Tamil Political Parties
-
‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర
చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం అమలుకు కేంద్ర ప్రయత్నిస్తోందంటూ తమిళ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. ద్వి భాషా విధానాన్నే కొనసాగిస్తామని తమిళ సర్కార్ తెలిపింది. ప్రముఖ శాస్త్రవేత్త కస్తూరిరంగన్ నేతృత్వంలో రూపొందించిన జాతీయ విద్యా విధానంలోని ప్రతిపాదనలు శుక్రవారం వెల్లడయ్యాయి. కొన్ని మార్పులు చేర్పులతో అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో త్రిభాషా సూత్రం (మాతృభాష, ఇంగ్లిష్‌తోపాటు హిందీ)అమలు చేయాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీనిపై తమిళనాడులోని పలు పార్టీల నేతలు స్పందించారు. ‘త్రిభాషా విధానం అమలు, హిందీని పాఠశాల స్థాయి నుంచి 12వ తరగతి వరకు నేర్వాలనడం పెద్ద షాక్. ఈ ప్రతిపాదన దేశాన్ని విభజిస్తుంది’ అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. ‘పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు అర్థం ఏమిటి? హిందీని తప్పనిసరి చేయాలని చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం మొదట్లోనే బయటపడుతోంది’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. అది ప్రతిపాదన మాత్రమే: కేంద్రం త్రి భాషా సూత్రాన్ని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ తమిళ పార్టీలు చేస్తున్న ఆరోపణను సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఖండించారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ముసాయిదాలో అది ఒక ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు. ‘మోదీ ప్రభుత్వం అన్ని భాషల అభివృద్ధిని కోరుకుంటోంది. ఎన్ఈపీ కమిటీ ప్రతిపాదనలపై అపోహలు అవసరం లేదు. అది ప్రతిపాదన మాత్రమే. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నాకే నిర్ణయిస్తాం’ అని అన్నారు. -
తంబీ.. సినిమా కామిక్కిరెన్
జీఎస్టీపై తూటాల్లా పేలే మాటలతో ‘మెర్సెల్’.. ఒక్క ఓటు కోసం వ్యవస్థపైనే తిరుగుబాటు చేసిన ‘సర్కార్’.. అంటరాని వసంతానికి తెర మీద జరిగిన సెలబ్రేషన్ ‘కాలా’.. .. ఇవే కాదు, వ్యవస్థలోని లోటుపాట్లపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ, కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తూ, విమర్శనాత్మకంగా, సందేశాత్మకంగా ప్రభుత్వ వ్యతిరేకతపై గళమెత్తి మిర్చీ ఘాటులా ఉక్కిరిబిక్కిరి చేసిన చిత్రాలెన్నో తమిళనాట ‘సినిమా కామిక్కిరెన్’ (సినిమా చూపిస్త..) అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. మోదీకి మద్దతుగా బాలీవుడ్లో వచ్చిన సినిమాల కన్నా, ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిలో మూడేళ్లలో కోలీవుడ్‌లో వచ్చిన డజనుకి పైగా సినిమాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. నిర్మాతలకు కాసులు కురిపించిన ఇవి.. ప్రతిపక్ష డీఎంకేకు ఓట్లు కురిపిస్తాయా?. ఎల్కేజీ, జోకర్, మెర్సెల్, ఇరుంబుతిరాయ్, తమిళ్ పాదం–2, నత్పే తున్నాయ్–2, కాలా, సర్కార్, ఉరియాడి.. మూడేళ్లలో కోలీవుడ్‌లో విడుదలైన సినిమాలివి. సమకాలీన రాజకీయాలపై, వ్యవస్థలో లోపాలపై వెండితెర గురి తప్పని షూటింగ్ ఇది. ఈ సినిమాలు తమిళ గడ్డపై మోదీ వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాయన్నది వాస్తవం. అది ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. కేంద్రమే టార్గెట్.. నిరసనకారులందరూ రోడ్డెక్కి తమ గళం వినిపిస్తూ ఉంటే, కరడు గట్టిన రాజకీయ నాయకుడు నిర్దాక్షిణ్యంగా వారిపై కాల్పులకు ఆదేశిస్తాడు.. ఇది ఒక సిని మాలో సన్నివేశమే కావచ్చు. కానీ తమిళగడ్డపై వేదాంత గ్రూప్‌కు చెందిన స్టెరిలైట్ సంస్థని ఎత్తేయాలంటూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారుల గుండెల్లో దిగిన పోలీసు తూటా సృష్టించిన రక్తపాతమే స్ఫురణకు వస్తుంది. అందరి కడుపు నింపే అన్నదాత తన కడుపు మాడ్చుకుంటూ ఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి నిరసన చేసినా కనికరం చూపని కేంద్రం వైఖరి కళ్లకు కడుతుంది. తమ ప్రియతమ నాయకురాలు మరణం చుట్టూ కేంద్రం రాజకీయాలు చేసినట్టుగా వచ్చిన వార్తలు ఇంకా పచ్చిగానే తమిళ తంబిల మనసుల్లో నిలిచి ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు సామాన్యుడి జీవితాల్ని తలకిందులుగా చేసిన వైనం వెండితెరపై తూటాల్లా పేలే మాటలతో చీల్చి చెండాడుతుంటే ప్రేక్షకులు మురిసిపోయారు. ఆ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణిపై దళితుల ధిక్కారాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమాలో చూసి పండుగ చేసుకున్నారు. ఈ సినిమాలన్నీ ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్‌కి ఏ మేరకు ఓట్లు రాలుస్తాయో చెప్పలేం కానీ, మన వ్యవస్థలో లోటుపాట్లు, వాటిపై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి జనం గుండెల్లోకి దూసుకుపోయేలా చేయడంలో విజయం సాధించాయని సినీ, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలన్నీ కట్టుకథలని తమిళనాడు బీజేపీ శాఖ అంటోంది. బాలీవుడ్ ఎందుకీ పని చేయలేకపోతోంది? బాలీవుడ్ కూడా రాజకీయ, సామాజిక అంశాలతో సినిమాలు నిర్మిస్తూనే ఉంది. కానీ అవన్నీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. కానీ అవి ఏ మేరకు జనంపై ముద్ర వేశాయో నిపుణుల అంచనాలకు అందడం లేదు. తమిళ సినిమాలు ఓట్లు రాల్చినంతగా హిందీ రాష్ట్రాల ప్రజలు సినిమాలు చూసి ప్రభావితమై తమ ఓటింగ్ నిర్ణయం మార్చుకోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరీ’ సినిమా యువతరాన్ని ఉర్రూతలూగించింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘యాక్సిడెంటల్ పీఎం’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇంకా ‘పాడ్ మ్యాన్’, ‘గోల్డ్’, ‘సత్యమేవ జయతే’, ‘పరమాణు’, ‘బాఘీ 2’, ‘మణికర్ణిక’ వంటి సినిమాలు బీజేపీ సిద్ధాంతాలకు ఊతమిచ్చేవిగా, జాతీయ భావాన్ని పెంచేవిగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్నతనంపై వచ్చిన ‘చలో జీతే హై’ షార్ట్ ఫిల్మ్ , స్వచ్ఛభారత్ కార్యక్రమంపై వచ్చిన ‘మేరే ప్యారే ప్రధానమంత్రి’ విమర్శకుల ప్రశంసలు పొందాయి కానీ జనం వాటిని ఎంత పట్టించుకున్నారనేది అనుమానమే. రాజకీయాలతో ముడిపడిన సినిమాలు తీసి కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం తమిళులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అందులో విషయం ఎంత సమగ్రంగా ఉందనేది ముఖ్యం కాదు. బుల్లెట్ దిగిందా లేదా! అదే కావల్సింది. – సంతోష్ దేశాయ్, అడ్వర్టయిజింగ్ అండ్ మీడియా నిపుణుడు ఇటీవల వచ్చిన తమిళ సినిమాల్లో.. పెత్తనమంతా కేంద్రానిదేనని, వారు ప్రవేశపెట్టే జనాకర్షక పథకాలన్నీ కాగితాలకే పరిమితమన్నట్టుగా చూపించారు. కానీ అవన్నీ శుద్ధ అబద్ధాలు. ‘పేట’, ‘సర్కార్’ వంటి సినిమాలు డీఎంకే పార్టీకి చెందిన సన్ పిక్చర్స్ తీసింది. అందుకే కట్టుకథలను జనంపైకి వదిలింది. – ఎస్జీ సూర్య, బీజేపీ యూత్ వింగ్ అధ్యక్షుడు తమిళులకు సినిమాలే