తరుణ్‌జోషీ బదిలీ
నిజామాబాద్ క్రైం : ఎస్పీ తరుణ్‌జోషీ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే ఎస్పీగా ఉన్న ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి ని జిల్లా ఎస్పీగా నియమించింది. తరుణ్ జోషీ బదిలీతో జిల్లాలోని కొందరు ప్ర జాప్రతినిధులు తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లయ్యింది. 2013 అక్టోబరు 31న జిల్లాకు వచ్చిన తరుణ్‌జోషీ యేడాది తిరగక ముందే బదిలీ అయ్యారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన తీరు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు కంటగింపుగా మారింది.
గత ఎన్నికల సందర్బంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడిపై చేయి చేసుకోవటం మొదలుకుని మొన్నటి ఎస్ఐల బది లీ వ్యవహరం వరకు ఎమ్మెల్యేలకు నచ్చలేదు. దాంతో ఆయనను బదిలీ చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. తరుణ్జోషీని హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు వచ్చాయి.
చంద్రశేఖర్‌రెడ్డి సీనియర్ అధికారి
కొత్త ఎస్పీగా నియమితులైన ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపు 1 అధికారిగా పోలీస్‌శాఖలో అడుగుపెట్టారు. 1993-94 బ్యాచ్‌కు చెందిన ఈయన తొలి పోస్టింగ్ వరంగల్ జిల్లా జనగాం డీఎస్పీగా. అక్కడి నుంచి మెదక్ జిల్లా రామచంద్రపురం డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా ప్రకాశం జిల్లాలో, తిరుపతిలో పనిచేశారు. నాన్ కేడర్‌లో హైదరాబాద్ ట్రాఫీక్ డీసీపీగా బదిలీ అయ్యారు. 2011లో ఐపీఎస్ కన్ఫర్మేషన్‌తో ఎస్పీగా క ర్నూల్ జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వచ్చారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు.