్లు ఇవాళ ఉన్నారు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో విన్నా. ఇలాంటి అన్యాయం ఏ ఒక్కరికీ జరగరాదు. ప్రజలందరికీ మేలు చేయాలనే ఆరాటం, తాపత్రయంతోనే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టాం. సమన్వయం లేక... ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక భూ వివాదాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఆదాయం వస్తోందని రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. ఆస్తిని అమ్ముతున్న వారు నిజమైన యజమానా? కాదా అనే ప్రశ్న లేకుండానే గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి విక్రయించిన సందర్భాలను చూస్తున్నాం. నష్ట పరిహారం హామీ కూడా.. ఎక్కడైనా ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా హక్కు పత్రాలు పొందిన వారికి ఆస్తిపై హక్కు లేదని తేలితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుందనే హామీ ఇస్తున్నాం. ఇటువంటి చట్టం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన రాష్ట్రం దీనికి మొట్టమొదటిగా నాంది పలుకుతోంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా భూములను ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా కొనుక్కోవచ్చు. ఏపీలో మొదలైన ఈ విప్లవాత్మక కార్యక్రమం దేశమంతా ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో నిజాయితీ తెస్తామనే మాటకు కట్టుబడి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ ద్వారా 18 నెలల్లో ఈ దిశగా ముందడుగు వేశామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా. దేశంలోనే అతిపెద్ద రీ సర్వే ప్రారంభం దేశంలోనే అతి పెద్ద రీ సర్వే ఏపీలో ప్రారంభమైంది. కృష్ణా జిల్లాలోని తక్కెళ్లపాడులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష’ పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో రైతులు, స్థిరాస్తి యజమానులకు సీఎం స్వయంగా హక్కు పత్రాలను అందజేశారు. తక్కెళ్లపాడు ట్రై జంక్షన్లో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా సర్వేరాయి నాటిన అనంతరం మీట నొక్కి డ్రోన్లను గాలిలోకి పంపించారు. ఆధునిక విధానంలో రూపొందించిన సర్వే మ్యాపు (గ్రామపటాన్ని) పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్టాళ్లను తిలకించారు. సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల విభాగం స్టాల్లో ప్రదర్శించిన 1866 నాటి రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (ఎఫ్ఎంబీ)లను సీఎం పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా స్టాల్లో ఆధునిక పద్ధతుల గురించి సంస్థ డీజీ గిరీష్‌కుమార్ వివరించారు. -
ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
సాక్షి, జగ్గయ్యపేట : మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు. (జనం ఆస్తికి అధికారిక ముద్ర) సాహసోపేత నిర్ణయం ఎంతో కాలంగా పల్లె నుంచి పట్టణాల వరకు భూ వివాదాలు.. గట్టు వద్ద రైతన్నలు తరుచూ కీచులాటలు.. ఏళ్ల తరబడి సర్వే చేసే నాథుడే కనిపించలేదు. అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. భూమి ఒకరిదైతే మరొకరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేసిన ఘటనలు అనేకం. భూ వివాదాలను చెరిపేందుకు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైంది. -
దేశంలోనే అతి పెద్ద సర్వేకి నేడు సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి, సాక్షి, మచిలీపట్నం/జగ్గయ్యపేట: పొలం గట్ల తగాదాలు, భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేందుకు ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’ ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుడుతోంది. పల్లె సీమల్లో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా వందేళ్ల చరిత్రలో దేశంలోనే అతి పెద్ద రీసర్వేను తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలు (క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు), భూమి హక్కు పత్రాలను యజమానులకు సీఎం జగన్ అందజేస్తారు. అనంతరం ఇక్కడ సరిహద్దు రాయిని ప్రారంభించి 13 జిల్లాలకు చెందిన సర్వే బృందాలకు పచ్చజెండా ఊపడం ద్వారా రీసర్వేకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. మంగళవారం ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి. తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభమవుతుంది. తదుపరి మొదటి విడత నిర్ణయించిన 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. రెండో దశలో 6000, మూడో దశలో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వే పూర్తి చేసేలా ప్రభుత్వం కాల వ్యవధితో ప్రణాళిక రూపొందించింది. దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కలి్పంచాలనే ఉదాత్త ఆశయంతో ముఖ్యమంత్రి ల్యాండ్ టైట్లింగ్ బిల్లు – 2020ని శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం – 2020 గెజిట్‌లో ప్రచురిస్తారు. 1.26 కోట్ల హెక్టార్లలో ప్రతి అంగుళం కొలత రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతం మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు (ఇళ్లు, స్థలాలు) ప్రతి అంగుళం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొలుస్తారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/ స్థలం కొలిచి సరిహద్దులు నిర్ణయిస్తారు. మ్యాపులు తయారు చేస్తారు. రైతులకు ఎంతో మేలు: మంత్రి పెద్దిరెడ్డి సమగ్ర భూసర్వేతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రోడ్డు మార్గం ద్వారా గరికపాడు, అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట మీదుగా జగ్గయ్యపేట చేరుకుని ఎస్జీఎస్ కళాశాలలో సోమవారం ఉదయం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు. గట్టురాయి వివాదం పరిష్కారం నాకు సర్వే నంబర్ 65/2లో 2.49 ఎకరాలుంది. గట్టు రాళ్లు లేకపోవడం, పాతిన రాళ్లు కదిలిపోవడం వల్ల తరచూ పొరుగు రైతులతో వివాదాలు తలెత్తేవి. పైలట్ ప్రాజెక్టుగా మా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేతో భూముల సరిహద్దు సమస్య పరిష్కారమైంది. నా పొలంలోనే నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిహద్దు రాయి ఏర్పాటు చేయనుండటం సంతోషంగా ఉంది. – బజారు రవికుమార్, రైతు, తక్కెళ్లపాడు, కృష్ణా జిల్లా -
జనం ఆస్తికి అధికారిక ముద్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యజమానులకు ఇప్పటివరకు వాడుకునేందుకు మినహా మరే విధంగానూ అక్కరకు రాకుండా ఉన్న దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేయనుంది. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు వాటి యజమానుల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామ కంఠాల్లో కోటిన్నరకి పైగానే ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి విలువ లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ భూములకు రెవెన్యూ సర్వే రికార్డులు లేవు. అలాగని అవసరమైనప్పుడు ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధానమూ ఇంతవరకు లేదు. దీనివల్ల యజమానులకు ఆ ఆస్తులతో ఎలాంటి ఇతర ప్రయోజనాలూ లభించడం లేదు. కనీసం బ్యాంకు రుణాలు కూడా లభించడం లేదు. ఇంటి పన్ను వసూలుకు వీలుగా గ్రామ పంచాయతీల వద్ద ఇళ్ల యజమానుల జాబితాలు తప్ప ఆయా ఇళ్లకు సంబంధించి రికార్డులు, ఆస్తి వివరాలు ఆయా గ్రామ పంచాయతీల వద్ద లేవు. దీంతో ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే పెద్ద మనుషుల మధ్య కాగితాలు రాసుకోవాల్సిందే తప్ప ఆ పత్రాలకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండటం లేదు. దీనివల్ల సరైన రేటూ లభించడం లేదు. అన్నదమ్ములు పంచుకోవాలన్నా ఇబ్బందులే. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పుడు గ్రామ కంఠంలో ఉండే అలాంటి ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర స్థలాలన్నింటికీ ‘క్యూఆర్ కోడ్’ (వివరాలు తెలుసుకునేందుకు ఉపకరించే ఆప్టికల్ లేబుల్)తో కూడిన ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకంలో భాగంగా సోమవారం నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనుంది. ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ ► ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి తనకు సంబంధించిన ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ లభిస్తుంది. తద్వారా ఆస్తికి రక్షణ లభిస్తుంది. ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకు రుణం తీసుకునేందుకు ఆ సర్టిఫికెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల సహజంగానే ఆస్తి విలువ పెరిగిపోతుంది. ► ఇల్లు/ స్థలం అమ్ముకోవాలనుకుంటే.. నిర్దిష్ట ఆస్తి సర్టిఫికెట్ ఉండటంతో సులభంగా మార్పిడి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆ ఆస్తి సర్టిఫికెట్లో ముద్రించిన క్యూఆర్ కోడ్ సహాయంతో గ్రామ పంచాయతీ వద్ద ఉండే రికార్డులలో సంబంధిత కొత్త యజమాని పేరు ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. కొత్త యజమానిపేరుతో పంచాయతీ కార్యదర్శి ఆస్తి సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ► అలాగే ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్న సమయంలో.. పాత ఆస్తి సర్టిఫికెట్‌ను రద్దు చేసి, పంపకంలో వచ్చిన వాటాల మేరకు అన్నదమ్ములకు వెంటనే కొత్త ఆస్తి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ► గ్రామాల్లో