ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులుకు షాకిచ్చిన టాటా మోటార్స్‌..! | Tata Nexon Ev Gets Costlier Across Variants Check the New Price Here | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులుకు షాకింగ్‌ న్యూస్‌..! ఆ కారు ఇప్పుడు మరింత ప్రియం

Published Wed, Mar 16 2022 7:23 PM | Last Updated on Wed, Mar 16 2022 7:29 PM

Tata Nexon Ev Gets Costlier Across Variants Check the New Price Here - Sakshi

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌  ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు గట్టి షాక్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈవీ సెగ్మెంట్‌లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాటా నెక్సాన్‌ ఈవీ ధరను భారీగా పెంచనుంది. కాగా ఇప్పటికైతే ధరల పెంపుపై కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. 

రూ. 25 వేలకు పైగా..
టాటా మోటార్స్‌ నెక్సాన్‌ ఈవీ వాహనం ఐదు వేరియంట్లలో కొనుగోలుదారులకు లభిస్తోంది. ఈ వేరియంట్లపై గరిష్టంగా రూ. 25 వేల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టాటా నెక్సాన్‌ ఈవీ ధర రూ.14.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) చేరుకోనుంది. ఈ వాహనం ఎక్స్‌ఎం, ఎక్స్‌జెడ్‌, ఎక్స్‌జెడ్‌ ప్లస్‌, ఎక్స్‌జెడ్‌ ప్లస్‌ లగ్జరీ, డార్క్‌ ఎక్స్‌జెడ్‌ ప్లస్‌, డార్క్‌ ఎక్స్‌ జెడ్‌ ప్లస్‌ లగ్జరీ వేరియంట్లలో టాటా నెక్సాన్‌ ఈవీ కొనుగోలుదారులకు లభిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్‌ ప్లస్ లగ్జరీ వేరియంట్ ఇప్పుడు రూ.17.15 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది. 

అంతర్జాతీయంగా రూపాయి విలువ క్షీణించడం, ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుదల కారణంగా ధరలను పెంచినట్లు తెలుస్తోంది. టాటా నెక్సాన్‌ ఈవీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 312కిమీ మేర ప్రయాణిస్తుంది. ఇది శక్తివంతమైన, అధిక-సామర్థ్యం గల 129 పీఎస్‌ ఏసీ మోటారుతో వస్తుంది. 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ. ఈ కారు బ్యాటరీ ఐపీ67 ప్రమాణాలతో డస్ట్‌, వాటర్‌ఫ్రూఫ్‌ ప్యాక్‌తో రానుంది. 

చదవండి: కారు నడిపితే నీరు బయటకు వస్తోంది..భారత్‌లో తొలి కారుగా రికార్డు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement