Tavera car
-
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. శుక్రవారం ఉదయం యవాట్మల్లోని అర్ని వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తవేరా వాహనం-ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వేకువ ఝామున ఈ ఘటన జరిగిందని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని స్థానిక ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
టవేరా బోల్తా: ఏడుగురికి గాయాలు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మండలం కరటంపాడు వద్ద ఓ టవేరా కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి తీవ గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గురైన వారు బెంగళూరు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారులో రూ. 26 కోట్లు..!
ముంబై: పుణే పోలీసులు గురువారం ఉదయం రూ. 26 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓ బొలెరో వాహనంలో జాల్నా నుంచి పుణేకి భారీ ఎత్తున డబ్బును ఓ వాహనంలో తరలిస్తున్నట్టు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ మేరకు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి వాహనంలో రూ.26 కోట్ల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కొత్త 2000 రూపాయల నోట్లే కావడంతో ఎక్కడివన్న విషయం గురించి చర్చ జరిగింది. అయితే ప్రాథమిక దర్యాప్తులో ఈ డబ్బు మహారాష్ట్ర గ్రామీణ బ్యాంకుకు సంబంధించిందని తెలిసింది. -
లారీ- టవేరా కారు ఢీ; 12మందికి గాయాలు
గుంటూరు: జిల్లాలోని రొంపిచర్ల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఓ లారీ టవేరా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో టవేరా కారులో ప్రయాణిస్తున్న 12మంది గాయపడ్డారు. టవేరా కారులో పెళ్లిబృందం మాచర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.