ఆసిఫాబాద్ లోనే కొనసాగించాలి
తాండూర్: తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ కొమురంభీమ్ జిల్లాలో ఉంచితేనే మండల యువతకు భవిత ఉంటుందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెండ్యాల గోపికృష్ణ అన్నారు. తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ జిల్లాలో కలి పేందుకు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పెండ్యాల గోపికృష్ణ, పుట్ట సంతోష్, కాసిపేట కృష్ణ, మల్లయ్య, జ్యోతి, ఇందారపు పద్మ, రాజేశ్వరి, పె ద్దబోయిన లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెండ్యాల గోపికృష్ణ మాట్లాడుతూ తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేసిన, మ ద్దతుగా ఉంటామన్న కొందరు ప్రజాప్రతినిధులు నేడు వారి స్వార్థం కోసం తమ ఆందోళనకు వ్యతిరేకంగా వ్యవహరించ డం ప్రజలను మోసగించడమే అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మె ప్పు కోసం తాండూర్ మండలాన్ని మంచిర్యాల జిల్లాలో ఉ ంచేలా వ్యవహరించడం సరికాదన్నారు. తాండూర్ మండలా న్ని ఆసిఫాబాద్ జిల్లాలో కలిపేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఈ దీక్షలకు పలువురు సంఘీభావం వ్యక్తం చేశారు.