అమ్మ కోసం..
► మంత్రుల నేతృత్వంలో యాగాలు
► రాష్ట్రవ్యాప్తంగా భక్తితో పూజలు
► సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థనలు
సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సోమవారం గణపతి హోమాలు, ఆయుష్, మృత్యుంజయ యాగాలు జరిపించా రు. అన్నాడీఎంకే వర్గాలు భక్తి శ్రద్ధలతో యాగాలు, పూజల్లో లీనమయ్యారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత ఆరోగ్యం మెరుగు పడడంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చిన విషయం తెలిసిందే. తమ అమ్మ ఆరోగ్యం మెరుగుపడడంతో అన్నాడీఎంకే వర్గాల ఆనందానికి అవదులు లేకుండాపోయారుు. తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా త్వరతగతిన ప్రజా సేవకు అంకితం కావాలని కాంక్షిస్తూ ఆలయాల్లో పూజల్ని హోరెత్తించే పనిలో పడ్డారు.
సోమవారం రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో యాగ, హోమాది పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మ జయలలిత పేరుతో మృత్యుంజయ యాగాలు, దీర్ఘాయుష్షు పూజలు, గణపతి హోమాలను నిర్వహించారు. చెన్నై, మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయంలో రాష్ట్రమంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి, కామరాజర్, సరోజ, ఎంసీ.సంపత్, దురైకన్ను, కడంబూరు రాజు, వలర్మతి, రాజలక్ష్మి, రామచంద్రన్‌ల నేతృత్వంలో మహా మృత్యుంజయ యాగం జరిగింది.
వ్యాసార్పాడిలోని మరుగదాంబాల్ ఆలయంలో ఎమ్మెల్యే వెట్రివేల్ నేతృత్వంలో ఆయుష్షు, మృత్యుంజయ యాగాలు భక్తి శ్రద్ధలతో సాగారుు. పురసైవాక్కంలోని గంగాదీశ్వర ఆలయంలో మంత్రి డి.జయకుమార్, పార్టీ నేత బాలగంగా నేతృత్వంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. నీలాంకరైలో అక్కడి పార్టీ వర్గాల నేతృత్వంలో 1,008 దీపాల పూజ నిర్వహించారు. అమంజికరైలోని ఏకాంబరేశ్వర ఆలయంలో మాజీ మంత్రి గోకుల ఇందిర నేతృత్వంలో గణపతి హోమం, పుదుకోటై్టలోని గోమతీశ్వరాలయంలో మాజీ ఎమ్మెల్యే కలై రాజన్ నేతృత్వంలో విశిష్ట పూజలు నిర్వహించారు. ఇక, అపోలో ఆసుపత్రి వద్దకు అన్నాడీఎంకే వర్గాల రాక పెరగడంతో పోలీసు అధికారులు మళ్లీ ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు.