Tarakarama Rao
-
సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
హైదరాబాద్‌లోని కాచిగూడ తారకరామ థియేటర్ పున:ప్రారంభానికి సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులు జరుపుకొంటున్న ఈ థియేటర్ కొత్త హంగులతో ముస్తాబైంది. ఏషియన్ తారకరామ పేరుతో డిసెంబర్ 14న ఈ థియేటర్ గ్రాండ్‌గా రీఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై థియేటర్ పున:ప్రారంభించనున్నారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటులు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్‌కు మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ్ దాస్ తనయుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్‌ను రెనొవేట్ చేయించారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునః ప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ. భరత్ నారంగ్, సురేశ్ బాబు సదానంద గౌడ్లు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్ పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్టేనా? యామీ గౌతమ్ ఏమన్నదంటే.. -
భిన్నత్వంలో ఏకత్వమే మా లక్ష్యం
సాక్షి, సిరిసిల్ల: భిన్నత్వంలో ఏకత్వం తమ లక్ష్యమని, అరవైఏళ్ల స్వీయ అస్తిత్వ పోరాటం తర్వాత అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనకు పరివర్తన చెందిన రోజన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి రంగాల్లో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టామని వివరించారు.అంబేడ్కర్ పేరును రాష్ట్ర సెక్రటేరియట్‌కు పెట్టి మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కొందరు మత పిచ్చితో మంటలు రేపాలని చూస్తున్నారని, మన మధ్య ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా -
మోడీ వచ్చినా డిపాజిట్ దక్కదు: కేటీఆర్
మిరుదొడ్డి: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రచారం చేయించినా బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కదని మంత్రి కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా మిరుదొడ్డిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యవాది అయిన జగ్గారెడ్డి అంటేనే మెదక్ జిల్లా ప్రజలు భగ్గు మంటున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా లక్ష్మారెడ్డికి తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే నైతిక హక్కు లేదన్నారు. -
టిప్పు ప్రేమకథకు శ్రీకారం
ప్రముఖ పంపిణీదారుడు డి.బి. సీతారామరాజు (‘వైజాగ్’ రాజు) తనయుడు కార్తీక్ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘టిప్పు’. సంస్కృతి, కనికా కపూర్ కథానాయికలు. జగదీశ్ దానేటి దర్శకుడు. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ముహూర్తపు దృశ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్-గ్రామీణ నీటిపారుదల శాఖామాత్యులు అయ్యన్న పాత్రుడు కెమెరా స్విచాన్ చేశారు. తెలంగాణ ఐటీ - పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారకరామారావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చక్కని ప్రేమకథాచిత్రమిది. హైదరాబాద్, బెంగళూరు, మైసూరుల్లో చిత్రీకరణ జరుపుతాం. పాటలు విదేశాల్లో తీస్తాం’’ అని తెలిపారు. నటునిగా తన తొలి అడుగు ఓ మంచి కథతో పడటం ఆనందంగా ఉందని కార్తీక్ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మంత్రులూ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇరు ప్రాంతాల్లో సినిమా అభివృద్ధి కావాలి: కేటీఆర్ చెన్నై నుంచి తెలుగు సినిమాను హైదరాబాద్ తరలించడానికి ఎందరో మహానుభావులు శ్రమిం చారు. ప్రస్తుతం భాగ్యనగరంలో తెలుగు సినిమా కళకళలాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు నెలలు దాటింది. ఈ కారణంగా చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. అవన్నీ పయనించే మేఘాల్లాంటివి. త్వరలో అన్నీ చక్కబడతాయి. భారతీయ సినిమా కేంద్రంగా హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడమే మా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, వైజాగ్‌లో కూడా తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. వైజాగ్, అరకు ప్రాంతాలు సినిమాకు అనుకూలాలు. కళాకారుడికి ప్రాంతీయ భేదాలుండవ్ - అయ్యన్న పాత్రుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది కాబట్టి, పరిశ్రమలో కూడా మార్పులొస్తాయని పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. వారికి చెప్పేదొక్కటే. కళాకారుడు ఏ ప్రాంతం వాడైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. వారికి ప్రాంతీయభేదాలుండవ్. సినిమాను నమ్ముకొని ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వారందరికీ మరింత ఉపాధి లభించాలి. అలాగే... వైజాగ్‌లో కూడా తెలుగు సినిమాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.