కారులో రూ. 26 కోట్లు..!
ముంబై: పుణే పోలీసులు గురువారం ఉదయం రూ. 26 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓ బొలెరో వాహనంలో జాల్నా నుంచి పుణేకి భారీ ఎత్తున డబ్బును ఓ వాహనంలో తరలిస్తున్నట్టు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ మేరకు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి వాహనంలో రూ.26 కోట్ల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కొత్త 2000 రూపాయల నోట్లే కావడంతో ఎక్కడివన్న విషయం గురించి చర్చ జరిగింది. అయితే ప్రాథమిక దర్యాప్తులో ఈ డబ్బు మహారాష్ట్ర గ్రామీణ బ్యాంకుకు సంబంధించిందని తెలిసింది.