సన్నీ నటిస్తే.. సినిమా ఆపేస్తారట! | Tamil political parties oppose sunny leone in movies | Sakshi
Sakshi News home page

సన్నీ నటిస్తే.. సినిమా ఆపేస్తారట!

Published Thu, Nov 28 2013 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

Tamil political parties oppose sunny leone in movies

ఈ జనరేషన్ మనసు దోచుకున్న శృంగార తార ‘సన్నీ లియోన్’. పలు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ‘జిస్మ్ 2’ ద్వారా హిందీ చిత్రరంగానికి పరిచయమయ్యారు. ఆ చిత్రంలో ఈ హాట్ గాళ్ ఏమాత్రం వళ్లు దాచుకోకుండా నటించిన వైనం చాలామందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారులో సన్నీకి చాలా క్రేజ్ నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే, తమిళ నిర్మాత దయానిధి అళగిరి ‘వడకర్రి’ చిత్రంలో సన్నీతో ఐటమ్ సాంగ్ చేయించాలనుకుని ఉంటారు. ఈ పాట ద్వారా కోలీవుడ్‌కి ఎంట్రీ దొరుకుతుందని సన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
 
  ఈ విషయం తెలిసిన ‘హిందూ ముక్కళ్ కట్చి’ (తమిళనాడుకి చెందిన ఓ పార్టీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీలి చిత్రాల్లో నటించిన సన్నీని తమిళ చిత్రాల్లో నటింపజేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ఓ ప్రకటన జారీ చేశారు. పోర్న్ స్టార్స్‌ని ప్రోత్సహిస్తే.. తమిళ రంగంలో అలాంటి తారల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అది జరగడానికి వీల్లేదని కూడా పేర్కొన్నారు. ఒకవేళ సన్నీని కనుక ఈ చిత్రంలో నటింపజేస్తే, సినిమా ప్రదర్శనని ఆపడానికి కూడా వెనకాడమని హెచ్చరిక జారీ చేసిందట సదరు పార్టీ. వచ్చే నెల ఈ పాటను చిత్రీకరించాలనుకున్నారు. తాజా పరిణామాలతో సన్నీ స్థానంలో వేరే తారను ఎంపిక చేస్తారో లేక హిందూ మక్కళ్ కట్చి హెచ్చరికను నిర్మాత ఎదుర్కొంటారో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement