తాన్లా సొల్యూషన్స్ ఆదాయం రూ. 114 కోట్లు
హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తాన్లా సొల్యూషన్స్ రూ. 114 కోట్ల ఆదాయంపై రూ. 39 లక్షల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంత క్రితం క్యూ4లో ఆదాయం రూ. 72 కోట్లు కాగా లాభం రూ. సుమారు రూ. 5 కోట్లు. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 242 కోట్ల నుంచి రూ. 432 కోట్లకు పెరిగింది.
అటు లాభం సుమారు రూ. 3 కోట్ల నుంచి రూ. 12 కోట్లకు చేరింది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) స్థానంలో సాధారణ ఆదాయ పన్ను ప్రొవిజనింగ్ అమలు కావడంతో ట్యాక్స్‌ప్రొవిజన్ పెరిగినట్లు సంస్థ వివరించింది.