Tanishiq
-
బడ్జెట్ ప్రకటన.. టాటా కంపెనీకి రూ.19,000 కోట్లు లాభం!
తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన టాటాకు చెందిన కంపెనీ టైటాన్‌కు ఒక్కరోజులో దాదాపు రూ.19,000 కోట్ల లాభాన్ని తెచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి పన్నును 6% తగ్గించడంతో టైటాన్ షేర్లు దాదాపు 7% పెరిగాయి. టాటా గొడుగు కింద ఉన్న జువెలరీ సంస్థ టైటాన్ బ్రాండ్ తనిష్క్ కారణంగా దాని స్టాక్ విలువలో వృద్ధిని సాధించింది.బీఎస్ఈ డేటా ప్రకారం, టైటాన్ షేరు 6.63 శాతం పెరిగి రూ.3,468.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, షేర్లు 7.30% పెరుగుదలతో ఒక రోజు గరిష్ట స్థాయి రూ.3,490కి చేరుకున్నాయి. ప్రారంభంలో టైటాన్ షేర్లు రూ.3,252 వద్ద ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్టుబడిదారుల ధృక్కోణంలో ఇది చాలా లాభదాయకం. ఉదాహరణకు, ఒక వ్యక్తి 10,000 టైటాన్ షేర్లను కలిగి ఉంటే, ఒక్కో షేరుకు రూ. 215.55 పెరుగుదలతో, వారు ఆ 10,000 షేర్లపై రూ.21,55,500 లాభం పొందుతారు. గతంలో టైటాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,88,757.16 కోట్లుగా ఉండగా, మంగళవారం (జూలై 23) నాటికి రూ.3,07,897.56 కోట్లకు పెరిగింది. అంటే కంపెనీ వాల్యుయేషన్ రూ.19,140.4 కోట్లు పెరిగింది.బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్నది రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఈ నిర్ణయం తర్వాత, దేశ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు 5% పైగా తగ్గాయి. ట్రేడింగ్ సెషన్లో వెండి రూ. 5,000 పైగా క్షీణించింది. -
తనిష్క్ 100 టన్నుల బంగారు మార్పిడి ఉత్సవాలు, ఏకంగా 20 లక్షలమంది
హైదరాబాద్: టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్– బంగారం మార్చుకోవడానికి సంబంధించి కీలక 1,00,000 కిలోల (100 టన్నులు) మైలురాయికి చేరుకుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన చేస్తూ, రెండు లక్షల మంది బంగారాన్ని మార్చుకున్నట్లు వెల్లడించింది. ‘నేటి అధిక ధరలు, లాకర్లలో పడి ఉన్న పాత బంగారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, వినియోగదారులకు మార్పిడి మంచిది. (10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?) ఇది దిగుమతులను తగ్గిస్తుంది కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థకూ శుభదాయకమే. పాత బంగారం మార్పిడి వేడుకల్లో మాతో చేరి, తమ పాత ఆభరణాలను మార్చుకోవాలని మేము ఈ సందర్భంగా అందర్నీ ఆహ్వానిస్తున్నాము’’ అని టైటాన్ కంపెనీ లిమిటెడ్ జ్యువెలరీ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజోయ్ చావ్లా తెలిపారు. తనిష్క్లో గోల్డ్ ఎక్సే్ఛంజ్ ఆఫర్ ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లలో అమలవుతుంది. 20 క్యారెట్లు, అంతకంటే ఎక్కువ పాత బంగారంపై 100శాతం విలువను అందించే ఆఫర్ సంస్థ షాపింగ్ చైన్‌లో లభ్యమవుతుంది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఔనా..! చోరీ చేశారా..
ఈపూరు, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసులో మండల కేంద్రం ఈపూరుకు చెందిన ఇద్దరు యువకులు నిందితులని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఇక్కడి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతటి భారీ చోరీ చేసింది మా ఊరి యువకులా అంటూ వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. టాటా ఎంటర్‌ప్రైజస్‌కు చెందిన హైదరాబాద్ పంజాగుట్టలోని తనిష్క్ జువెలర్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 23 కోట్లరూపాయల విలువైన బంగారు ఆభరణాలు దొంగలపాలయ్యాయి. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఈ చోరీని తానే చేశానంటూ కిరణ్‌కుమార్ అనే యువకుడు ప్రకటించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈపూరుకు చెందిన కిరణ్‌కుమార్ మరొకరితో కలిసి ఈ చోరీకి పాల్పడ్టట్టు వార్తలు వెలువడడంతో ఆ గ్రామ ప్రజలు ఒకింత కలవరపాటుకు గురయ్యారు. నిన్న, మొన్నటి వరకు గ్రామస్తులతో కలిసి తిరిగిన భూమన కిరణ్‌కుమార్, గంటినపాటి ఆనంద్‌లు చోరీ కేసులో కీలకపాత్ర పోషించారంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. పిలిస్తేనే పలికే వారిద్దరు భారీ దొంగతనానికి ఒడిగట్టడానికి ఎలాంటి కారణాలు దారితీసివుంటాయనే దిశగా గ్రామస్తులు చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు.. ఈపూరు మాలపాడుకు చెందిన యువకులు భూమన కిరణ్‌కుమార్, గంటినపాటి ఆనంద్‌లు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. పెయింటర్‌గా పనిచేసే కిరణ్‌కుమార్‌ను ఇక్కడ అంతా వివాదరహితుడిగా చెపుతున్నారు. తల్లి అన్నపూర్ణమ్మ కూరగాయలు అమ్ము తుంటారు. తల్లిదండ్రుల ఐదుగురు సంతానంలో పెద్ద కుమారుడు రవీంద్ర గుంటూరులోని సిమ్స్‌లో పని చేస్తున్నారు. రెండో కుమారుడు రాజు హైదరాబాద్‌లో పెయింటర్‌గా జీవిస్తున్నారు. మూడో కుమారుడు ఆశోక్చక్రవర్తి మాచర్లలోని ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు ఉద్యోగి కాగా, ఐదవ కుమారుడు ప్రదీప్‌కుమార్ ఇంటి వద్దనే ఉంటున్నారు. నాల్గవ కుమారుడైన కిరణ్‌కుమార్ తనిష్క్ జువెలర్స్‌లో భారీ చోరీ చేయడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏనాడూ ఈపూరు పోలీసు స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేదంటున్నారు. అతని బంధువు ఆనంద్ జనవరి 1న హైదరాబాద్ వెళ్ళినట్టు చెబుతున్నారు. అయితే ఆనంద్‌కు మతిస్థిమితం సరిగా ఉండదని చెపుతున్నారు. వికలాంగుడైన ఆనంద్ చోరీ కేసులో ఉండడాన్ని నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఆనంద్ తండ్రి శామ్యూల్ తాపీ మేస్త్రీగా పని చేస్తున్నారు. స్థానికంగా మిర్చిబస్తాలు మోసే కూలీగా పనిచేసిన కిరణ్ తండ్రి 2011లో పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యునిగా గెలుపొందారు. ఆ తరువాత గుండెపోటుతో మరణించారు. టీడీపీలో కలకలం ‘తనిష్క్’ జువెలర్స్‌లో చోరీకి పాల్పడి పోలీసుల ఎదుటకొచ్చిన భూమన కిరణ్‌కుమార్ వ్యవహారం జిల్లా టీడీపీ శ్రేణుల్లో కలకలానికి దారితీసింది. వినుకొండ నియోజకవర్గం మండల కేంద్రం ఈపూరుకు చెందిన కిరణ్ స్థానికంగా టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాడు. అతని తండ్రి 2011లో టీడీపీ తరఫున పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేస్తూ గుండెపోటుతో మరణించారు. ప్రస్తు తం కిరణ్ మేనమామ కూడా ఆ పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపార్టీకి చెందిన కార్యకర్త భారీ చోరీ కేసులో నిందితుడవడంపై నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి కే జిల్లాలో సీనియర్ టీడీపీ నేతలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పాటు అదే పార్టీకి చెందిన పలువురు నేతలు క్రిమినల్ కేసుల్లో ఉండడం, రానున్న ఎన్నికల్లో ఓటింగ్‌ను దెబ్బతీసే అంశాలుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. తాజాగా, దోపిడీ కేసులో ప్రధాన నేరస్తునిగా ప్రకటించుకున్న కిరణ్.. నేటి రాజకీయాల్లో తాను దగ్గరగా చూసిన నేతల అవినీతి, దోపిడీని ప్రస్తావించడం టీడీపీ నేతలకు మరింత షాక్‌నిస్తోంది.