సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 1998లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. ఆగస్టులో ఈ కేసు తుది విచారణ చేపడతామంటూ ధర్మాసనం వాయిదా వేసింది.
డీఎస్సీ-98లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, అగ్రశ్రేణిలో తమను కాదని, వెనక ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారని, వీటిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్, హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలుచేయలేదని గోపు మహేందర్‌రెడ్డి, బాధిత అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
డీఎస్సీ-98 కేసు విచారణ ఆగస్టుకు వాయిదా
Published Sat, Apr 11 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM
Advertisement
Advertisement