స్థలాల వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సులభంగా పరిష్కరించేందుకు కూడా వీలు కలుగుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ఇలా.. ► వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల పరిధిలో అన్ని రకాల భూముల రీ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాల పరిధిలో గ్రామ కంఠం ప్రాంతంలో ఉన్న వాటితో సహా అన్ని ఇళ్లు, ఇతర స్థలాలన్నింటినీ డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ విధంగా గ్రామ పరిధిలో ప్రతి ఇంటినీ, స్థలాన్ని హద్దులతో సహా గుర్తించి, స్థానిక అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం విస్తీర్ణం, మూలలు, కొలతలు, ఇతర వివరాల నిర్ధారణతో రికార్డులను గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. ► గ్రామ కంఠంలో ఉండే ఇళ్లు, స్థలాలకు కొత్తగా సర్వే నంబర్లు కూడా కేటాయిస్తారు. ప్రతి ఇంటినీ, ప్రతి స్థలాన్ని వేర్వేరు ఆస్తిగా పేర్కొంటూ వాటికి వేర్వేరుగా గుర్తింపు నంబర్లను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ ఒక్కొక్క దానికీ ఒక్కొక్క ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. ► ఒక్కొక్క ఆస్తికి వేర్వేరుగా ఆస్తి సర్టిఫికెట్లను (ధ్రువీకరణ పత్రాలు) తయారు చేసి (వాటిపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు) గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా వాటిని సంబంధిత యజమానులకు పంచాయతీరాజ్ శాఖ పంపిణీ చేస్తుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ పరిధిలోని 423 ఇళ్లు, 83 ఖాళీ స్థలాల యజమానులకు సోమవారం ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. -
రీసర్వేకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికా బద్ధంగా చేస్తోంది. గత వందేళ్ల చరిత్రలో దేశంలో ఎక్కడా తలపెట్టని అతి పెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నందున అవసరమైనవన్నీ సమకూర్చుకుంటూ ముందుకెళుతోంది. హైబ్రిడ్ మెథడ్‌లో కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధిష్ట సమయంలో సర్వే క్రతువు పూర్తి చేసేందుకు టైమ్‌లైన్ రూపొందించింది. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో రీసర్వేకు నిబంధనావళి రూపొందించాయి. 17,460 రెవెన్యూ గ్రామాల్లో.. – రాష్ట్ర వ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించి యజమానులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. – మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తులను మూడు దశల్లో సర్వే చేయనున్నారు. మొదటి దశలో 5,122 గ్రామాల్లో, రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తారు. తదుపరి మూడో దశలో మిగిలిన గ్రామాల్లో సర్వే ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు. – డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియానే డ్రోన్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ సర్వేయర్ల బృందం రాష్ట్రానికి చేరుకుంది. శరవేగంగా రికార్డుల స్వచ్చికరణ – రెవెన్యూ రికార్డుల స్వచ్చికరణ కార్యక్రమం చకచకా సాగుతోంది. ఎంపిక చేసిన గ్రామాల సరిహద్దు రాళ్లను అక్కడి సర్వేయర్లు గుర్తించారు. రికార్డులను సర్వే టీమ్‌కు అందజేశారు. సర్వే సమయంలో వచ్చే వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 670 మొబైల్ ట్రైబ్యునల్స్‌ను కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. – ఈ సర్వేలో జిల్లాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో రీసర్వేకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రామాల వారీగా సర్వే ప్రారంభమయ్యే తేదీలను ఆయా జిల్లా కలెక్టర్ల పేరుతో సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. రీ సర్వే సమయంలో అందుబాటులో ఉండాలని గ్రామ సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాలు, పట్టణాల వారికి సూచిస్తారు. మొదటి విడతలో 30 బేస్ స్టేషన్లు – రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కోసం 70 బేస్ స్టేషన్లు (సెల్‌ఫోన్ పని చేయడానికి సెల్ టవర్లలాగే రోవర్లకు బేస్ స్టేషన్లు అవసరం) ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో 5,122 గ్రామాల్లో రీసర్వేకు ఇబ్బంది లేకుండా తొలుత 30 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 5 పూర్తయ్యాయి. మిగిలిన 25 బేస్ స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. – జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 3, విశాఖపట్నంలో 4, తూర్పుగోదావరిలో 7, పశ్చిమ గోదావరిలో 4, కృష్ణాలో 5, గుంటూరులో 3, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, చిత్తూరులో 7, వైఎస్సార్ కడపలో 5, కర్నూలులో 5, అనంతపురంలో పది కలిపి మొత్తం 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రేపు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే పూర్తి చేసిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ నెల 21వ తేదీ (సోమవారం) పట్టాలు ఇవ్వడం ద్వారా రీసర్వే మహాక్రతువుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పచ్చజెండా ఊపుతారు. భూ యజమానులకు ఫీల్డ్ మ్యాపు, భూ యాజమాన్య హక్కు పత్రం (1బి), గ్రామంలోని స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తుల యజమానులకు ప్రాపర్టీ కార్డు (ఆస్తి పత్రం) అందజేస్తారు. అనంతరం ఈనెల 22వ తేదీన ప్రతి జిల్లాల్లో ఒక్కో గ్రామంలో రీసర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 13 గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేశారు. తదుపరి వారం రోజుల్లో ఒక్కో రెవెన్యూ డివిజన్లో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 51 గ్రామాల్లో, తర్వాత నాలుగైదు రోజుల్లో ఒక్కో మండలంలో ఒక్కొక్కటి చొప్పున 670 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభిస్తారు. పక్షం లేదా 20 రోజుల నాటికి 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన 14,000 మంది సర్వేయర్లలో 9,423 మందికి సర్వే సెటిల్మెంట్ విభాగం ఇప్పటికే సంప్రదాయ సర్వే విధానాలపై శిక్షణ ఇచ్చింది. 6,740 మందికి ఆటోక్యాడ్, ఎల్రక్టానిక్ టోటల్ స్టేషన్స్ (ఈటీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వేపై శిక్షణ పూర్తి చేసింది. ఎలాంటి రికార్డులు అడగరు రీ సర్వే సందర్భంగా యజమానులు ఎలాంటి రికార్డులు చూపించాల్సిన పని ఉండదు. రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారమే సర్వే పూర్తి చేస్తారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం అన్నీ పరిశీలించి ఎలాంటి వివాదాలు లేని వారికి నిర్దిష్ట కాల పరిమితిలో శాశ్వత భూ హక్కులు కల్పిస్తారు. ప్రతి భూమి బిట్ (పార్సల్)కు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తారు. రెవెన్యూ, సర్వే రికార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. రీ సర్వే తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తోంది. – నీరబ్ కుమార్ ప్రసాద్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ -
సాహసోపేతం.. రీసర్వే మహాయజ్ఞం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూములు, స్థిరాస్తుల రీసర్వే అత్యంత క్లిష్టమైన పని. రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరపాలక సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వేచేసి హద్దులు నిర్ణయించి హక్కుపత్రాలు ఇవ్వడమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులు, నకిలీ రికార్డులు వంటి ఎన్నో చిక్కుముళ్లున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక పరిజ్ఞానం వినియోగించినా కొలతల్లో వచ్చే అతిసూక్ష్మ తేడా, వాస్తవ భూమికి, రికార్డుల్లోని గణాంకాలకు మధ్య ఉన్న భారీ తేడా, డ్యూయల్ రిజిస్ట్రేషన్లు, ట్యాంపరింగైన రికార్డులు వంటి సమస్యల్ని రీసర్వే క్రతువులో అధిగమించాల్సి ఉంటుంది. అందుకే రీసర్వేని రెవెన్యూ నిపుణులు మహాయజ్ఞంగా అభివర్నిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ మహాక్రతువులో భాగస్వామ్యం కల్పించినందుకు వ్యక్తిగతంగా, సంస్థ తరఫున సీఎం జగన్‌కు, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని దేశంలోనే అతి పురాతన, ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే సంస్థ.. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ బహిరంగంగానే చెప్పారంటే ఈ సర్వేకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. క్లిష్టమైన సమస్యలను అధిగమించి రీసర్వే పూర్తిచేస్తే గోల్డెన్ రికార్డులు రూపుదిద్దుకుంటాయి. భూతగాదాలు, పొలం గట్ల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తర్వాత క్రయవిక్రయాలు, చట్టబద్ధమైన వారసత్వం ప్రకారం కేవలం మ్యుటేషన్లు చేసుకుంటూ వెళితే వచ్చే 40 నుంచి 50 ఏళ్లపాటు ఈ రికార్డులు అద్భుతంగా ఉంటాయి. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం భూ యజమానులకు శాశ్వత భూహక్కులు కల్పించిన మొదటి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలుస్తుంది. రికార్డుల స్వచ్చికరణ, రీసర్వే ప్రక్రియలను అంకితభావంతో పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉంది. కొలతల్లో తేడాలు దుకాణానికి వెళ్లి బంగారం కొని వెంటనే పక్క షాపునకు వెళ్లి తూకం వేయిస్తే 10 నుంచి 20 మిల్లీగ్రాముల వరకు తేడా వస్తుంది. దీన్ని తప్పుగా పరిగణించడానికి వీలులేని అతిసూక్ష్మ తేడా అంటారు. తూకాల్లో లాగే భూమి కొలతల్లో కూడా అతిసూక్ష్మ తేడాలు వస్తాయి. ప్రపంచంలోనే అత్యాధునిక కార్స్ టెక్నాలజీతో సర్వేచేసినా ఇవి వస్తాయి. ఒక పాయింట్‌ను బేస్‌గా తీసుకుని కొలత వేసిన తర్వాత మరోసారి అలాగే తీసుకుని చూస్తే గరిష్టంగా ఐదు సెంటీమీటర్ల వరకు ఎక్కువ లేదా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే సర్వే పరిభాషలో ప్లస్ ఆర్ మైనస్ 5 సెంటీమీటర్ల ఎర్రర్ అని అంటారు. సాధారణంగా రెండు సెంటీమీటర్లు మించి తేడా రాదు. కొన్నిచోట్ల ఐదు సెంటీమీటర్ల వరకు రావచ్చని సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన దానికంటే తక్కువని అర్థం. ఇలాంటి తేడాలను కూడా అంగీకరించనివారికి వాస్తవాలు వివరించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ కొలిచి చూపడం ద్వారా ఒప్పించాల్సి ఉంటుంది. తక్కెళ్లపాడులో నాలుగెకరాల తేడా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో పైలెట్ ప్రాతిపదికన నిర్వహించిన రీసర్వేలో ఆర్ఎస్ఆర్కు, వాస్తవ కొలతలకు మధ్య నాలుగెకరాల తేడా వచ్చింది. తమ భూముల కొలతల విషయంలో 35 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వాస్తవాలు వివరించడం ద్వారా వారిని ఒప్పించారు. నేటి నుంచి అవగాహన రీసర్వేని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 14 వేల మంది సర్వేయర్లను నియమించారు. వీరిలో 9,400 మందికి శిక్షణ ఇవ్వగా మిగిలిన వారికి వచ్చేనెల 26 నాటికి శిక్షణ పూర్తి చేయనున్నారు. రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. డ్రోన్ సర్వేలో తేడా వచ్చిందని యజమానులు భావిస్తే రోవర్‌తో చేస్తారు. అందులోనూ సంతృప్తి చెందకపోతే చెయిన్‌తో మాన్యువల్ విధానంలో కొలిపించి హద్దులు నిర్ణయిస్తారు. దీన్ని కూడా అంగీకరించని పక్షంలో సివిల్ ఇంజినీరింగ్ విధానంలో కొలుస్తారు. వివాదాలను పరిష్కరించేందుకు మండలానికి ఒకటి చొప్పున 660 మొబైల్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గొప్ప సంస్కరణ ప్రజలకు మేలు చేయాలని ఏ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టినా కొన్ని సమస్యలు వస్తాయి. రీసర్వేలోనూ ఇలాంటి సమస్యలుంటాయి. ఏయే సమస్యలు వస్తాయో లిస్టు రూపొందించుకున్నాం. ఏయే అంశాల్లో ఎలా ముందుకెళ్లాలో ఇప్పటికే నాలుగు సర్క్యులర్లు పంపించాం. మరోదాన్ని పంపనున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో సర్వే చేయడమే కాకుండా స్థిరాస్తుల యజమానులకు శాశ్వత హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇది దేశంలో ఎక్కడా లేని గొప్ప సంస్కరణ. ప్రజలపై నయాపైసా భారం పెట్టకుండా ప్రభుత్వమే భరించి సర్వే చేయడంతోపాటు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీని అమలుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – నీరబ్‌కుమార్‌ప్రసాద్, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) -
ప్రతి ఇంచూ కొలుస్తారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద రీ సర్వేలో కచ్చితమైన కొలతలు, భూ యజమానుల సంతృప్తి ప్రధాన లక్ష్యాలుగా రెవెన్యూ శాఖ నాలుగు ఐచ్ఛికాలను సిద్ధం చేసింది. కొలతల్లో ఎక్కడైనా చిన్నపాటి తేడా వచ్చిందని రైతులు అభ్యంతరం చెబితే మరో విధానంలో ఆ భూమి హద్దులు నిర్ణయిస్తారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష’ కింద రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, గ్రామీణ, పట్టణ ఆస్తులను రీ సర్వే చేసేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. దీనిపై ప్రజలను చైతన్యపరచడం, రీ సర్వే ప్రయోజనాలను తెలియజేయడం కోసం ఈ నెల 14నుంచి 19వ తేదీ వరకు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రీ సర్వే ఉద్దేశం, లక్ష్యాలను అధికారులు ఈ సభల్లో వివరిస్తారు. రీ సర్వే ఎలా ఉంటుంది? దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయనే అంశాలపై షార్ట్ ఫిల్మ్ కూడా ప్రదర్శిస్తారు. మూడు దశల్లో పూర్తి అటవీ భూములు తప్పించి ప్రభుత్వ భూములు సహా స్థిరాస్తులన్నింటినీ మూడు దశల్లో సర్వే చేసేలా టైమ్‌లైన్ సిద్ధమైంది. రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర గల భూముల సర్వేకు సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ శాఖ సంయుక్తంగా బ్లూప్రింట్ తయారు చేశాయి. మొదటి విడత కింద 5 వేల గ్రామాల్లో సర్వే ప్రారంభించి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం జగన్ రైతులకు పట్టాలను అందజేసి రీ సర్వేకి పచ్చ జెండా ఊపుతారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కొక్క గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. తర్వాత ప్రతి డివిజన్లో ఒక గ్రామంలోను, తదుపరి ప్రతి మండలంలో ఒక రెవెన్యూ గ్రామంలో రీ సర్వే ప్రారంభిస్తారు. ఇలా వారం రోజుల్లో 670 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. రెండో విడత రీ సర్వేను 2021 ఆగస్టులో 6,500 గ్రామాల్లో ప్రారంభించి 2022 జూన్ నాటికి పూర్తి చేస్తారు. మిగిలిన గ్రామాల్లో మూడో విడత సర్వేను 2022 జూలైలో ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తారు. కార్స్, డ్రోన్లు, రోవర్ల వినియోగం – రీ సర్వేలో కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక పరికరాలను వినియోగిస్తారు. ఇందుకోసం ఇప్పటికే 9,500 సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. సర్వేకు 70 బేస్ స్టేషన్లు అవసరం కాగా, ఇప్పటికే 5 ఏర్పాటు చేశారు. మరో 65 బేస్ స్టేషన్లను దశలవారీగా నెలకొల్పుతారు. మొదటి విడత సర్వే కోసం వచ్చే నెలాఖరు నాటికి 30 బేస్ స్టేషన్లను సిద్ధం చేస్తారు. ఎక్కడైనా భూముల్లో పండ్ల తోటలు, ఎత్తయిన చెట్లు ఎక్కువగా ఉంటే డ్రోన్లను పంపడం వీలు కాదు. అందువల్ల ఇలాంటి చోట్ల బేస్ స్టేషన్ల నుంచి శాటిలైట్ ఆధారంగా అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం సబ్ డివిజన్ల (కమతాల) వారీగా రోవర్లను వినియోగించి హద్దులు నిర్ణయిస్తారు. రీసర్వే సమయంలో కొలతల్లో సూక్ష్మ తేడాల వల్ల వివాదాలు వస్తే నాలుగు పద్ధతులను అనుసరిస్తారు. 1 డ్రోన్ల సాయంతో భూముల కచ్చితమైన కొలతల్ని నిర్ధారించడం మొదటి పద్ధతి. 2 డ్రోన్లతో నిర్ధారించిన కొలతలపై భూ యజమానులు అభ్యంతరం చెబితే రోవర్స్‌ను వినియోగించి కొలతలు వేసి హద్దుల్ని నిర్ణయించడం రెండో పద్ధతి. 3 రోవర్స్ కొలతలపైనా యజమాని సంతృప్తి చెందకపోతే మూడో విధానంగా మాన్యువల్ (పాత) విధానంలో చైన్ లింకులతో కొలతలు వేస్తారు. 4 చైన్ లింకులతో కొలతలపైనా అసంతృప్తి వ్యక్తమైతే సివిల్ ఇంజనీ రింగ్ పద్ధతిలో కొలిచి హద్దులు నిర్ణయిస్తారు. -
విజయవాడ: ఈ నెల 21 నుంచి రీసర్వే ప్రారంభం
-
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు: గిరీష్ కుమార్
సాక్షి, విజయవాడ: భూముల రీసర్వే కచ్చితత్వంతో పూర్తి చేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ అన్నారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 21న రీసర్వే ప్రారంభవుతుందని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా రీసర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సర్వే ఆఫ్ ఇండియాతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో గిరీష్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో మాత్రమే రీసర్వే జరగనుందని పేర్కొన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ పూర్తి ఆధునిక సాంకేతికత ద్వారా రీసర్వే చేపడతాం. ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తాం. అత్యాధునిక కెమెరాలు, డ్రోన్లు వినియోగిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంపై 14 వేల మంది సర్వేయర్లకి శిక్షణ ఇవ్వనున్నాం. రీసర్వే చేసి మేం ఇచ్చే మ్యాపులు అన్ని ప్రభుత్వ శాఖలకి ఉపయోగకరంగా ఉంటాయి. సర్వే ఆఫ్ ఇండియాకి ప్రామాణికత అధికం. మూడు దశల్లో కచ్చితత్వంతో రీసర్వే పూర్తిచేస్తాం. జాతీయ మ్యాపులు తయారు చేసే ఏజెన్సీగా సర్వేయర్ ఆఫ్ ఇండియా ఉంది. రీసర్వేకి జీపీఎస్ అనుసంధానం చేసిన డ్రోన్‌తో కొనసాగుతుంది. అయిదు సెంటీమీటర్ల మార్పుతో కచ్చితమైన సర్వే జరుగుతుంది. తిరుపతిలో ఒక ట్రైనింగ్ అకాడమి ఏర్పాటు చేస్తాం. ఛార్టర్డ్ సర్వేయర్లను రాబోయే కాలంలో అందించేందుకు ఈ ట్రైనింగ్ అకాడమీ ఉంటుంది’’ అని గిరీష్ కుమార్ తెలిపారు.(చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ ) మూడేళ్లపాటు ఒప్పందం రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి రీసర్వే ప్రారంభం కాబోతోందని సీసీఎల్ఎ ఛీఫ్ కమీషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రీసర్వే పూర్తయ్యే వరకు రాబోయే మూడేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ రీసర్వే ద్వారా ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తాం. లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ ఆధారంగా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ప్రతీ గ్రామంలో డ్రోన్ సర్వే ద్వారా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది’’ అని తెలిపారు. 17340 గ్రామాల్లో.. మూడు దశల్లో: ఉషారాణి ‘‘మన రాష్ట్రంలో బ్రిటిష్ కాలంలో వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగింది. మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. భూమి విలువ పెరగడంతో భూసమస్యలు పెరిగాయి. రీసర్వే ద్వారా భూవివాదాలకి పరిష్కారం లభిస్తుంది. ప్రజలు రీసర్వేకి సహకరించాలి. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పధకం ఈ నెల 21 న ప్రారంభిస్తాం. 