Tanla Solutions
-
గార్ట్నర్ నివేదికలో తాన్లా ప్లాట్‌ఫామ్స్
హైదరాబాద్: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా ప్రతిష్టాత్మక గార్ట్నర్ నివేదికలో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయంగా సీపాస్ మార్కెట్ తీరుతెన్నులపై రూపొందించిన ’కాంపిటీటివ్ ల్యాండ్‌స్కేప్ ఫర్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ 2021’ నివేదికలో తాన్లా గురించి, కంపెనీకి చెందిన వైజ్లీ సొల్యూషన్ ప్రత్యేకతల గురించి గార్ట్నర్ ప్రముఖంగా ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ఎనిమిది దిగ్గజ సీపాస్ కంపెనీలు, వాటి పరిమాణం, అవి ఆఫర్ చేసే సర్వీసులు, మార్కెట్ వైవిధ్యం, ట్రెండ్లు మొదలైన వాటి అధ్యయనం ఆధారంగా ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. తమ సొల్యూషన్స్ విశ్వసనీయత, భద్రతకు గార్ట్నర్ నివేదిక తాజా నిదర్శనం అని తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్ ఉదయ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. -
విప్రో ఆజీమ్ ప్రేమ్‌జీ ఇటీవల షేర్లు కొనుగోలు చేసిన కంపెనీ ఏంటో తెలుసా?
Wipro Azim Premji's investment in Tanla Platforms Ltd: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్‌లో తాజాగా ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టారు. ప్రేమ్‌జీకి చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సుమారు 20.6 లక్షల షేర్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం షేరు ఒక్కింటికి రూ. 1,200 వెచ్చించాయి. బన్యాన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ వీటిని విక్రయించింది. ప్రేమ్‌జీ పెట్టుబడులపై తాన్లా సీఈవో ఉదయ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తీర్చిదిద్దడంలోను, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల్లోను, దాతృత్వంలోను అజీం ప్రేమ్‌జీకి సాటిలేరని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఏటా సుమారు 800 బిలియన్ల పైగా సందేశాలను ప్రాసెస్ చేస్తోంది. దేశీయంగా ఏ2పి ఎస్ఎంఎస్ ట్రాఫిక్‌లో దాదాపు 70% భాగం తాన్లాకు చెందిన ట్రూబ్లాక్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 67% ఎగిసి రూ. 136 కోట్లుగా నమోదైంది. మంగళవారం బీఎస్ఈలో తాన్లా షేరు 5% ఎగిసి రూ. 1,327 వద్ద క్లోజయ్యింది. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
తాన్లా చేతికి కారిక్స్ మొబైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ తాన్లా సొల్యూషన్స్... ముంబైకి చెందిన కారిక్స్ మొబైల్‌ను (గతంలో ఎమ్గేజ్ ఇండియా) ౖకైవసం చేసుకుంది. ఈ డీల్ ద్వారా కారిక్స్ అనుబంధ కంపెనీ యూనిసెల్ కూడా తాన్లా సొంతమవుతుంది. దీన్ని బ్లాక్‌స్టోన్‌కు చెందిన జీఎస్ఓ క్యాపిటల్ పార్ట్నర్స్ నుంచి రూ.340 కోట్లకు తాన్లా కొనుగోలు చేసింది. తాజా డీల్‌తో దేశంలోని ఎంటర్ప్రైస్ క్లౌడ్ కమ్యూనికేషన్స్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా నిలుస్తామని తాన్లా సీఎండీ ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ఈ డీల్ నగదు– ఈక్విటీ రూపంలో ఉంటుంది. రూ.112 కోట్ల నగదును తమ అంతర్గత వనరుల నుంచి సమీకరించి జీఎస్ఓ క్యాపిటల్‌కు తాన్లా అందజేస్తుంది. ఇక కారిక్స్కు చెందిన రూ.103 కోట్ల రుణాన్ని కూడా తాన్లా టేకోవర్ చేస్తుంది. మిగిలిన రూ.125 కోట్లకు గాను ఒక్కొక్కటీ రూ.56.79 చొప్పున తన ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. కారిక్స్ మొబైల్ తమకు వ్యూహాత్మకంగా చక్కగా పనికొస్తుందని, అధిక బిల్లింగ్ చేసే కస్టమర్లు, డైవర్సిఫికేషన్ సాధ్యమవుతాయని, సమర్థులైన టెక్నోక్రాట్లు కూడా తమకు జతవుతారని ఉదయ్ రెడ్డి వివరించారు. 18 ఏళ్లుగా మొబైల్ ఎంగేజ్మెంట్, కమ్యూనికేషన్ సేవలందిస్తున్న కారిక్స్కు దేశంలోని నాలుగు నగరాల్లో కార్యాలయాలతో పాటు బీఎఫ్ఎస్ఐ, డీటీహెచ్, ప్రభుత్వ, ఆటో, రిటైల్, ఎఫ్ఎంసీజీ,ఈ–కామర్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,500 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2017–18లో రూ.540 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 250 మంది ఉద్యోగులున్నారు. -
తాన్లా సొల్యూషన్స్ ఆదాయం రూ. 114 కోట్లు
హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తాన్లా సొల్యూషన్స్ రూ. 114 కోట్ల ఆదాయంపై రూ. 39 లక్షల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంత క్రితం క్యూ4లో ఆదాయం రూ. 72 కోట్లు కాగా లాభం రూ. సుమారు రూ. 5 కోట్లు. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 242 కోట్ల నుంచి రూ. 432 కోట్లకు పెరిగింది. అటు లాభం సుమారు రూ. 3 కోట్ల నుంచి రూ. 12 కోట్లకు చేరింది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) స్థానంలో సాధారణ ఆదాయ పన్ను ప్రొవిజనింగ్ అమలు కావడంతో ట్యాక్స్ప్రొవిజన్ పెరిగినట్లు సంస్థ వివరించింది. -
తాన్లా లాభం రూ.5 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాన్లా సొల్యూషన్స్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 87 కోట్ల ఆదాయంపై రూ. 5 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 35 కోట్ల ఆదాయంపై రూ. 9 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. 2014-15 ఏడాది మొత్తం మీద కంపెనీ రూ. 242 కోట్ల ఆదాయంపై రూ. 3 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది.