Tap water connection
-
Guntur: పల్లెల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్
సాక్షి, గుంటూరు: ఏ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి వ్యక్తికీ రోజుకు సగటున 55 లీటర్ల నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో ఒక వ్యక్తికి రోజుకు సగటున 45 లీటర్ల నీటిని అందించాలని, ఆ మేరకు తాగునీటి పథకాలను జలజీవన్ మిషన్‌లో భాగంగా విస్తరించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో సగటున ఓ వ్యక్తికి రోజుకు 55 లీటర్లు అవసరమని గుర్తించి మళ్లీ ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ పనులకు అక్టోబర్ 2020లో పాలనా అనుమతులు లభించగా, 2021లో మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వీటిని జిల్లాల వారీగా విభజించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. 5,79,156 ఇళ్లకు కుళాయిలు 2020 ఏప్రిల్ 1 నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2,21,270 ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. జల జీవన్ మిషన్ పథకం ద్వారా 2024 నాటికి ఈ సంఖ్యను 5,79,156కి చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం రూ.400.74 కోట్లతో 1,264 పనులు చేపట్టారు. వీటిని పని విలువను బట్టి విభజించి టెండర్లు పిలిచారు. కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. మూడు దశల్లో పనులు ► జలజీవన్ మిషన్ పనులను మూడు దశలుగా విభజించారు. ► తొలిదశలో ఇప్పటికే సగటున ఓ వ్యక్తికి రోజుకు 40 లీటర్లు ఇస్తున్న గ్రామాల్లో అందుబాటులో ఉన్న పథకాలను విస్తరించడం, అంతర్గత పైపు లైన్లను నిర్మించడం చేయనున్నారు. ► రెండో దశలో ఇప్పటికే ఉన్న పథకాలకు అదనపు నీటి సదుపాయాలను సమకూర్చనున్నారు. ► మూడో దశలో తాజా ప్రతిపాదనల మేరకు కొత్త పథకాల నిర్మాణం చేపట్టనున్నారు. ► ఉపరితల జలాల లభ్యత లేని ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలను వినియోగించేలా పథకాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ► జలజీవన్ మిషన్ పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 25 శాతం మహిళలు, వార్డు మెంబర్లకు, 50 శాతం వెనకబడిన తరగతుల వారీకి సభ్యులుగా అవకాశం కల్పించారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి సమగ్ర వినియోగంపై దృష్టిసారించేలా చూడనున్నారు. -
ఇంటింటికీ మంచినీరు!
గ్రామీణ, మైదాన, మన్యం ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటి కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఇంటింటికీ తాగునీరు అందించే పథకానికి జిల్లా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రిజర్వాయర్ల నుంచి పైప్లైన్లు వేసి..వాటి ద్వారా నీటిని సరఫరా చేసేలా సమగ్ర ప్రణాళిక తయారు చేశారు. ఆరు వేల కోట్ల రూపాయలతో రూపొందిస్తున్న ఈ పథకానికి వాటర్ గ్రిడ్ అని పేరు పెట్టారు. మహారాణిపేట (విశాఖ దక్షిణ): జిల్లా ప్రజలకు మంచినీటి కష్టాలు త్వరలో తీరనున్నాయి. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఒకరికి నెలకు 100 లీటర్లు అందించేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఈ పథకాన్ని రూపొం దించారు. ఎక్కువ ప్రాంతాలకు సులువుగా నీరు అందించేలా.. సమీపంలో ఉండే రిజర్వాయర్ నుంచి సమీప ప్రాంతాలకు పెద్ద పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేసేలా సమగ్ర ప్రణాళికను సంబంధిత అధికారులు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత దీన్ని అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో గ్రామీణ, మైదాన, మన్యం ప్రాంతాల్లో 5,597 నివాస గ్రామాలున్నాయి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వినిగియోగిస్తున్న తాగునీరు సురక్షితంగా లేకపోవడంతో ప్రజలు అనా రోగ్యం బారినపడుతున్నారు. ఈ సమస్య నుంచి ప్రజలు బయటపడేలా వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా మంచినీటిని సరఫరా చేసేలా ప్రణాళిక తయారు చేసినట్టు జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి రవికుమార్ ‘సాక్షి’కి తెలిపారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న పెద్దేరు, కల్యాణపులోవ, తాండవ, కోనాం, ఎన్టీఆర్ రిజర్వాయరు, ఏలేరు రిజర్వాయర్ల నుంచి పైపులైన్లు ద్వారా నీటి అందించేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కేంద్రంగా రక్షిత ట్యాంకు నిర్మాణం చేపట్టి దానికి పైపులైన్‌ను అమర్చి ఇంటింటికీ కనెక్షన్లు ఇచ్చి నీటిని అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకానికి మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలు అవసరంగా అధికారులు అంచనా వేశారు. అయితే ఏలేరు కాలువ ద్వారా జిల్లా మొత్తానికి ఈ పథకం అమలు చేస్తే ఈ వ్యయం 4500 కోట్లు తగ్గుతుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ పథకం స్థానికంగా అవసరమయ్యే పనులు చేపడితే వ్యయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మన్యంలో ఇలా.. మన్యం పరిధిలోని 11 మండలాల్లో ఎలాంటి రిజర్వాయర్లు లేవు. దీంతో స్థానింగా ఉన్న నీటి వనరులకు అనుసంధానం చేస్తూ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే భారీగా బోర్వెల్ నిర్మించి.. వాటి ఆధారంగా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న రక్షిత ట్యాంకులకు నీటిని మళ్లించి..దానిఆధారంగా ఇంటింటికీ నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రవికుమార్ తెలిపారు. ఫ్లోరైడ్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి జిల్లాలో కలుషిత నీరు, ఫ్లోరైడ్ నీరు ఉన్న గ్రామాలపై కూడా అర్డబ్ల్యూఎస్ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని సుమారు 20 గ్రామాల్లో నీరు పనికి రాకుండా ఉంది. తాగునీటిలో ఒక లీటర్ నీటిలో 1.5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉండాలి. కాని ఈ గ్రామాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ గ్రామాలకు కూడా తాజాగా చేపట్టనున్న వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నీటిని అందించేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నారు. -
ఇంటింటి కుళాయి ఇంతేనా?
ఏటా జనాభా పెరుగుతున్నారు. నివాసాలు విస్తరిస్తున్నాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొత్త పథకాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రకటనలు... అనవసర సమావేశాల ఆర్భాటాలు... ఏమీ ఇవ్వకపోయినా.. ఏదో ఇచ్చామని నమ్మించే ప్రయత్నాలు... ఇవి తప్ప జనం బాధలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదు. వేసవి వచ్చిందంటే చాలు... జలజగడాలు పెరిగిపోతున్నాయి. నీటికోసం కిలోమీటర్ల దూరం ప్రయాణాలు తప్పనిసరిగా మారుతోంది. ఇదేదో కొండల్లోనో... గిరిజన ప్రాంతాల్లోనో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మైదాన ప్రాంతాల్లోనూ ఈ సమస్యలు తప్పడం లేదు. విజయనగరం, రామభద్రపురం(బొబ్బిలి): వేసవి కాలం ముంచుకొస్తోంది. అప్పుడే పల్లెల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. తాగునీటికోసం జనం అల్లాడిపోతున్నారు. అయినా ఇవేవీ పాలకులకు పట్టడం లేదు. అదనపు రక్షిత మంచినీటి పథకాలు మంజూరు చేసి ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని గొప్పగా చెప్పిన పాలకులు దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితం... పథకం లేని గ్రామాలు,ప్రజలు ఎక్కువగా ఉన్న చోట మొక్కుబడి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీరు చాలక నానా ఇబ్బందులు పడుతున్నారు. అదనపు పథకాల ఊసే మరిచారు పాలకుల ఆదేశాలతో అధికారులు జిల్లా వ్యాప్తం గా రూ.1200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయగా ఎస్‌కోట, గజపతినగరం, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాలకు మాత్రమే అదనపు రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రూ.300 కోట్లు మంజూరయినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మంజూరు చేయకపోగా... మంజూరైన నియోజకవర్గాలలో ప««థకాల నిర్మాణానికి ఇప్పటికీ టెండర్లు పిలవలేదంటే దీనిపై ఏపాటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోంది. అదనపు రక్షితమంచినీటి పథకాలు మంజూరైతే ఇంటింటి కుళాయి వస్తుందని, తాగునీటికి ఇబ్బం ది తీరిపోతుందని కలలు గన్న ప్రజల ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాలకు అధి కారులు సుమారుగా రూ.120 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి పం పారు. ఏళ్లు గడుస్తున్నా అవి కాగితాలకే పరి మితమయ్యాయి. నియోజకవర్గానికి ప్రాతిని« ద్యం వహిస్తున్నది సాక్షాత్తూ మంత్రి సుజ య్కృష్ణ రంగారావు అయినా ఇక్కడి ప్రజల కు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సమావేశాల్లో అధికారులు ఏ సమస్యలూ లేవని చెప్తే అదే నిజమనుకుంటున్నారు తప్ప... క్షేత్రస్థాయిలో మహిళలు పడుతున్న అవస్థలేమీ పట్టించుకోవడం లేదు. ఊటనీటితో అనారోగ్యం పలు గ్రామాలు నదికి ఆనుకుని ఉన్నాయి. అక్కడివారు చెలమల్లో నీటిని తోడుకుని తెచ్చుకుని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇదెంతవరకు సురక్షితమో అధికారులే చెప్పాలి. ఊట నీటితో రోగాలు విస్తరిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా వాటిని పెడచెవిన పెట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆ నీటినే తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి పల్లెల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామీణులు కోరుతున్నారు. నీటి సమస్య పట్టించుకోవట్లేదు మా గ్రామంలో మంచి నీటి పథకం పనులు ప్రారంభించి రెండేళ్లు అయింది. ఏదో పూర్తి చేశారంటే నీటిని మాత్రం సరఫరా చేయలేదు. తాగునీటికి నానా అవస్థలు పడుతున్నాం. మా గ్రామ సమీపంలో ఉన్న నర్సరీ యజమానులను బతిమలాడి మంచి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. పాలకులు కనీసం పట్టించుకోవడంలేదు.– ఐ.కళావతి, పాడివానివలస, రామభద్రపురం మండలం -
రూపాయికే నల్లా కనెక్షన్
కరీంనగర్ బల్దియాలో కేసీఆర్ జన్మదిన కానుకగా ప్రకటించిన మేయర్ కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు నిర్ణరుుంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి ఈ పథకం అమలు చేస్తున్నట్లు మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.పేదల ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలుంటే బై నంబర్లు వేసి నల్లా ఇస్తామన్నారు.