ఊపిరి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి రాజకీయ దిగ్గజాలు సినిమాలతో వచ్చిన ఇమేజ్ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఎదిగారు. ఇవాళ రేపు సినీ నిర్మాతలు రాజకీయాల్లోకి వచ్చి ఎదగాలని చూస్తున్నారు. ఈ విషయంలో కోలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ ఎంతో వెనుకబడి ఉంది. ‘కాలా’ అంటే నలుపు. ద్రవిడ సిద్ధాంతానికి సంకేతం. దళితవాదానికి గుర్తు. అణగారిన బతుకులకు చిహ్నం. ‘కాలా’, ‘పేట’ వంటి సినిమాలు హిందూ అతివాద ధోరణిని ఉతికి ఆరేశాయి. వాటి ప్రభావం ప్రజలపై, ఎన్నికల్లో వారు తీసుకునే నిర్ణయంపై కచ్చితంగా ఉంటుంది. – కవితా మురళీధరన్, రచయిత్రి సింగపూర్‌లో 7% జీఎస్టీ వసూలు చేసి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తుంటే, మన దేశంలో 28% జీఎస్టీ వసూలు చేస్తున్నా ఉచిత వైద్యం ఎవరికీ అందడం లేదు (మెర్సెల్) నలుపు శ్రమ జీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు.. మురికంతా ఇంద్రధనస్సులా కనిపిస్తుంది (‘కాలా) -
నయన్‌పై రాజకీయ కన్ను
నటి నయనతారపై రాజకీయ కన్ను పడుతోంది. ఆమె క్రేజ్‌ను వాడుకోవాలని తమిళనాట కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. రాజకీయాల్లో సినీ తారలన్నది కొత్తేమీకాదు. ఇక్కడి నుంచి వెళ్లి రాష్ట్రాన్ని ఏలినవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నటిగా నయనతార స్టామినా గురించి ఇప్పుడు ప్రస్థావించనక్కర్లేదు. ఈ సంచలన తార బహుభాషా నటి. రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి అంచుల వరకూ వెళ్లి మూడు ముళ్లకు దూరమయ్యి నటనే వద్దనుకుని మళ్లీ దాన్నే ఆశ్రయించి విజయాల బాట పట్టిన సంచలన నటి నయన్. కోలీవుడ్‌లో రాజా రాణి చిత్రంతో రీఎంట్రీ అయ్యి హీరోయిన్గా సక్సెస్ అయిన ఈ కేరళా కుట్టికి మధ్యలో కొన్ని అపజయాలు ఎదురయ్యాయి. ఇటీవల తనీఒరువన్, మాయ చిత్రాలు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం ఐదారు చిత్రాలు చేతిలో ఉన్నాయి. రాయకీయ గాలం ఇటీవల నయనతార ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి సేలం వెళ్లారు. అక్కడ ఆమెను చూడటానికి ఒక పెద్ద కూటమే తరలి వచ్చింది. ఎంత పెద్ద కూటమి అంటే రాజకీయ వర్గాలే ఆశ్చర్యపడేంతగా. సుమారు ఐదు వేలకు పైగా వచ్చిన నయనతార అభిమానుల్ని చూసి రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిందట. ఆమెను ఎలాగయినా తమ పార్టీలోకి లాగాలని కొన్ని రాజకీయపార్టీలు ఆలోచనలు చేస్తున్నాయని సమాచారం. డీఎంకే ముందంజ బీజేపీ, డీఎంకే పార్టీలు నమనతారను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆల్ రెడీ ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో డీఎంకే కాస్త ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఒక డీఎంకే నేత స్పందిస్తూ రాజకీయంగా ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చాలా బలంగా ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో డీఎంకేకు ప్రచారాస్త్రంగా ఒక పాపులర్ వ్యక్తి అవసరం ఉందన్నారు. సేలంలో నటి నయనతార క్రేజ్‌ను చూసిన తరువాత ఆమెను పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచన వచ్చిన మాట నిజమేనన్నారు. కొన్నేళ్ల క్రితం నటి కుష్భూ డీఎంకే పార్టీలో చేరారని, తన పార్టీకి విశేష సేవలు అందిచారని అన్నారు. అయితే కుష్భూ నిర్మోహమాట వ్యాఖ్యలు, చర్యలు పార్టీలోని కొందర్ని ఇబ్బందికి గురి చేశాయన్నారు. దీంతో ఆమె పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేక పోయారని చెప్పారు. ఇప్పుడామె స్థానంలో నయనతార లాంటి ఒక స్టార్ నటి అవసరం అయ్యారని చెప్పుకొచ్చారు. నయనతార మాటేంటి నటి నయనతార గురించి రాజకీయ చర్చ వాడివేడిగా జరుగుతుంటే ఆమె వర్గం మాత్రం నయనతారకు ఇప్పట్లో రాజకీయ ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉందని అంటున్నారు. -
బాలీవుడ్ లో నాకు ఎదురేది!:సన్నీ లియోన్
ఈ జనరేషన్ మనసు దోచుకున్న శృంగార తార ‘సన్నీ లియోన్’. పలు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ‘జిస్మ్ 2’ ద్వారా హిందీ చిత్రరంగానికి పరిచయమయ్యారు. ఆ చిత్రంలో ఈ హాట్ గాళ్ ఏమాత్రం వళ్లు దాచుకోకుండా నటించిన వైనం చాలామందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారులో సన్నీకి చాలా క్రేజ్ నెలకొంది. అసలు ఆమె హిందీ చిత్ర రంగంలో అడుగుపెట్టడానికి ఐదో సీజన్ లో జరిగిన బిగ్ బాస్ రియాల్టీ షోనే. అలా జిస్మ్ 2లో అవకాశాన్ని చేజిక్కించుకున్న సన్నీ లియోన్ బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బి అవుతోంది. షూటౌట్ ఎట్ వాడాల, జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్2 చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించిన సన్నీ.. బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో తాను చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది. 'నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నాకు బాలీవుడ్ లో ఒక మార్క్ గుర్తింపు వచ్చింది. ఇంకా మంచి పాత్రలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తా' అంటూ పేర్కొంది. ఇప్పటికి మూడు చిత్రాలు మాత్రమే నటించానని, ప్రస్తుతం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని తెలిపింది. అభిమానులు తన సినిమాలు చూసి ఎక్కువ ఎంజాయ్ చేయాలని సన్నీ తెలిపింది. డ్యాన్స్, నటనా పరంగా ఇంకా కష్టపడి పని చేస్తే తన చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడమే ఖాయమని పేర్కొంది. -
సన్నీ నటిస్తే.. సినిమా ఆపేస్తారట!
ఈ జనరేషన్ మనసు దోచుకున్న శృంగార తార ‘సన్నీ లియోన్’. పలు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ‘జిస్మ్ 2’ ద్వారా హిందీ చిత్రరంగానికి పరిచయమయ్యారు. ఆ చిత్రంలో ఈ హాట్ గాళ్ ఏమాత్రం వళ్లు దాచుకోకుండా నటించిన వైనం చాలామందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారులో సన్నీకి చాలా క్రేజ్ నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే, తమిళ నిర్మాత దయానిధి అళగిరి ‘వడకర్రి’ చిత్రంలో సన్నీతో ఐటమ్ సాంగ్ చేయించాలనుకుని ఉంటారు. ఈ పాట ద్వారా కోలీవుడ్‌కి ఎంట్రీ దొరుకుతుందని సన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ విషయం తెలిసిన ‘హిందూ ముక్కళ్ కట్చి’ (తమిళనాడుకి చెందిన ఓ పార్టీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీలి చిత్రాల్లో నటించిన సన్నీని తమిళ చిత్రాల్లో నటింపజేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ఓ ప్రకటన జారీ చేశారు. పోర్న్ స్టార్స్‌ని ప్రోత్సహిస్తే.. తమిళ రంగంలో అలాంటి తారల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అది జరగడానికి వీల్లేదని కూడా పేర్కొన్నారు. ఒకవేళ సన్నీని కనుక ఈ చిత్రంలో నటింపజేస్తే, సినిమా ప్రదర్శనని ఆపడానికి కూడా వెనకాడమని హెచ్చరిక జారీ చేసిందట సదరు పార్టీ. వచ్చే నెల ఈ పాటను చిత్రీకరించాలనుకున్నారు. తాజా పరిణామాలతో సన్నీ స్థానంలో వేరే తారను ఎంపిక చేస్తారో లేక హిందూ మక్కళ్ కట్చి హెచ్చరికను నిర్మాత ఎదుర్కొంటారో చూడాలి.