
సాక్షి, ముంబై : దేశంలో అతపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఎట్టకేలకు ఎంతో కాలంగా వేచిచూస్తున్న కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటి వాహనం నెక్సాన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. రూ.5.85 లక్షల నుంచి రూ.9.45 లక్షల ధరల శ్రేణిలో ఈ వాహానాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. టాటా నేడు తీసుకొచ్చిన నెక్సాస్, మారుతీ సుజుకీ విటారా బ్రీజా, ఫోర్డ్ మోటార్స్ ఎకోస్పోర్ట్‌కు గట్టిపోటీ ఇవ్వగలదు. వ్యక్తిగత కారు కొనుగోలుదారులను టార్గెట్‌గా చేసుకుని నెక్సాస్ మార్కెట్‌లోకి వచ్చింది. టాటా మెటార్స్ సరికొత్త నెక్సాన్ ఎస్‌యూవీని ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించింది. అదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చిన టియాగో, హెక్సా, టిగోర్ తర్వాత నాలుగవ ప్రొడక్ట్‌గా టాటా లైనప్‌లోకి ఇది ప్రవేశించింది.