Teachers recruitments
-
‘అభియాన్’కు నిధుల కోత?
ప్రాథమిక విద్యను బలోపేతం చేసి, జవజీ వాలు కల్పించేందుకై ఉద్దేశించిన సర్వశిక్ష అభి యాన్ (ఎస్ఎస్ఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నిధుల కోతను అమలు చేయనుంది. ఇంతవరకు ఈ నిధులను 65:35 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాలు భరిస్తూ వస్తున్నాయి. అయి తే తాజాగా ఈ నిష్పత్తిని 50:50గా మార్చేం దుకు కేంద్ర మానవ వనరుల శాఖ ప్రణాళి కను రూపొందించడంపై విద్యాభిమానులు పెదవి విరుస్తున్నారు. కేంద్రం వైఖరి ఫలితం గా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి సౌకర్యాలకు గండి పడే ప్రమాదం పొంచి ఉం ది. ఉపాధ్యాయ నియామకాల భర్తీ ఎండమా విగా మారవచ్చు. నిరుద్యోగుల పాలిట శాపం గా పరిణమించడం ఖాయమని స్పష్టమవు తోంది. ఇప్పటికే సర్కారీ విద్యా రంగం పరి స్థితి అగమ్యగోచరంగా ఉంది. విభజనలో చిక్కి శల్యమైన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో బక్కచిక్కిన రాష్ట్రాలు అదనంగా 15 శాతం నిధులను భరించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఎదురవుతుంది. సర్వశిక్ష అభియాన్ పథ కానికి నిధుల కోతపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వైఖరిని సూటిగా ప్రశ్నించాలి. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే విద్యావ్యవస్థ మరింత పతనం కావడం ఖాయం. నిధుల కోత వల్ల కార్పొరేట్ శక్తులు మరింత బలపడతాయి. బడు గు, బలహీనవర్గాల పిల్లలు అన్ని విధాల నష్ట పోతారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర పెత్తనాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రా నికి న్యాయం జరిగేలా చూడాలి. లేకపోతే పాలకులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది. - వి.కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా మొబైల్: 9490528730 -
డీఎస్సీ-98 కేసు విచారణ ఆగస్టుకు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 1998లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. ఆగస్టులో ఈ కేసు తుది విచారణ చేపడతామంటూ ధర్మాసనం వాయిదా వేసింది. డీఎస్సీ-98లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, అగ్రశ్రేణిలో తమను కాదని, వెనక ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారని, వీటిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్, హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలుచేయలేదని గోపు మహేందర్రెడ్డి, బాధిత అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.