జిల్లాలో 1530 ఉపాధ్యాయ ఖాళీలు
కరీంనగర్ ఎడ్యుకే షన్: విద్యాశాఖలో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలపై నివేదికను డీఈవో కార్యాలయం నుంచి రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమర్పించారు. విదావ్యవస్థను గాడిలో పెట్టడానికి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల ఖాళీలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే 1530 ఖాళీలున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిలో సెకండ్ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)లు 882 కాగా, స్కూల్ అసిస్టెంట్లు వివిధ సబ్జెక్టులకు కలిపి మొత్తం 322 ఉన్నాయి.
ఇందులో గణితం 62, ఫిజికల్ సైన్స్ 28, బయోలజీ 55, సోషల్ 92, ఇంగ్లీష్ 27, తెలుగు 31, హిందీ 27 గా ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్స్ గ్రేడ్-2 తెలుగు 92, హిందీ 27, వ్యాయామ ఉపాధ్యాయులు 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో 27 ప్రధానోపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉండ గా (ఫీమెయిల్ లిటరేచర్ ), ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 47 ఖాళీలుగా ఉస్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారికంగా రాష్ట్ర శాఖకు నివేదికను సమర్పించింది.