టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో నవంబర్ 17న అష్టావధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. డాలస్‌లోని హిందూ దేవాలయం యూత్ సెంటర్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శతావధాని పార్వతీశ్వర శర్మ హజర్యయ్యారు. తెలుగు సాహిత్యం అంటే గుర్తుకు వచ్చే పేరు ఉత్తర టేక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్. ఈ అష్టావధాన కార్యక్రమంలో చిన్నారులు హాసిని, చార్విహాసి ప్రారంభ గితాలతో సభను ప్రారంభించారు. ఈ టాంటెక్స్ సంఘం ప్రతి నెల తెలుగు వెన్నెల కార్యక్రమాలను 147 నెలలుగా నిర్వహిస్తూ తెలుగు మహనీయులను అమెరికా తెలుగు వారికి సగర్వంగా పరిచయం చేశారు. శతావధాని, అవధాన భీమ, అవధాన సుధాకర, అవధాన భారతి, ఇలా ఎన్నో బిరుదులను తన పొందిన నవ యువకుడు రాంభట్ల పార్వతీశ్వర శర్మచే నిర్వహించిన ఈ అవధాని కార్యక్రమానికి అమెరికాలోని తెలుగు సాహితీ ప్రియులంతా పాల్గొన్నారు.
ఈ అవధాన కార్యక్రమంలో 8 మంది పృచ్చకులు పాల్గొని ఒక్కక్క అంశంపై అవధానిక శర్మను పరీక్షించారు. ఈ క్రమంలో ఆయన వారు అడిగిన చందస్సులకు కొన్ని సార్లు చమత్కారంగా, మరికోన్ని సార్లు భక్తి పారవశ్యంతో, ఛలోక్తులతో సమాధానం ఇచ్చిన తీరు సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలాగే ఈ కార్యక్రమంలో అమెరికా అవధాని శ్రీ పూడూర్ జగదీశ్వరన్ సంధాతగా వ్యవహరించారు. అలాగే అవధాన అంశాలలో డా. ఊరిమిడి నరసింహరెడ్డి దత్తపదిగా, డా. తోరకూర ప్రసాద్ ఆశువుగ, నందివాడ ఉదయ్ న్యస్థాక్షరి, మద్దుకూరి చంద్రహాస్ నిషిద్ధాక్షరి, వేముల లెనిన్ సమస్య తదితరులు సంభాషణం అంశాలతో సభలో పాల్గోన్నారు. ఇక వారంతా ఇచ్చిన అంశాలను అవధాని పార్వతీశ్వర శర్మ చాకచక్యంగా పూరించారు.
ఈ సభ అనంతరం టాంటేక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, సంఘ కార్యవర్గ బృందం రాంభట్ల పార్వతీశ్వర శర్మకు శాలువ, జ‍్క్షాపికతో పాటు ‘అవధాన కిశోర’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాంటేక్స్ సంఘ అధ్యక్షులకు, సభ్యులకు కృతజ‍్క్షతలు తెలిపారు. అలాగే సంఘ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కమిటీ సభ్యులకు, స్వచ్చంద కార్యకర్తలకు, ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment