Taskin Pacer Ahmed
-
‘టస్కిన్‌పై నిషేధం సరైందే’
బెంగళూరు: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మద్‌పై ఐసీసీ విధించిన సస్పెన్షన్ సరైందేనని జ్యూడిషీయల్ కమిషనర్ సమర్థించారు. సస్పెన్షన్‌పై టస్కిన్ చేసుకున్న అభ్యర్థన మేరకు కమిషనర్ మైకేల్ బెలాఫ్ క్యూసీ మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఈ విచారణలో బౌలర్ తనకున్న న్యాయపరమైన వాదనలను వినిపిం చారు. అలాగే ఐసీసీ కూడా ప్రతివాదనలను వినిపించింది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిషనర్.. నిషేధం సరైందేనని సమర్థించారు. -
టస్కిన్, సన్నీలపై వేటు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా పేసర్ టస్కిన్ అహ్మద్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అరాఫత్ సన్నీలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ విధించింది. స్వతంత్ర విచారణ పరీక్షలో వీరిద్దరి బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలిందని ఐసీసీ ప్రకటించింది.