
హైదరాబాద్: టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్– బంగారం మార్చుకోవడానికి సంబంధించి కీలక 1,00,000 కిలోల (100 టన్నులు) మైలురాయికి చేరుకుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన చేస్తూ, రెండు లక్షల మంది బంగారాన్ని మార్చుకున్నట్లు వెల్లడించింది. ‘నేటి అధిక ధరలు, లాకర్లలో పడి ఉన్న పాత బంగారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, వినియోగదారులకు మార్పిడి మంచిది.
(10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?)
ఇది దిగుమతులను తగ్గిస్తుంది కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థకూ శుభదాయకమే. పాత బంగారం మార్పిడి వేడుకల్లో మాతో చేరి, తమ పాత ఆభరణాలను మార్చుకోవాలని మేము ఈ సందర్భంగా అందర్నీ ఆహ్వానిస్తున్నాము’’ అని టైటాన్ కంపెనీ లిమిటెడ్ జ్యువెలరీ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజోయ్ చావ్లా తెలిపారు. తనిష్క్‌లో గోల్డ్ ఎక్సే్ఛంజ్ ఆఫర్ ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్‌లలో అమలవుతుంది. 20 క్యారెట్లు, అంతకంటే ఎక్కువ పాత బంగారంపై 100శాతం విలువను అందించే ఆఫర్ సంస్థ షాపింగ్ చైన్‌లో లభ్యమవుతుంది.
ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?
మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment