TANTEX committee
-
టాంటెక్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడిగా ఉమామహేశ్ పార్నపల్లి ఎన్నికయ్యారు. 2022 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని జనవరి 9న డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఉమామహేష్ పార్నపల్లి సంస్థ అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు స్వీకరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) లాంటి గొప్ప సంస్థ కి అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇందుకు కార్య నిర్వాహక బృందము, పాలక మండలిల నుంచి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానట్లు చెప్పారు. 2021 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షురాలుగా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి మాట్లాడుతూ ఉమా మహేష్ పార్నపల్లి గారి నేతృత్వంలో ఏర్పడిన 2022 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. అధికారిక కార్యనిర్వాహక బృందం నూతనంగా ఎన్నికైన టాంట్సాక్స్ కార్యనిర్వాహక బృందం వివరాలు ఇలా ఉన్నాయి.. ఉమామహేష్ పార్నపల్లి (అధ్యక్షుడు) , ఉదయ్ కిరణ్ నిడిగంటి (సంయుక్త కార్యదర్శి), శరత్ రెడ్డి ఎర్రం (ఉత్తరాధ్యక్షుడు), సుబ్బారెడ్డి కొండు (కోశాధికారి), సతీష్ బండారు (ఉపాధ్యక్షులు) , భాను ప్రకాష్ వెనిగళ్ల (సంయుక్త కోశాధికారి), సురేష్ పఠనేని (కార్యదర్శి), లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి (తక్షణ పూర్వాధ్యక్షులు) ఇతర సభ్యులుగా సరిత ఈదర, స్రవంతి యర్రమనేని, కళ్యాణి తాడిమేటి, మాధవి లోకిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, రఘునాథ రెడ్డి కుమ్మెత, నాగరాజు చల్లా, శ్రీనివాసులు బసాబత్తిన, శ్రీనివాస పాతపాటి, కృష్ణా రెడ్డి మాడ, రాజా మాగంటి, విజయ్ సునీల్ సూరపరాజులు ఉన్నారు. టాంటెక్స్ పాలక మండలిలో అధిపతిగా వెంకట్ ములుకుట్ల, ఉపాధిపతిగా అనంత్ మల్లవరపులతో పాటు డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము, గీతా దమ్మన్న, శ్రీ లక్ష్మి మండిగ, శ్రీకాంత్ పోలవరపు, డాక్టర్ వెంకటసుబ్బరాయ చౌదరి ఆచంటలు సభ్యులగా ఉన్నారు. -
టాంటెక్స్ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నూతన అధ్యక్షురాలిగా పాలేటి లక్ష్మి అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 3న డల్లాస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. లక్ష్మి అన్నపూర్ణ మాట్లాడుతూ, టాంటెక్స్ లాంటి గొప్ప సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ ప్రమాణాలు పెంచేవిధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 2021 అధికారిక కార్యనిర్వాహక బృందం: అధ్యక్షురాలు: లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ఉత్తరాధ్యక్షుడు: ఉమా మహేష్ పార్నపల్లి ఉపాధ్యక్షుడు: ఎర్రం శరత్‌రెడ్డి కార్యదర్శి: తామేటి కల్యాణి సంయుక్త కార్యదర్శి: జొన్నల శ్రీకాంత్‌రెడ్డి కోశాధికారి: పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంయుక్త కోశాధికారి: ఎర్రమనేని స్రవంతి తక్షణ పుర్వాధ్యక్షులు: కోడూరు కృష్ణారెడ్డి కార్యవర్గ బృందం: లోకేష్ నాయుడు కోణిదల, మల్లిక్‌రెడ్డి కొండా, వెంకటేష్ బొమ్మ, చంద్రారెడ్డి పోలీస్, ప్రభాకర్‌రెడ్డి మెట్టా, రఘునాథరెడ్డి కుమ్మెత్త, సరితారెడ్డి ఈదర, నీరజ కుప్పాచి, ఉదయ్ కిరణ్ నిడగంటి, భానుప్రకాశ్ వెనిగళ్ల, నాగరాజు చల్లా, సురేష్ పాతినేని, సుబ్బారెడ్డి కొండు. పాలకమండలి బృందం: అధిపతి: డాక్టర్ పవన్ పామదుర్తి ఉపాధిపతి: వెంకట్ ములుకుట్ల శ్రీకాంత్ పోలవరపు, శ్రీలక్షి మండిగ, గీతా దమ్మన్న, అనంత మల్లవరపు, డాక్టర్ భాస్కర్‌రెడ్డి శనికొమ్ము. -
టాంటెక్స్: ఆన్లైన్లో సాహిత్య సదస్సు
ఆస్టిన్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) 152వ నెల తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రతీ నెల నెలా జరిగే ఈ సాహిత్య సదస్సును కరోనా వైరస్ కారణంగా మొదటి సారిగా సోమవారం ఆన్లైన్లోలైన్లో నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 152 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ ఈ సాహిత్య సదస్సులు నిర్వహించటం టాంటెక్స్ విశేషం. ఇక ఈ సదస్సును ఆన్లైన్లో నిర్వహించినప్పటికీ డాలస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులంతా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సును రఘుపతి రక్షకుడనీ ప్రార్థన గీతంతో ప్రారంభించారు. ఇక ఈ సదస్సులో సాహితీ వేత్త నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. సిరిసంపదల్లో భాగంగా కొంగుబంగారం, గోరోజనం, గోడచేర్పు, కుండోదరుడు(లంచం బాగా తినేవాళ్ళని),కూరగాయ కవిత, గొంతెమ్మ కోరిక, గోవచ్చం(ప్రత్యేక వ్యక్తిత్వం లేని వారు), గోవింద కొట్టడం, గౌతముడి గోవు లాంటి జాతీయాల నేపధ్యం గురించి వివరించారు. ఆ తర్వాత సథ్యం ఉపద్రష్ట చమత్కార కవిత్వం గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో భాషాభిమాని లెనిన్ మాట్లాడుతూ.. ఆన్లైన్లో ఇలా సాహిత్య సదస్సును నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతం అనగానే ఆధ్యాత్మిక సాహిత్యం, జ్యోతిష్యం మంత్రాలు, వేద సాహిత్యం అనుకుంటాం కాని సంస్కృతంలో ఎంత ఆధ్యాత్మిక సాహిత్యం ఉన్నదో లౌకిక సాహిత్యం, గణిత శాస్త్రాలు కూడా అంతే ఉన్నాయనిన్నారు. అంతేగాక సంస్కృతంలో విస్తారంగా బహు శాఖలు, విజ్ఞానం, శాస్త్రీయత ఇమిడి ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా లలితానంద్ కరోనా కవిత... కరుణించు కరోనా..కాపాడు కరోనా సరిహద్దులు చెరిపేసావు ..గుండెల్లో గుబులు కరోనా నీకు మందేలేదట ..ఎట్లా బతుకాలే. ఎం మాయ చేసావె..ప్రకృథి విక్తృతాయె నీకు అందరూ సమానమాయె ....కరుణించు కరోనా..కాపాడు కరోనా.. కరోనా పేరు మీద ధిక్కారం పేరుతో లలితానంద్ కవిత చదివారు. తెలుగు కథా పరిణామంపై రమణ రావు వివరణ ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ సాహితి వేత్త రమణ రావు తెలుగు కథా పరిణామంపై ప్రసంగించారు. ‘తెలుగు కథా పరిణామం’ అనే అంశం మీద ఆయన మాట్లాడుతూ.. కథలో ఉన్న కథా ప్రయోజనం, శిల్పం, వస్తువు అనే మూడు భాగాలుంటాయని చెప్పారు. అలాగే 1879 లో తెలుగు లో మొదటి కథ మొదలైందని కాని 1910 లో గురజాడ రాసిన 'దిద్దుబాటూ అనే కథ ద్వారానే ఆధునికత కథ మొదలైందని చెప్పారు. అందుకనే గురజాడను ఆధునిక కవి అన్నారన్నారు. ప్రయోజనంలో సామాన్యక మార్పు ఉంటేనే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారని తెలిపారు. గురజాడ గారు వస్తు ప్రయోజనంలోనే కాకుండా శిల్పంలో కూడా సామాజిక మార్పుని తీసుకువచ్చారన్నారు. అలాగే కథలో వాడుక భాష ప్రాధాన్యతని వివరించారు. కాలక్రమంలో కథలోని వస్థువు ఎలా మారందనే విషయాన్ని గూర్చి వివరణ ఇచ్చారు. 1930-50 మధ్య కాలంలో, 1950 -70 మధ్య కాలంలో, 1970-90 మధ్య కాలంలో, 1990-2010 మధ్య కాలంలో కథా వస్తువు ఎలా మారిందో వివరించారు. ఇక చివరగా రమణరావు సతీమణి సుభద్ర కొమ్మలో కోయిలా కుహూ అంటదీ అనే లలిత గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం అనంతరం టాంటెక్స్ అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. సాహిత్యం మీద ప్రేమ, అమ్మ భాష మీద మమకారంతో సదస్సులో పాల్గొని విజయవంతం చేసిన భాషాభిమానులకు, సాహితి ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు ముందు ప్రతి నెల నిర్వహించే తెలుగు వెన్నెల సాహిత్య సదస్సులకు అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ, చంద్ర కన్నెగంటి, రాయవరం భాస్కర్, సురేష్ కాజా, ప్రసాద్ తోటకూర,కిరణ్మయి గుంట, చిన సత్యం వీర్నపు, రవి పట్టిసం,శశికళా పట్టిసం,రాజా రెడ్డీ, పివి రమారావు, విష్ణు ప్రియ, జగదీశ్వరన్ పూదూరు తదితరులు రమణ రావుకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు. -
టాంటెక్స్ 2020 నూతన కార్యవర్గం
టెక్సాస్: తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)-2020 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 5న డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడుగా కృష్ణారెడ్డి కోడూరు పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాంటెక్స్ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలను చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త పాలక మండలి, కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో ఈ ఏడాదిలో అందరిని అలరించే కార్యక్రమాలు చేయనున్నామన్నారు. దీనికి స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు తెలిపారు. గతేడాది టాంటెక్స్ అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. కృష్ణా రెడ్డి కోడూరు నేతృత్వంలో ఏర్పడిన 2020 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ నూతన అధికారిక కార్యనిర్వాహక బృందం అధ్యక్షుడు: కృష్ణా రెడ్డి కోడూరు ఉత్తరాధ్యక్షురాలు: లక్ష్మి పాలేటి ఉపాధ్యక్షులు: ఉమా మహేష్ పార్నపల్లి కార్యదర్శి: సతీష్ బండారు కోశాధికారి: శరత్ ఎర్రం సంయుక్త కార్యదర్శి: మల్లిక్ కొండా సంయుక్త కోశాధికారి: కల్యాణి తాడిమేటి తక్షణ పూర్వాధ్యక్షులు: చిన సత్యం వీర్నపు మిగతా సభ్యులు: శ్రీకాంత్ రెడ్డి జొన్నల, చంద్ర పొట్టిపాటి, రఘునాధ రెడ్డి కుమ్మెత్త, స్రవంతి ఎర్రమనేని, సరిత కొండా, ప్రభాకర్ రెడ్డి మెట్టా, చంద్రారెడ్డి పోలీస్, వెంకట్ బొమ్మా, జనార్దన్ యెనికపాటి, లోకెష్ నాయుడు కొణిదల, నాగరాజ్ చల్లా, ఉదయ్ నిడగంటి, భాను ప్రకాష్ వెనిగల్ల. నూతన పాలక మండలి బృందం అధిపతి: పవన్ రాజ్ నెల్లుట్ల ఉపాధిపతి: డా. పవన్ పామదుర్తి మిగతా సభ్యులు: శ్రీకాంత్ పోలవరపు, వెంకట్ ములుకుట్ల, ఇందు రెడ్డి మందాడి, శ్రీలక్ష్మి మండిగ, ఎన్ఎంఎస్ రెడ్డి. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘అష్టావధానం’ కార్యక్రమం
టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో నవంబర్ 17న అష్టావధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. డాలస్‌లోని హిందూ దేవాలయం యూత్ సెంటర్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శతావధాని పార్వతీశ్వర శర్మ హజర్యయ్యారు. తెలుగు సాహిత్యం అంటే గుర్తుకు వచ్చే పేరు ఉత్తర టేక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్. ఈ అష్టావధాన కార్యక్రమంలో చిన్నారులు హాసిని, చార్విహాసి ప్రారంభ గితాలతో సభను ప్రారంభించారు. ఈ టాంటెక్స్ సంఘం ప్రతి నెల తెలుగు వెన్నెల కార్యక్రమాలను 147 నెలలుగా నిర్వహిస్తూ తెలుగు మహనీయులను అమెరికా తెలుగు వారికి సగర్వంగా పరిచయం చేశారు. శతావధాని, అవధాన భీమ, అవధాన సుధాకర, అవధాన భారతి, ఇలా ఎన్నో బిరుదులను తన పొందిన నవ యువకుడు రాంభట్ల పార్వతీశ్వర శర్మచే నిర్వహించిన ఈ అవధాని కార్యక్రమానికి అమెరికాలోని తెలుగు సాహితీ ప్రియులంతా పాల్గొన్నారు. ఈ అవధాన కార్యక్రమంలో 8 మంది పృచ్చకులు పాల్గొని ఒక్కక్క అంశంపై అవధానిక శర్మను పరీక్షించారు. ఈ క్రమంలో ఆయన వారు అడిగిన చందస్సులకు కొన్ని సార్లు చమత్కారంగా, మరికోన్ని సార్లు భక్తి పారవశ్యంతో, ఛలోక్తులతో సమాధానం ఇచ్చిన తీరు సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలాగే ఈ కార్యక్రమంలో అమెరికా అవధాని శ్రీ పూడూర్ జగదీశ్వరన్ సంధాతగా వ్యవహరించారు. అలాగే అవధాన అంశాలలో డా. ఊరిమిడి నరసింహరెడ్డి దత్తపదిగా, డా. తోరకూర ప్రసాద్ ఆశువుగ, నందివాడ ఉదయ్ న్యస్థాక్షరి, మద్దుకూరి చంద్రహాస్ నిషిద్ధాక్షరి, వేముల లెనిన్ సమస్య తదితరులు సంభాషణం అంశాలతో సభలో పాల్గోన్నారు. ఇక వారంతా ఇచ్చిన అంశాలను అవధాని పార్వతీశ్వర శర్మ చాకచక్యంగా పూరించారు. ఈ సభ అనంతరం టాంటేక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, సంఘ కార్యవర్గ బృందం రాంభట్ల పార్వతీశ్వర శర్మకు శాలువ, జ్క్షాపికతో పాటు ‘అవధాన కిశోర’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాంటేక్స్ సంఘ అధ్యక్షులకు, సభ్యులకు కృతజ్క్షతలు తెలిపారు. అలాగే సంఘ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కమిటీ సభ్యులకు, స్వచ్చంద కార్యకర్తలకు, ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. -
అమెరికాలో ఘనంగా ‘సంగీత గాన విభావరి’
వాషింగ్టన్ : దివ్యాంగుల సహాయార్థమై వేగేశ్న ఫౌండేషన్ వారు.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న ‘సంగీత గాన విభావరి’ కార్యక్రమాన్ని కూచిపూడి ఇండియన్ కిచెన్ రెస్టారెంట్ ఫంక్షన్ హాలులో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేగేశ్న ఫౌండేషన్ స్థాపకుడు డా. వంశీ రామరాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కీ.శే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. వేగేశ్న ఫౌండేషన్ మీ ఎన్నారైల ప్రాజెక్ట్ అని, దీనిని సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రారంభించామని తెలిపారు. దీనికి డా. అక్కినేని నాగేశ్వరరావు సహాయాన్ని అందించి వారి ఉదారతను చాటుకున్నారంటూ ఆయన సేవలను కొనియాడారు. అలాగే ఈ సంగీత గాన విభావరి కార్యక్రమాన్ని అమెరికాలోని వివిధ నగరాల్లో ఘంటసాల, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీతోత్సవాల పేరిట సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గాయకుడైన ఘంటసాల బాల కామేశ్వరరావు, గాన కోకిల ఆకునూరి శారదలతో పాలు పలువురు గాయనీ, గాయకులు ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల పాటలైన రాముని అవతారం.. రవికుల సోముని అవతారం, చిటపట చినుకులు పడుతూ వుంటే.. వంటి పాత పాటలను పాడి అందరిని అలరించారు. నాగి వడ్డమన్నాటి, శారదలు ‘మంచుకురిసే వేళలో, లేత చలిగాలిలో హాయ్...’ పాడిన పాటలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. కార్యక్రమం అనంతరం డా. వంశీ రామరాజును గాయనీ శారద ఆకునూరి, ఘంటసాల బాల కామేశ్వరరావుతో పాటు టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యపు వీర్నపు తదితరులు శాలువా కప్పి, జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. తర్వాత వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. రామరాజు చేస్తున్న సేవలను కొనియాడి, దివ్యాంగుల కోసం చేస్తున్న స్వచ్చంద సేవలో సంస్థను భాగస్వామిగా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు డా. ఉరిమిడి నరసింహారెడ్డి, సీఆర్ రావు, చంద్రహాస్ ముద్దుకూరి, అనంత్ మల్లవరపులతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
టాంటెక్స్ 2019 నూతన కార్యవర్గం
డల్లాస్ : తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్ ) 2019 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 6న డల్లాస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. టాంటెక్స్ అధ్యక్షుడుగా వీర్నపు చినసత్యం బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యాక్షులుగా కోడూరు కృష్ణా రెడ్డి, పాలేటి లక్ష్మీలలను నియమించగా, కార్యదర్శిగా పార్నపల్లి ఉమా మహేష్, సంయుక్త కార్యదర్శిగా తోపుదుర్తి ప్రభంద్ రెడ్డి, కోశాధికారిగా ఎర్రం శరత్, సంయుక్త కోశాధికారిగా బొమ్మ వెంకటేష్, తక్షణ పూర్వాధ్యక్షులుగా శీలం కృష్ణ వేణిలను ఎన్నుకున్నారు. అదే విధంగా పాలక మండలి బృంధాన్ని కూడా ఈ సమావేశంలో ప్రటించారు. పాలకమండలి అధిపతిగా ఎన్. ఎం. యస్.రెడ్డి, ఉపాధిపతిగా నెల్లుట్ల పవన్ రాజ్‌లను ఎన్నుకున్నారు. సభ్యులుగా కన్నెగంటి చంద్రశేఖర్, కొనార రామ్, మందాడి ఇందు రెడ్డి, ఎర్రబోలు దేవేందర్, డా. పామడుర్తి పవన్‌లను సంస్థ ఎన్నుకుంది. ఈ సందర్భంగా టాంటెక్స్ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. టాంటెక్స్ లాంటి గొప్ప సంస్థకి 33వ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కాజ చంద్రశేఖర్, మండిగ శ్రీలక్ష్మీ, మనోహర్ కసగాని, జొన్నల శ్రీకాంత్ రెడ్డి, కొండా మల్లిక్, మెట్టా ప్రభాకర్, తాడిమేటి కల్యాణి, లంక భాను, ఇల్లెందుల సమీర, బండారు సతీష్, చంద్రా రెడ్డి పోలీస్, యెనికపాటి జనార్దన్, కొనిదాల లోకేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా సాగిన టాంటెక్స్ సాహిత్య వేదిక!
టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ''నెలనెలా తెలుగు వెన్నెల'' సాహిత్య సదస్సు ఆదివారం 18న దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 110 నెలల పాటు సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డల్లస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారి అనుశ్రీ, 'లంబోదర లకుమికరా' ప్రార్థనాగీతంతో ప్రారంభించగా, సినీ నేపథ్యగాయని నీహారిక, 'యాకుందేందు' జననీ శివకామినీ, లలిత ప్రియకమలం' వంటి గీతాలను రమణీయంగా ఆలపించారు. 110వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోట నిర్మలా రాణి, ఆధునిక కవిత్వం, కొన్ని కవితారూపాలు, గజేల్ రచన నియమాలు అనే అంశంపై ప్రసంగించారు. పాతాళ గరికె, లోపలిమెట్లు వంటి కవితా సంకలనాలు రచించి 'కనుల దోసిలి' అనే గజేల్ సంకలనం త్వరలో విడుదల చేయనున్నారు. వచన కవిత్వం, మినీ కవిత్వం, నానో హైకో, నానీ అంటూ ఆధునిక కవిత్వంలో వచ్చిన మార్పులు, అన్ని రకాల ఉదాహరణలతో ప్రారంభమైన ప్రసంగం, మెల్లిగా గజేల్ రచనల నియమాలు, పార్శీ భాష నుంచి ఉర్దూలోకి గజేల్గా చేరి తెలుగులోకి వచ్చిన వైనం తెలియజేస్తూ సాగింది. సాహిత్యవేదికకు సుపరిచితులు, గేయరచయిత, గాయకులు మాట్ల తిరుపతి 'కవిత్వం-బంధాలు-మానవత్వమా ఏది నీ చిరునామా' అనే అంశంపై ప్రసంగించారు. సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, సరదాగా కాసేపు -6 ప్రశ్నావళి కార్యక్రమాన్ని హోరాహోరీ పోటీతో జనరంజకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరూ ప్రశ్నావినోదం కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కార్యక్రమాన్ని నిర్వహించిన అట్లూరి స్వర్ణ ను అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తోట నిర్మలా రాణిగారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు చాగర్లమూడి సుగన్ శాలువతో కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్, సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, తక్షణ పూర్వధ్యక్షులు ఊరిమిండి నరసింహారెడ్డి, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక బృంద సభ్యులు మా దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, ప్రసార మాధ్యమాలైన టి.ఎన్.ఐలకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేశారు.