Tata Stocks
-
మార్కెట్లో లాభాల ర్యాలీ...
సాక్షి, ముంబై : ప్రపంచ మార్కెట్ల దూకుడుతో జోరుగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 32వేల మైలురాయిని చేధించిన సెన్సెక్స్, ట్రేడింగ్ చివరికి కూడా 276.50 పాయింట్లు పైకి జంప్ చేసి 32,158 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 87 పాయింట్ల లాభంలో 10,100 మార్కుకు సమీపంలో 10,093 వద్ద క్లోజైంది. మెటల్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్ల ర్యాలీతో వరుసగా నాలుగో సెషన్లోనూ మార్కెట్లు లాభాల పంట పండించాయి. అదేవిధంగా మధ్యాహ్నం ట్రేడింగ్‌లో ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు షేర్లలో కొనుగోలు జోరు కొనసాగింది. వరుసగా ఆరో సెషన్లోనూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు లాభాల వర్షం కురిపించడంతో, మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఈ బ్యాంకు టెక్ దిగ్గజం టీసీఎస్‌ను అధిగమించింది. రెండు సూచీల్లోనూ టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, బీపీసీఎల్, గెయిల్ టాప్ గెయినర్లుగా నిలువగా.. విప్రో, హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంకు నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 64 రూపాయలుగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 54 రూపాయల నష్టంలో రూ.29,879గా ఉన్నాయి. -
టాటాలకు సెబీ షాక్
ముంబై: మిస్త్రీ పేల్చిన బాంబుతో వరుసగా మూడో రోజు కూడా టాటా షేర్లు కుప్పకూలిపోతున్నాయి. ముఖ్యంగా రతన్ టాటాతోపాటు, గ్రూప్ కార్యకలాపాలపై సైరస్ మిస్త్రీ తీవ్ర విమర్శల నేపథ్యంలో టాటా గ్రూపు షేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతుండటంతో ఇండియన్ హోటల్స్ కౌంటర్ ఏకంగా 13 శాతానికిపైగా పతనమైంది. ఈ బాటలో టాటా పవర్, టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్ టాటా గ్లోబల్ బెవరేజెస్ , టాటా కాఫీ , టాటా ఇన్వెస్ట్మెంట్ , టాటా టెలీ సర్వీసెస్, కౌంటర్లలో అమ్మకాలు జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో కనిష్ట స్థాయికి దిగజారాయి. ఇప్పటికే భారీ నష్టాలను మూటగట్టుకున్నటాటా గ్రూప్ మార్కెట్ విలువ తాజా నష్టాలతో సుమారు రూ. 40,000 కోట్లమేరకు చేరింది. మరోవైపు ఈవ్యవహారంపై మార్కెట్లు రెగ్యులేటర్ సెబీ రంగంలోకి దిగింది. కార్పొరేట్ పాలన నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఒకవేళ గతంలో ఏదైనా మొత్తాన్ని రద్దు చేసుంటే, వాటి పూర్తి వివరాలు తెలియజేయాలని, ఆ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు తెలియజేయకుండా లావాదేవీలు జరిపివుంటే వాటి వివరాలు ఇవ్వాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆదేశించింది. కాగా వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ సుమారు రూ. 1.18 లక్షల కోట్లు (18 బిలియన్ డాలర్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని సైరస్ మిస్త్రీ రాసిన లేఖతో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు.