tanur
-
కాటేసిన అప్పులు: తెలంగాణలో ఇద్దరు రైతులు బలవన్మరణం
అప్పుల భారం తాళలేక సాగు చేసే రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కష్టపడి పండించగా దిగుబడి రాక, మార్కెట్లో ధర పలకకపోవడంతో ఆ రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక తమను తాము బలి తీసుకున్నారు. పొలంలో పురుగుల నియంత్రణకు వాడాల్సిన మందు వారిద్దరూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబాన్ని పోషించలేక... అప్పులు తీర్చలేక తనువు చాలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరూ రైతులు ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. తానూరు (ముధోల్): మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడం, చేసిన అప్పులు తీరే దారి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన యువరైతు అశోక్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బెంబర గ్రామానికి చెందిన చుక్కబొట్ల అశోక్ తనకున్న రెండెకరాలతోపాటు మరో ఎకరం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. బ్యాంకు రుణాలతోపాటు ప్రైవేట్‌గా తీసుకున్న అప్పులు సుమారు రూ.3 లక్షల వరకు ఉన్నాయి. అప్పులు తీరడం లేదని మనస్తాపానికి గురైన అశోక్ మంగళవారం మధ్యాహ్నం పశువుల పాకలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధిక, కుమారులు అభిరాం, మణికంఠ ఉన్నారు. అశోక్ తండ్రి భుజంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు మరో ఘటన పెంబి (ఖానాపూర్): అప్పుల బాధతో పురుగుల మందు తాగిన మండలంలోని రాయదారి గ్రామానికి చెందిన రైతు రాథోడ్ బాబుసింగ్ (35) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. రాథోడ్ బాబుసింగ్ పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్ని పంట సైతం అడవి పందుల దాడిలో ధ్వంసమైంది. దీంతో అప్పు చేసి పెట్టిన పెట్టుబడులు కూడా రావేమోనని ఆందోళన చెందిన బాబుసింగ్ శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి -
రైతుపై చిరుత దాడి
థానూరు: అదిలాబాద్ జిల్లా థానూరు మండలం కె. ఉమ్రి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులో సంచరిస్తున్న చిరుత వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్న రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా శనివారం ఉదయం గ్రామానికి చెందిన జాదవ్ చంద్రకాంత్ అనే రైతు పై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో అతనికి స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఒకే మాట.. ఒకే బాట
తానూరు : మంచి మానవత్వం మనుషులకే సొంతం. వీటిని దూరం చేసేది మద్యం. మనుషులకి పశు ప్రవృత్తిని చొప్పించి వివేకం, విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అలాంటి మద్యానికి దూరంగా ఉండేందుకు జిల్లాలోని మారుమూల తానూరు మండలంలోని మహాలింగి గ్రామస్తులు ముందుకు వచ్చారు. ఒకే మాట మీద నిలిచారు. మద్యపానాన్ని నిషేధించాలని దసరా పండుగ రోజు నిర్ణయించి గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అప్పటి నుంచి గ్రామంలో ఎవరైనా మద్యపానం సేవిస్తే జరిమానా విధిస్తున్నారు. అంతా ఐక్యతతో.. మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని మహాలింగిలో గ్రామస్తులంతా ఐక్యతతో మద్యపానాన్ని నిషేధించేందుకు ముందుకు వచ్చారు. వీరికి తోడు డ్వాక్రా మహిళలు నడుం బిగించారు. గ్రామస్తుల సహకారంతో నెల రోజులుగా గ్రామంలో మద్యపానాన్ని నిషేధించారు. కొన్నేళ్లుగా గ్రామంలో మద్యానికి బానిసైన యువకులు ఇంటి బాగోగులకు చూసుకోకుండా జులాయిగా తిరుగుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏడాదిలో మద్యానికి బానిసైన 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. పిల్లలు, అనాథలవడమే కాకుండా చదువులకు దూరమవుతున్నారు. ఇదంతా గమనించిన గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు ఈ నిర్ణయానికి వచ్చారు. మద్యం తాగిన వారిని గ్రామంలోకి రానివ్వరు. పైగా జరిమానా విధిస్తారు. దీంతో నెల రోజులుగా గ్రామస్తులెవరూ మద్యం ముట్టుకోవడం లేదు. పోలీసుల సహకారంతో.. గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని ముందుగా గ్రామస్తులు తీర్మానించారు. గ్రామంలో మద్యాన్ని ఎవరూ అమ్మరాదని, అమ్మితే వారికి జరిమానా విధిస్తామని నిర్ణయించారు. గ్రామంలో మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని కోరుతూ భైంసా డీఎస్పీ రావుల గిరిధర్‌ను గ్రామ మహిళలు కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన ఆయన గ్రామంలో మద్యం విక్రయాలు జరగకుండా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
వైభవంగా సాముహిక వివాహాలు
తానూరు, న్యూస్‌లైన్ : మండలంలోని ఝ రి(బి) గ్రామంలో ఉన్న మహదేవ్ ఆలయ ప్రాంగణంలో శనివారం సామూహిక వివాహా లు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన ఏడు జంటలకు ఒకే వేదికపై వివాహం జరిపించారు. సామూహిక వివాహాలతో ఖర్చు తగ్గుతుందని గ్రామస్తులు నిర్ణయిం చారు. మూడేళ్లుగా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. వేడుకలకు బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపటేల్, మాజీ మండల అధ్యక్షుడు బాసెట్టి రాన్న, ముథోల్ ఎమ్మెల్యే సతీమణి రేవతి, నాయకులు చంద్రకాంత్యాదవ్, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.