సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన | srilanka won the toss and electeded field first | Sakshi
Sakshi News home page

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన

Published Thu, Jun 8 2017 2:57 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన - Sakshi

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన

లండన్:చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో విజయంపై దృష్టి పెట్టింది. గ్రూప్-బిలో గురువారం శ్రీలంకతో జరిగే పోరుకు భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా సెమీస్  కు అర్హత సాధిస్తుంది. శ్రీలంక కంటే  అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్ జట్టు గెలుపుపై ధీమాగా ఉంది. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ అమితోత్సాహంతో ఉంది.  ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు దిగుతోంది.

మరొకవైపు లంకేయులు కూడా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఎటువంటి పోరాటం కనబరచకుండానే లొంగిపోవడంతో ఆ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. దాంతో భారత్ పై గెలిచి సెమీస్ రేసులో నిలవాలని లంకే్యులు యోచిస్తున్నారు. ఈ రోజు మ్యాచ్ లో లంక జట్టులో కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ తిరిగి చేరాడు. అతనితో పాటు తిషారా పెరీరా కూడా తుది జట్టులో ఉండటంతో లంక కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. ఈ రోజు మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ భారత్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.


భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, బూమ్రా

శ్రీలంక తుది జట్టు: ఏంజెలో మాథ్యూస్(కెప్టెన్), డిక్ వెల్లా, గుణతిలకా, మెండిస్, చండిమాల్, కుశాల్ పెరీరా, గుణరత్నే, తిషారా పెరీరా, లక్మల్, లసిత్ మలింగా, నువాన్ ప్రదీప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement