![మోడీ వచ్చినా డిపాజిట్ దక్కదు: కేటీఆర్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51409945812_625x300.jpg.webp?itok=CnC48brL)
మోడీ వచ్చినా డిపాజిట్ దక్కదు: కేటీఆర్
మిరుదొడ్డి: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రచారం చేయించినా బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కదని మంత్రి కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా మిరుదొడ్డిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యవాది అయిన జగ్గారెడ్డి అంటేనే మెదక్ జిల్లా ప్రజలు భగ్గు మంటున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా లక్ష్మారెడ్డికి తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే నైతిక హక్కు లేదన్నారు.