2023 నాటికి మూడు దశల్లో ముగుస్తుంది. 14 వేల మంది సర్వేయర్లకి ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. రీ సర్వే కోసం 956 కోట్లను కేటాయించాం. భూ యాజమానికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తాం. డ్రోన్లు వినియోగిస్తాం. ప్రభుత్వ ఖర్చుతోనే భూములకి రీసర్వే చేసి రాళ్లు కూడా వేయడం జరుగుతుంది. రీసర్వే ద్వారా అసలైన యాజమానికి పూర్తి హక్కులు లభిస్తాయి. అదే విధంగా రీసర్వే తర్వాత సంబంధిత భూములపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. అటవీ భూములు మినహాయించి వ్యవసాయ భూములు, గ్రామనకంఠాలు, పట్టణాలలోని భూములన్నింటికీ రీసర్వే జరుగుతుంది. 17340 గ్రామాలలో మూడు ఫేజులలో రీసర్వే పూర్తి చేస్తాం. మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాం’’ అని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి తెలిపారు. -
భూముల రీసర్వేకు రూ.987.46 కోట్లు
సాక్షి, అమరావతి: అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా రీసర్వే చేసేందుకు ప్రభుత్వం రూ.987.46 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’ అని వ్యవహరించనున్నారు. ఈనెల 5వతేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పేరు ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వ్యవసాయ భూములు, గ్రామ పంచాయతీలు, పట్టణాల్లోని స్థలాలు రీసర్వే ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. డ్రోన్లు, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) నెట్‌వర్క్‌తో చేపట్టనున్న రీసర్వే ప్రాజెక్టుకు రూ.987.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ప్రారంభమవుతుంది. మూడు దశల్లో రీ సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రాధాన్య కార్యక్రమాల్లో భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు ప్రధానమైనది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంద శాతం కచ్చితమైన కొలతలలో రాష్ట్రవ్యాప్తంగా భూములను రీ సర్వే చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భూ రికార్డులను స్వచ్ఛీకరించడంతోపాటు ట్యాంపర్డ్ ఫ్రూఫ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్స్ టెక్నాలజీ ద్వారా వీలైనంత తక్కువ ధరకు పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. -
రీ సర్వేకి 'రెడీ'
సాక్షి, అమరావతి: పొలం గట్లు (సరిహద్దు), భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రంలోని భూముల సమగ్ర రీ సర్వేకి రంగం సిద్ధమవుతోంది. మూడు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో రీ సర్వే పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన నివేదికను రెవెన్యూ శాఖ ఈనెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించనుంది. ప్రయోగాత్మకంగా చేసిన రీ సర్వేలో ఎదురైన అనుభవాలు, వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా కచ్చితత్వంతో రీ సర్వే చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీనిపై ఈనెల 21న రెవెన్యూ అధికారులతో సీఎం సమీక్షించి మార్గనిర్దేశం చేయనున్నారు. మూడు దశల్లో చేపడతాం ప్రతి మండలంలో మూడోవంతు గ్రామాల్లో మూడు దశల్లో రీ సర్వే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీ సర్వేకు ఎప్పుడు శ్రీకారం చుట్టాలనేది ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. – వి.ఉషారాణి, ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్స్ టెక్నాలజీతో.. ► రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1.63 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ విస్తీర్ణం పోగా రీ సర్వే చేయాల్సిన విస్తీర్ణం 1.22 లక్షల చదరపు కిలోమీటర్లు. ► ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. కొత్తగా నియమించిన 11,158 మంది గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత వీరిని రీ సర్వేకి వినియోగించుకుంటారు. ► ఇప్పటివరకూ మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో అమల్లో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రంలో రీ సర్వే మహా క్రతువు నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ► ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు చొప్పున సర్వేయర్లు అందుబాటులోకి రావడంతో సమగ్ర రీ సర్వేతోపాటు గ్రామాల్లో ఎప్పుడు భూములు కొలతలు వేయాలన్నా, సబ్ డివిజన్ చేయాలన్నా ఇక సర్వేయర్ల కొరత మాటే ఉండదు. ► కోవిడ్–19 నియంత్రణ చర్యల కారణంగా నిలిచిపోయిన రికార్డుల స్వచ్ఛీకరణను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేపట్టారు. -
రీసర్వేతో భూవివాదాలకు చరమగీతం
సాక్షి, అమరావతి: భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీసర్వే రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్) తయారు చేశారు. నేటికీ ఇదే ప్రామాణికంగా ఉంది. ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సి ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు. లెక్కలేనన్ని మార్పులు చేర్పులు తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడంవల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడంవల్ల సబ్డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలపాలయ్యాయి. వాస్తవంగా ఉన్న భూమికీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికీ మధ్య లక్షల ఎకరాల తేడా ఏర్పడింది. భూరికార్డులు సక్రమంగా లేనందున సివిల్ కేసుల్లో భూ వివాదాలకు సంబంధించినవే 60 శాతంపైగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రికార్డుల స్వచ్ఛీకరణ, భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పనే ఇలాంటి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు చెప్పడంతో జగన్ సర్కారు ఈ చర్యలకు సాహసోపోత నిర్ణయాలు తీసుకుంది. జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్, రీసర్వే 18న ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా భూములను సమగ్ర రీసర్వే చేయాలని నిర్ణయించిన జగన్ సర్కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుకు ఈనెల 18న (మంగళవారం) శ్రీకారం చుట్టనుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్‌ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభిస్తారు. తదుపరి మండలంలోని 25 గ్రామాల్లోగల 66,761 ఎకరాల భూముల్లో రీసర్వే పూర్తి చేస్తారు. ఇక్కడ వచ్చే అనుభవాలతో అవసరమైన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం త్వరితగతిన ప్రక్రియను చేపట్టనుంది. రైతులపై నయాపైసా భారం లేదు: ఉప ముఖ్యమంత్రి బోస్ ప్రస్తుతం ఎవరైనా రైతు తన భూమిని సర్వే చేయించుకోవాలంటే మీసేవలో రుసుం చెల్లించాలి. అయితే భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టుకు రూ.2000 కోట్ల వ్యయం అవుతున్నా రైతులపై నయాపైసా కూడా భారం మోపకుండా మొత్తం ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు బోస్ ‘సాక్షి’కి తెలిపారు. 2022 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసి పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామన్నారు. -
‘యాదాద్రి’ థర్మల్ ప్లాంట్ కోసం రీ సర్వే
మోదుగుకుంటతండా(దామరచర్ల):మండలం పరిధిలో వీర్లపాలెం గ్రామంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతల పెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణ భూమి కోసం రెవెన్యూ సిబ్బంది మంగళవారం రీ సర్వే చేపట్టారు. 4 వేల మేఘావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన అటవీ భూమి 4676 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం జెన్కో సంస్థకు అప్పగించింది. ఆ భూముల పరిధిలో వీర్లపాలెం గ్రామ శివారులో గల మోదుగుకుంటతండా, కపూర్తండాలు ఉన్నాయి. తండాల పరిధిలో 405 ఎకరాల భూమి, 170 ఇళ్లు కోల్పోనున్నారు. అందుకు కలెక్టర్ సత్యనారయణరెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆయా తండాల్లో సర్వే చేపట్టారు. ఇంటి వైశాల్యం, ఇల్లు దేనితో నిర్మిచారు. గదులు, బోరు, ప్రహరీ, వంటగది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో తహసీల్దార్ వేముల రమాదేవి, డీటీ శేఖర్, ఆర్ఐ నూర్యకుమారీ, డీఎస్ఓ కిషన్, సర్వేయర్ ఉదయ్, వీఆర్ఓలు మేష్యానాయక్, రూప్రావులు పాల్గొన్నారు. సర్వేను అడ్డుకున్న తండావాసులు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న మోదుగుకుంటతండా, కపూర్‌తండా ప్రజలు రెవెన్యూ సిబ్బందిని సర్యే చేయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు నష్టపరిహారం, పునరావాసం విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా పవర్ ప్లాంట్ పనులు ఏ విధంగా చేపడుతారని అధికారులను నిలదీశారు. అప్పటి వరకు పనులు చేపట్టనివ్వమన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తాం: ఆర్డీఓ కిషన్‌రావు తండా వాసులు సర్వేను అడ్డుకున్నారని తెలిసి ఆర్డీఓ కిషన్ రావు ఘటన స్థలానికి చేరుకుని తండావాసులతో మాట్లాడారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పునరావసం, నష్టపరిహాం విషయంలో ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నట్టు చెప్పారు. అంతే కాకుండా ఉద్యోగ అవకాశాల్లో పాధాన్యత ఇస్తామని చెప్పడంతో తండావాసులు ఆందోళన విరమించారు.ఆర్టీఓ వెంట తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ సూర్యకుమారి, డీటీ శేఖర్ ఉన్నారు.