సెల్‌టవర్ వద్ద షార్టు సర్క్యూట్
రంగారెడ్డి జిల్లా: సెల్ టవర్ వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న టాటా ఇండికమ్ సెల్‌టవర్ ఉన్న ప్రాంతంలో షార్టు సర్య్కూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హయత్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, సెల్‌టవర్‌కు సంబంధించిన అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనేది అంచనా ఇంకా ఓ అంచనాకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(పెద్దఅంబర్‌పేట)