Tata Motors Nexon
-
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులుకు షాకిచ్చిన టాటా మోటార్స్..!
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గట్టి షాక్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈవీ సెగ్మెంట్లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాటా నెక్సాన్ ఈవీ ధరను భారీగా పెంచనుంది. కాగా ఇప్పటికైతే ధరల పెంపుపై కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. రూ. 25 వేలకు పైగా.. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ వాహనం ఐదు వేరియంట్లలో కొనుగోలుదారులకు లభిస్తోంది. ఈ వేరియంట్లపై గరిష్టంగా రూ. 25 వేల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టాటా నెక్సాన్ ఈవీ ధర రూ.14.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) చేరుకోనుంది. ఈ వాహనం ఎక్స్ఎం, ఎక్స్జెడ్, ఎక్స్జెడ్ ప్లస్, ఎక్స్జెడ్ ప్లస్ లగ్జరీ, డార్క్ ఎక్స్జెడ్ ప్లస్, డార్క్ ఎక్స్ జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్లలో టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలుదారులకు లభిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్ ఇప్పుడు రూ.17.15 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయంగా రూపాయి విలువ క్షీణించడం, ఇన్పుట్ ఖర్చులు పెరుగుదల కారణంగా ధరలను పెంచినట్లు తెలుస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 312కిమీ మేర ప్రయాణిస్తుంది. ఇది శక్తివంతమైన, అధిక-సామర్థ్యం గల 129 పీఎస్ ఏసీ మోటారుతో వస్తుంది. 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ. ఈ కారు బ్యాటరీ ఐపీ67 ప్రమాణాలతో డస్ట్, వాటర్‌ఫ్రూఫ్ ప్యాక్‌తో రానుంది. చదవండి: కారు నడిపితే నీరు బయటకు వస్తోంది..భారత్‌లో తొలి కారుగా రికార్డు..! -
ఎట్టకేలకు టాటా నెక్సాన్ వచ్చేసింది...
సాక్షి, ముంబై : దేశంలో అతపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఎట్టకేలకు ఎంతో కాలంగా వేచిచూస్తున్న కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటి వాహనం నెక్సాన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. రూ.5.85 లక్షల నుంచి రూ.9.45 లక్షల ధరల శ్రేణిలో ఈ వాహానాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. టాటా నేడు తీసుకొచ్చిన నెక్సాస్, మారుతీ సుజుకీ విటారా బ్రీజా, ఫోర్డ్ మోటార్స్ ఎకోస్పోర్ట్‌కు గట్టిపోటీ ఇవ్వగలదు. వ్యక్తిగత కారు కొనుగోలుదారులను టార్గెట్‌గా చేసుకుని నెక్సాస్ మార్కెట్లోకి వచ్చింది. టాటా మెటార్స్ సరికొత్త నెక్సాన్ ఎస్‌యూవీని ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించింది. అదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చిన టియాగో, హెక్సా, టిగోర్ తర్వాత నాలుగవ ప్రొడక్ట్‌గా టాటా లైనప్‌లోకి ఇది ప్రవేశించింది. టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్ఇ, ఎక్స్ఎమ్, ఎక్స్‌టి, ఎక్స్‌జడ్ ప్లస్ వేరియంట్లలో, ఐదు రంగుల్లో లభించనుంది. నేటి నుంచి 650 టాటా మోటార్స్ అధికారిక విక్రయ అవుట్లెట్లలో ఇది విక్రయానికి వస్తోందని కంపెనీ తెలిపింది. 1.2 లీటరు టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటరు డీజిల్ ఇంజిన్‌తో ఇది రూపొందింది. వినియోగదారుల అవసరాలను ఎప్పుడికప్పుడు పరిష్కరించడమే నెక్సాస్ లక్ష్యంగా పెట్టుకుందని టాటా మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ గుంటెర్ బుచ్చెక్ తెలిపారు. నెక్సాన్ బ్లాక్‌బస్టర్ ప్రొడక్ట్ అవుతుందనే విశ్వాసం తమకుందని ప్యాసెంజర్ వెహికిల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ చెప్పారు.