taranga
-
తారంగ హిట్టవ్వాలి – ఎంపీ దయాకర్
‘‘తారంగ’ ట్రైలర్ చూస్తుంటే బలమైన కథతో దర్శకుడు చక్కగా తీశాడనిపిస్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘సారంగ’ హిట్టయి, పెద్ద సినిమా అవ్వాలి’’ అన్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. కట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి, పూజ నాగేశ్వర్ కీలక పాత్రల్లో సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తారంగ’. శ్రీనివాస రెడ్డి కర్రి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను పసునూరి దయాకర్, గ్లింప్స్‌ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొటీ చేసిన నవీన్ యాదవ్ విడుదల చేశారు. నిర్మాత టి. రామ సత్యనారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు సంపత్ కుమార్, శ్రీనివాస రెడ్డి కర్రి. -
తారంగ సినిమా వచ్చేది అప్పుడే!
కట్ల ఇమ్మార్చెల్, కట్ల డాండి హీరోలుగా, పూజా నాగేశ్వరి హీరోయిన్గా నటించిన చిత్రం ‘తారంగ’. ఎస్. సంపత్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి కర్రి నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సుమన్ మాట్లాడుతూ– ‘‘తారంగ’ సినిమా బాగా వచ్చింది. యూనిట్ కృషి వల్ల తక్కువ టైమ్‌లోనే పూర్తయింది’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా రూపొందించిన చిత్రమిది. జూలైలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డికర్రి. ‘‘మా సినిమా అన్నివర్గాలవారికి నచ్చేలా ఉంటుంది’’ అన్నారు ఎస్. సంపత్ కుమార్. -
చెలరేగిన ఆఫ్గాన్.. 4 ఫోర్లు,7 సిక్స్‌లు, కేవలం 28 బంతుల్లోనే
లెజెండ్స్ లీగ్ క్రికెటలో ఇండియా మహారాజాస్ మరో ఓటమి చవి చూసింది. అల్ అమెరట్ వేదికగా ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాజాస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది. మహారాజాస్ బ్యాటర్లలో వసీం జాఫర్(35),మన్‌ప్రీత్ గొనీ(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసియా లయన్స్ఆదిలోనే ఓపెనర్లు వికెట్ కోల్పోయింది. తరంగా, మహ్మద్ యూసఫ్ కలిసి ఇన్నింగ్ చక్కదిద్దారు. వీరిద్దరూ ఔటయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన అస్గర్ అఫ్గాన్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే 69 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు.. 7 సిక్స్‌లు ఉన్నాయి. తరంగా(72), అఫ్గాన్ (69) ఇన్నింగ్స్‌లతో ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కో్ల్పోయి 193 పరుగులు చేసింది. ఇక బౌలింగ్లోను రెండు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ కీలక పాత్ర పోషించాడు. -
క్రికెటర్‌కు షాక్.. రెండు మ్యాచ్‌ల నిషేధం!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ ఉపుల్ తరంగకు షాక్ తగిలింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. నిర్ణీత సమయానికి లంక నాలుగు ఓవర్లు తక్కువగా వేయడంతో 2.5.2 నిబంధన ప్రకారం ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్ (8న), పాకిస్తాన్ (12న) జట్లతో జరిగే మ్యాచ్‌లకు తరంగ దూరం కానున్నాడు. అంతేకాకుండా జట్టు ఆటగాళ్లు 60 శాతం జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ కెప్టెన్ మాథ్యూస్ గాయం కారణంగా తరంగ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు.