క్రికెటర్‌కు షాక్.. రెండు మ్యాచ్‌ల నిషేధం!
క్రికెటర్‌కు షాక్.. రెండు మ్యాచ్‌ల నిషేధం!
Published Sun, Jun 4 2017 8:37 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ ఉపుల్ తరంగకు షాక్ తగిలింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. నిర్ణీత సమయానికి లంక నాలుగు ఓవర్లు తక్కువగా వేయడంతో 2.5.2 నిబంధన ప్రకారం ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో భారత్ (8న), పాకిస్తాన్ (12న) జట్లతో జరిగే మ్యాచ్‌లకు తరంగ దూరం కానున్నాడు. అంతేకాకుండా జట్టు ఆటగాళ్లు 60 శాతం జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ కెప్టెన్ మాథ్యూస్ గాయం కారణంగా తరంగ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Advertisement