కాంగ్రెస్ కార్యాలయంపై ఉపాధ్యాయ జేఏసీ దాడి
కర్నూలు: కాంగ్రెస్ కార్యాలయంపై ఉపాధ్యాయ జేఏసీ దాడి చేసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు,కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల దీక్షాశిబిరాన్ని ఉపాధ్యాయలు ధ్వంసం చేశారు.
ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రవాదులు డీసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంపై టమోటాలు విసిరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది.