గాంధీ మనవరాలికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: శాంతి, సామరస్యం, సంస్కృతి, విద్య అభివృద్ధి చేసిన కృషికి గాను గాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాఛార్జీ(82)కి ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ను అందచేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి తరఫున పురస్కారాన్ని ఆ దేశ రాయబారి ఫ్రాంకోయిస్ రిచియర్ బహుకరించారు. గాంధీజీ భయరహిత జీవనాన్ని అలవర్చుకోవాలని తారా అన్నారు.