tapeswaram laddu
-
ఖైరతాబాద్ గణనాథునికి 100 కేజీల లడ్డూ
సాక్షి, మండపేట: వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణనాథునికి తాపేశ్వరం మడత కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్ 100 కిలోల లడ్డూను కానుకగా అందజేసింది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు స్వామి వారికి లడ్డూను కానుకగా పంపించారు. ఖైరతాబాద్ గణపయ్యకు 2010 నుంచి లడ్డూను కానుకగా మల్లిబాబు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల ప్రారంభానికి పది రోజుల ముందే మల్లిబాబు, సిబ్బంది గణపతి మాలలు ధరించి అత్యంత నియమనిష్టలతో లడ్డూ తయారు చేసేవారు. 2010లో 500 కిలోల లడ్డూ తయారుచేసి పంపగా, విగ్రహ పరిమాణాన్ని బట్టి ఏటా లడ్డూ పరిమాణం పెంచుతూ వచ్చారు. 2011లో 2,400 కిలోల లడ్డూ సమర్పించగా, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు, 2015లో 6 వేల కిలోల లడ్డూను స్వామి వారికి కానుకగా అందజేశారు. లడ్డూలను గణనాథుని చేతిలో ఉంచి, ఉత్సవాలు ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. (ప్రేక్షకులను ఉర్రూతలుగించిన వినాయకుడి పాటలు) 2016లో కమిటీ సూచన మేరకు 500 కిలోల లడ్డూను కానుకగా పంపారు. అయితే ఎంతో నియమనిష్టలతో, తీవ్ర వ్యయప్రయాసాలకోర్చి అందజేసిన లడ్డూ నైవేద్యానికి కమిటీ సరైన రక్షణ కల్పించకపోవడం మల్లిబాబును తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా 2017 ఉత్సవాల నుంచి భారీ లడ్డూ కానుకను నిలిపివేసినా 25 కిలోల లడ్డూ కానుకగా అందజేస్తూ వచ్చారు. కాగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు ఈ ఏడాది ఉత్సవాలకు 100 కిలోల లడ్డూ తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఖైరతాబాద్‌లో తొమ్మిది అడుగుల వినాయకుని విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నట్టు మల్లిబాబు తెలిపారు. లడ్డూను శుక్రవారం ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్‌కు తరలించామన్నారు. -
మోహన్‌బాబును కలిసిన సురుచి ఫుడ్స్ ప్రతినిధి
హైదరాబాద్: త్వరలో జరిగే వినాయక చవితి కి ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఏర్పాటు చేసే గణనాధుడికి 600 కిలోల మహాలడ్డూ సమర్పించనున్నట్లు తాపేశ్వరం కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్ అధినేత పొలిశెట్టి మల్లిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దైవసన్నిధానం చైర్మన్ మోహన్‌బాబుతో తమ ప్రతినిధి సమావేశమై ఈ మేరకు హామీ ఇచ్చారని వెల్లడించారు. గతేడాది కూడా దైవసన్నిధానం వినాయక చవితి ఉత్సవాలకు 500 కిలోల లడ్డూను అందజేసినట్లు తెలిపారు. తమ ప్రతినిధి వర్మ మోహన్‌బాబుతో కలిసినప్పుడు ఇందుకు సంబంధించిన లడ్డూ డిజైన్‌ను, ఎప్పుడు లడ్డూను సమర్పించే తదితర వివరాలు వెల్లడించారన్నారు. 2010 నుంచి ఖైరతాబాద్ గణేషుడికి మహాలడ్డూను సమర్పిస్తూ వచ్చిన తాము భద్రతా కారణాల వల్ల నిలిపివేశామన్నారు. -
ఖైరతాబాద్‌కు తరలిన తాపేశ్వరం లడ్డూ
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాథుని కోసం తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామానికి చెందిన సురుచి ఫుడ్స్ తయారు చేసిన లడ్డూను ప్రత్యేక వాహనంలో ఆదివారం తరలించారు. ఆరేళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా స్వామివారికి సురుచి సంస్థ లడ్డూను కానుకగా సమర్పించింది. ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు ఈ ఏడాది 500 కిలోల లడ్డూను సిద్ధం చేశారు. సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతోపాటు 19 మంది సిబ్బంది గణపతి మాలధారణ చేసి ఈ లడ్డూ తయారు చేశారు. కాజూ పేస్టును ఉపయోగించి లడ్డూ పైభాగాన్ని దేవతామూర్తుల రూపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మల్లిబాబు, భారతి దంపతులు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం క్రేన్‌తో లడ్డూను అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ గ్రామంలో అత్యంత కోలాహలంగా ఈ లడ్డూను ఊరేగించారు. లడ్డూ తరలింపును తిలకించేందుకు స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేడు గాజువాకకు మహాలడ్డూ తరలింపు విశాఖ జిల్లా గాజువాకలో ప్రతిష్ఠించనున్న మహాగణపతికి సురుచి ఫుడ్స్ కానుకగా అందజేస్తున్న మహాలడ్డూను సోమవారం ఉదయం తరలించనున్నారు. 12.50 టన్నుల బరువుతో రూపొందించనున్న ఈ మహాలడ్డూ తయారీలో ఆదివారం ఉదయం నుంచి సిబ్బంది నిమగ్నమయ్యారు. తుది మెరుగుల అనంతరం ప్రత్యేక వాహనంలో గాజువాక తరలించనున్నట్టు మల్లిబాబు తెలిపారు. -
ఖైరతాబాద్ వినాయకుడిపై పూల వర్షం కురిపిస్తాం
-
ఖైరతాబాద్ గణపతికి తాపేశ్వరం లడ్డూ
-
ఖైరతాబాద్ గణపతికి తాపేశ్వరం లడ్డూ
ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం. ఇంకెక్కడో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్. అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన భారీ లడ్డును శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతికి అలంకరించారు. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు నేతృత్వంలో రూపొందిన ఈ ఐదు టన్నుల లడ్డూను ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకొచ్చి.. ఇక్కడ గణపతి చేతుల్లో అలంకరించారు. వాస్తవానికి 2010 సంవత్సరం నుంచే ఖైరతాబాద్ గణేశుడి చేతిలో నిజమైన లడ్డూ అలంకరించడం మొదలైంది. అంతకుముందు వరకు మట్టిలడ్డూ పెట్టేవారు. కానీ, 2009లో మల్లిబాబు తన కూతురితో కలిసి ఖైరతాబాద్ గణపతిని సందర్శించుకున్నప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది. దాంతో ఆ తర్వాతి నుంచి అసలైన లడ్డూను తాను చేసి పంపుతానని మల్లిబాబు ఉత్సవ కమిటీ పెద్దలను ఒప్పించాడు. 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించారు. -
తాపేశ్వరం లడ్డు ‘హ్యాట్రిక్’ గిన్నిస్ రికార్డు
మూడోసారీ తాపేశ్వరం లడ్డూ గిన్నిస్ రికార్డులకెక్కింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ ఈ అరుదైన ఘనత సాధించింది. వినాయక చవితి సందర్భంగా గణేష్ మహాలడ్డూల తయారీలో మూడేళ్ల నుంచి వరుసగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటూ వచ్చింది. 2013లో తయారుచేసిన మహాలడ్డూకు గిన్నిస్ రికార్డ్స్ నుంచి శనివారం సర్టిఫికెట్ అందినట్టు సంస్థ అధినేత సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) తెలిపారు. తొలిసారిగా 2011లో విశాఖపట్నానికి చెందిన సువర్ణభూమి సంస్థ ఆర్డర్‌తో 5,570 కిలోల లడ్డు, 2012లో రాజమండ్రిలోని రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆర్డర్ మేరకు 6,599.29 కిలోల లడ్డు, 2013 ఆగస్టులో వినాయక చవితి సందర్భంగా అదే కమిటీ వారికి తయారు చేసిన 7,132.87 కిలోల మహాలడ్డూ వరుసగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కాయని వివరించారు. తమ సంస్థ మినహా ప్రపంచంలో ఏ స్వీట్ స్టాల్ మూడుసార్లు గిన్నిస్ రికార్డు సాధించలేదని చెప్పారు. - న్యూస్‌లైన్, మండపేట