Gold exchange
-
తనిష్క్ 100 టన్నుల బంగారు మార్పిడి ఉత్సవాలు, ఏకంగా 20 లక్షలమంది
హైదరాబాద్: టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్– బంగారం మార్చుకోవడానికి సంబంధించి కీలక 1,00,000 కిలోల (100 టన్నులు) మైలురాయికి చేరుకుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన చేస్తూ, రెండు లక్షల మంది బంగారాన్ని మార్చుకున్నట్లు వెల్లడించింది. ‘నేటి అధిక ధరలు, లాకర్లలో పడి ఉన్న పాత బంగారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, వినియోగదారులకు మార్పిడి మంచిది. (10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?) ఇది దిగుమతులను తగ్గిస్తుంది కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థకూ శుభదాయకమే. పాత బంగారం మార్పిడి వేడుకల్లో మాతో చేరి, తమ పాత ఆభరణాలను మార్చుకోవాలని మేము ఈ సందర్భంగా అందర్నీ ఆహ్వానిస్తున్నాము’’ అని టైటాన్ కంపెనీ లిమిటెడ్ జ్యువెలరీ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజోయ్ చావ్లా తెలిపారు. తనిష్క్లో గోల్డ్ ఎక్సే్ఛంజ్ ఆఫర్ ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లలో అమలవుతుంది. 20 క్యారెట్లు, అంతకంటే ఎక్కువ పాత బంగారంపై 100శాతం విలువను అందించే ఆఫర్ సంస్థ షాపింగ్ చైన్‌లో లభ్యమవుతుంది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
గోల్డ్ రిసీట్స్‌లో ట్రేడింగ్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రూపంలో గోల్డ్ రీసీట్స్ (ఈజీఆర్)ను తన ప్లాట్‌ఫామ్‌పై ప్రారంభించేందుకు సెబీ నుంచి తుది అనుమతి లభించినట్టు బీఎస్ఈ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించి సెబీకి సూత్రప్రాయ ఆమోదం రాగా, ఎన్నో విడతలుగా ఈజీఆర్ ట్రేడింగ్‌లో మాక్ టెస్టింగ్ కూడా నిర్వహించింది. వ్యక్తిగత ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు సహా ఎవరైనా బీఎస్ఈ ఈజీఆర్‌లలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి అవకాశం అందుబాటులోకి రానుంది. తుది ఆమోదం మంజూరు చేసినందుకు సెబీకి బీఎస్ఈ ధన్యవాదాలు తెలియజేసింది. త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని బీఎస్ఈ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ పాటిల్ తెలిపారు. ఈజీఆర్ ప్లాట్‌ఫామ్ వల్ల బంగారం సరఫరాలో గొప్ప నాణ్యతకు దారితీస్తుందన్నారు. అలాగే, న్యాయమైన ధరలు, లావాదేవీల్లో పారదర్శకత ఉంటుందన్నారు. అన్ని డిపాజిటరీలు, వోల్ట్‌లతో సంప్రదింపులు చేస్తున్నామని, ఈజీఆర్ ట్రేడ్‌కు కావాల్సిన ఎకోసిస్టమ్ అభివృద్ధికి పనిచేస్తున్నట్ట బీఎస్ఈ ప్రకటించింది. మన దేశం ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసకుంటూ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
ఈజీఆర్ విభాగం ఏర్పాటు దిశలో బీఎస్ఈ అడుగులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) విభాగం ఏర్పాటు దిశలో బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) కీలక అడుగులు వేసింది. ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడానికి మహారాష్ట్ర, తమిళనాడు నుంచి నాలుగు ప్రాంతీయ అసోసియేషన్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బీఎస్ఈ తెలిపింది. వీటిలో తిరునెల్వేలి గోల్డ్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్, నాందేడ్ సరాఫా అసోసియేషన్, సరాఫ్ సువర్కర్ సంత్నా పూసద్, ఘడ్చిరోలి జిలా సరాఫా అసోసియేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిలోని దాదాపు 1,000 మంది సభ్యులు జ్యూయలరీ, బులియన్ ట్రేడ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యాలతో దేశీయ, అంతర్జాతీయ జోన్లలో శక్తివంతమైన గోల్డ్ ఎక్సే్చంజ్‌ని అభివృద్ధి చేయడంలో పరివర్తనాత్మక పాత్రను పోషించగలదనే విశ్వాసాన్ని బీఎస్ఈ వ్యక్తం చేసింది. ఈజీఆర్ సెగ్మెంట్ ఏర్పాటుకు కొద్ది రోజుల క్రితమే బీఎస్ఈకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో గోల్డ్ ఎక్సే్చంజ్‌ల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని కూడా సెబీ ఇటీవలే నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సే్చంజ్‌ల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సే్చంజ్ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గోల్డ్ ఎక్సే్ఛంజ్, వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్లు్యడీఆర్ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బంగారంతో ట్రేడింగ్.. గోల్డ్ ఎక్సేంజీ ఏర్పాటులో కీలక అడుగులు
న్యూఢిల్లీ: భారత్‌లో గోల్డ్ ఎక్సేంజీల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సేంజీ ఏర్పాటు ప్రతిపాదనను గత ఏడాది సెప్టెంబర్‌లో సెబీ బోర్డు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గోల్డ్ ఎక్సేంజీల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సేంజీ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు - ఈజీఆర్‌ల సృష్టికి సంబంధించి డిపాజిట్ చేసిన బంగారం కోసం ఉద్దేశించిన వాల్టింగ్ సేవలను అందించడానికి సెబీ మధ్యవర్తిగా వాల్డ్ మేనేజర్ నమోదవుతారు. మేనేజర్‌పై సెబీ పూర్తిస్థాయి నియంత్రణ ఉంటుంది. - పసిడి డిపాజిట్లను అంగీకరించడం, బంగారం నిల్వ, భద్రపరచడం, ఈజీఆర్‌ల రూపకల్పన–ఉపసంహరణ, ఫిర్యాదుల పరిష్కారం, డిపాజిటరీ రికార్డులతో భౌతిక బంగారాన్ని కాలానుగుణంగా సమన్వయం చేయడం వంటి అంశాలు వాల్ట్ మేనేజర్ బాధ్యతల్లో కొన్ని. - వాల్ట్ మేనేజర్‌గా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలకునే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు కోసం సెబీకి దరఖాస్తు చేసుకోవాలి. - దరఖాస్తుదారు భారతదేశానికి చెందినవారై కనీస నెట్‌వర్త్ రూ.50 కోట్లు కలిగిఉండాలి. - మంజూరు చేయబడిన ఏదైనా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ‘నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో’ సస్పెండ్ చేసే రద్దు చేసే అధికారం సెబీకి ఉంటుంది. - ఒక వాల్ట్ మేనేజర్ ఈ నిబంధనలలో నిర్దేశించిన గోల్డ్ ఎక్సేంజీ వ్యాపారంతోపాటు మరైదైనా కార్యకలాపాలను నిర్వహిస్తున్న పక్షంలో రెండు బిజినెస్ వ్యవహారాల పట్ల స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. తన వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేక స్థలాలను సైతం తప్పనిసరిగా కేటాయించుకోవాలి. - వాల్ట్ మేనేజర్లు వాల్టింగ్ సేవలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డ్ చేయడానికి తగిన వ్యవస్థ (సిస్టమ్)లను కలిగి ఉండాలి. - బంగారం నిల్వ, బదిలీ, ఉపసంహరణ వివరాలు; డిపాజిట్ చేసిన బంగారం స్వచ్ఛత, పరిమాణం– బరువు, ఈజీఆర్‌ల సృష్టి, ట్రేడింగ్ వంటి అంశాలకు సంబంధించి పత్రాలను పారదర్శకంగా నిర్వహించాలి. ఆయా పత్రాలను కనీసం ఐదు సంవత్సరాలు వాల్డ్ మేనేజర్ భద్రపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెగ్యులేటర్ సెబీ నిర్దేశించిన నియమావళికి (కోడ్ ఆఫ్ కాండక్ట్) కట్టుబడి ఉండాలి. - వాల్ట్‌లలో బంగారం డిపాజిట్లకు సంబంధించి, ఈజీఆర్‌లను సృష్టించాలనుకునే ఎవరైనా రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ వద్ద బంగారం డిపాజిట్ కోసం అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. బంగారం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించే అధికారం వాల్డ్ మేనేజర్‌కు ఉంటుంది. బంగారు కడ్డీలను తూకం వేయడం, బంగారం డిపాజిట్ సమయంలో అవసరమైన డాక్యుమెంటేషన్ వంటి కార్యకలాపాల నిర్వహణ మేనేజర్ విధివిధానంలో భాగం. - వాల్ట్ మేనేజర్ లేదా ఆ సంస్థ తరపున అధికారం పొందిన వ్యక్తి ఎవరైనా.. గుర్తింపు పొందిన రిఫైనరీ లేదా నామినేటెడ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు నిర్ధారిస్తారు. - ఈజీఆర్ సృష్టి, క్యాన్సిలేషన్‌కు సంబంధించి డిపాజిటరీతో ప్రతి వాల్ట్ మేనేజర్ లావాదేవీ నిర్వహిస్తుంది. - డిపాజిటర్ నుండి బంగారాన్ని అంగీకరించిన తర్వాత, వాల్ట్ మేనేజర్ బెనిఫిషియల్ ఓనర్‌గా డిపాజిటర్ పేరు మీద ఈజీఆర్‌ను సృష్టిసారు. ఇందుకు అనుగుణంగా డాక్యుమెంటేషన్ జరుగుతుంది. - బంగారం ఉపసంహరణకు సంబంధించి, వాల్ట్ నుండి బంగారాన్ని విత్‌డ్రా చేయాలనుకునే బెనిఫిషియల్ ఓనర్ డిపాజిటరీకి ఈ మేరకు ఒక అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మొదట ఛార్జీల బకాయిలను వాల్డ్ మేనేజర్‌కు చెల్లించాలి. - వాల్ట్ మేనేజర్ ఖాతాలు, రికార్డులు, పత్రాలు, బంగారం డిపాజిట్ల పుస్తకాలను తనిఖీ చేసే హక్కు నియంత్రణా సంస్థ సెబీకి ఉంటుంది. సెక్యూరిటీ మార్కెట్ ప్రయోజనాలు, పారదర్శకత పరిరక్షణ సెబీ ప్రధాన ధ్యేయం. అయితే ఈ తరహా తనఖీకి 10 రోజుల ముందు వాల్డ్ మేనేజర్‌కు నోటీసు పంపడం జరుగుతుంది. - సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వాల్ట్ మేనేజర్స్ రూల్స్ పేరుతో జారీ అయిన కొత్త నిబంధనావళి డిసెంబర్ 31 నుండి అమలులోకి వచ్చింది. గోల్డ్ ఎక్సేంజీ, వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021–22 బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోల్డ్ ఎక్సేంజీ కోసం సెబీ నియంత్రకంగా ఉంటుందని మరియు కమోడిటీ మార్కెట్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బలోపేతం అవుతుందని చెప్పారు. కమోడిటీ మార్కెట్ పటిష్టత, పాదర్శకతలను పెంపొందించడానికి ఈ చర్య దోహదపడుతుందని ఆమె అన్నారు. చదవండి: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్‌లకు సెక్యూరిటీల హోదా -
జోస్ ఆలుక్కాస్లో గోల్డ్ ఎక్చ్సేంజ్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ సంస్థ ‘జోస్ ఆలుక్కాస్’ తాజాగా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ‘గోల్డ్ ఎక్చ్సేంజ్’ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు పాత 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను సరికొత్త డిజైన్లలోని 916 బీఐఎస్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలకు, ఐజీఐ ధ్రువీకృత వజ్రాభరణాలకు మార్పిడి చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వజ్రాభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన 20 శాతం తగ్గింపు పొందొచ్చని పేర్కొంది. నెఫ్ట్, ఆర్టీజీఎస్, చెక్కు, డెబిట్/క్రెటిడ్ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందొచ్చని తెలిపింది. అన్ని జోస్ ఆలుక్కాస్ షోరూమ్‌లలో అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొంది.