the teacher
-
చిన్నారుల నిజాయితీ..
సొమ్ముతో దొరికిన బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన విద్యార్థులు అభినందించిన ఉపాధ్యాయులు, కార్పొరేషన్ కమిషనర్ భివండీ, న్యూస్‌లైన్: పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు పోగొట్టుకున్న బ్యాగ్‌ను, తిరిగి తెచ్చి ఇచ్చిన విధ్యార్థులకు, ఉపాధ్యాయులు, కార్పొరేషన్ కమిషనర్ అభినందించారు. ఈ ఘటన శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న పాఠశాల నం. 1లో మూడవ తరగతి చదువుతున్న అనికేత్ మారుతి బోయిర్, 7వ తరగతి చదువుతున్న మోనాలి సదా ఆధారి అనే విద్యార్థి కలిసి శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో, మండాయిలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా బ్యాగ్ దొరికింది. అందులో రూ. 80 వేల నగదుతో పాటు కొన్ని విలువైన కాగితాలున్నాయి. వెంటనే వారు దాన్ని తమ ఇంటికి తీసుకువెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. బ్యాగ్‌లో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్‌పై ఉన్న అడ్రస్‌కు ఫోన్ చేశారు. బాధితుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు అఫ్జల్ ఖాన్ అని తెలుసుకుని అతడి ఇంటికి తీసుకువెళ్లి బ్యాగ్ అందజేశారు. కాగా, పిల్లలిద్దరూ తన బ్యాగ్‌ను సురక్షితంగా అప్పజెప్పినందుకు ఆనందించిన అఫ్జల్ ఖాన్ వారికి కొంత నగదును పారితోషికంగా ఇచ్చారు. అలాగే ఈ విషయాన్ని శిక్షణ మండలి సభాపతి రాజు గాజెంగికి తెలియజేశారు. దాంతో శనివారం రాజు గాజెంగి స్కూలుకు వెళ్లి పిల్లలిద్దరినీ అభినందించారు. ఇదిలా ఉండగా, విషయం తెలుసుకున్న కార్పొరేషన్ కమిషనర్ జీవన్ సోనావులే సైతం ఇద్దరు విద్యార్థులనూ తన కార్యాలయానికి పిలిపించుకుని వారిని ప్రత్యేకంగా అభినందించారు. -
గురువేనమః
‘‘గురు బ్రహ్మ..గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర గురుసాక్ష్యాత్ పరబ్రహ్మ తస్మయిశ్రీ గురువేనమః’’ తపస్వి మాష్టారు పాఠాలు చాలా ఇష్టం ‘వ్యక్తికి క్రమ శిక్షణ నేర్పేది గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రభావం గురువుదే ఉంటుంది. విద్యార్థి దశలో నేర్చుకున్న క్రమశిక్షణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. ఇది గురువు వల్లనే సాధ్యం. కరీంనగర్ జిల్లాలోని మా సొంత గ్రామమైన మంథనిలో 5వ తరగతి వరకూ చదువుకున్న పాఠశాల, అప్పట్లో పాఠాలు చెప్పిన తపస్వి మాస్టారు అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో అన్ని సబ్జెకులు కూడా తపస్వి మాస్టారే చెప్పేవారు. ఒక మనిషికి కుటుంబం తర్వాత క్రమ శిక్షణ నేర్పేది పాఠశాల, అక్కడి గురువులే. విద్యార్థి అభ్యున్నతికి పాఠాలు నేర్పిన గురువును గౌరవించుకోవటం మన బాధ్యత.’ - ప్రకాష్‌రెడ్డి, భద్రాచలం ఏఎస్పీ నా తండ్రే నా ప్రథమ గురువు నా ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది. నా మొదటి గురువు మా నాన్నే. నల్లగొండ జిల్లాలోని చిన్నకొండూరు, తుమ్మలగూడెం, చెరువుమాదారం గ్రామాల్లోని పాఠశాలల్లో నేను ఏడో తరగతి వరకు చదువుకున్నాను. అక్కడే మా నాన్న పద్మయ్య కూడా ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ప్రభుత్వ పాఠశాల కనుక అన్ని క్లాసుల్లో అన్ని సబ్జెక్టులకు టీచర్లుండేవారు కాదు. అప్పుడు నేను చదువుతున్న క్లాసులో ఏ సబ్జెక్టుకు టీచర్లు లేరో ఆ సబ్జెక్టు చెప్పేందుకు ఆయన డ్యూటీ వేయించుకునేవారు. తన బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అదనంగా ఆ సబ్జెక్టు చెప్పేవారు. సర్వేల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నేను చేరేందుకు కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సర్వేల్ గురుకులంలో లెక్కల సార్ వీజీ.కృష్ణమూర్తి ఉండేవారు. ఆయనంటే నాకెంతో గౌరవం. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే నేను ఇంతటి స్థాయికి వచ్చాను. ఆయన కొడుకు రవీంద్ర కూడా నా క్లాస్మేట్. పరీక్షలయిన తర్వాత ఆయన ముందు దిద్దేది నా పేపరే. ఆయన కొడుకు కన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తే హ్యాపీగా ఫీలయ్యేవారు. గ్రూప్స్‌లో కూడా నాకు లెక్కల సబ్జెక్టే ఉపకరించింది. రెండు పేపర్లలో కలిపి 300 మార్కులకు గాను 290 మార్కులు వచ్చాయి. అదే మిగిలిన సబ్జెక్టుల్లో 100కు మించి రావడం కష్టం. ఆ రోజు కృష్ణమూర్తి సారు చెప్పిన లెక్కలే ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే... గురుకులం హాస్టల్లో కరెంటు లేకపోతే మమ్మల్ని వాళ్లింటికి తీసుకెళ్లి మాకు ఓ రూం ఇచ్చి చదువుకునేందుకు అవకాశం ఇచ్చేవారు కృష్ణమూర్తి సార్. ఎప్పుడైనా సర్వేల్ పాఠశాలకు వెళ్లి ఆయన ఉన్న క్వార్టర్‌ను చూస్తే ఇందులోనా మనం ఉండి చదువుకుంది... ఇంత చిన్న ఇంట్లో మాకు ఎలా అవకాశం ఇచ్చారో కృష్ణమూర్తి సార్ అనిపిస్తుంది. అందుకే గురుదేవోభవ అంటారు. - కడవేరు. సురేంద్రమోహన్, జాయింట్‌కలెక్టర్, ఖమ్మం. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
మంగపేట, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మం డల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెంది న జబ్బ నర్సింహారావు(46) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత పదిహేనేళ్ల నుంచి మండల కేంద్రంలోని టీచ ర్స్ కాలనీలో నివాసముంటున్నాడు. అయితే బుధవారం ఉదయం ఏటూరునాగారంలోని బ్యాంకులో పని ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి బైక్‌పై అక్కడికి వెళ్లాడు. అనంతరం పని ముగిం చుకుని మంగపేటలోని తన ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని జీడి వాగు సమీపంలో రోడ్డు దాటుతున్న అడవిపందిని ప్రమాదవశాత్తు ఢీకొట్టా డు. ఈ సంఘటనలో నర్సింహారావు తలకు బలమైన గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా, రోడ్డు ప్రమాదంలో గాయపడి సృహతప్పిన నర్సింహారావును కమలాపురం నుంచి ఏటూరునాగారానికి వెళ్తున్న కమలాపురం గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ కొమురెల్లి గుర్తించాడు. అనంతరం ఆయన 108 సిబ్బందికి ఫోన్‌చేశాడు. అలాగే మంగపేటకు చెందిన మరో ఉపాధ్యాయుడి కి సమాచారం అందించి వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యలో నర్సింహారావు మృతి చెం దాడు. కాగా, మృతుడికి భార్య చంద్రకళ, కుమారులు శశి, రాజేష్ ఉన్నారు. ఇదిలా ఉండగా, నర్సింహారావు మృతి పట్ల ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య, టీడీ పీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆకా రాధాకృష్ణ, యూత్ కాంగ్రెస్ ము లుగు డివిజన్ అధ్యక్షుడు కొమరగిరి సురేష్ సంతాపం తెలిపారు. అలాగే వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.