DSC-98
-
సీఎం వైఎస్ జగనే మా దేవుడు
గుంటూరు ఎడ్యుకేషన్: ‘ఉపాధ్యాయ కొలువుల కోసం 23 ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని ఏ ఒక్కరూ ఆలకించలేదు. ఎంతో మంది సీఎంలను కలిసినా న్యాయం జరగలేదు. పోస్టింగ్స్ ఇవ్వాలని గతంలో హైకోర్టు చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. నాడు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి సమస్యను విన్నవించాం. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ నేడు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్‌పై ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుని ఆరు వేల మంది అభ్యర్థుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగనే మా దేవుడు’ అంటూ అభ్యర్థులు తమ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులు ‘జగనన్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ ఆంధ్రప్రదేశ్’ రాష్ట్ర నాయకుడు ఎం.విశ్వరూపాచారి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు -
థ్యాంక్యూ.. సీఎం సార్
అనంతపురం: గత 24 సంవత్సరాల కాలంలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు. డీఎస్సీ–1998 అర్హత పొందిన అభ్యర్థుల జీవితాల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో డీఎస్సీ –1998లో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశం కల్పించింది. ఏకంగా పదవీ విరమణ చేసే వరకు మినిమం టైం స్కేలు విధానంలో కొనసాగేలా ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో అనంతపురంలోని జిల్లా సైన్స్ సెంటర్లో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి డీఎస్సీ –1998 అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులుగా అవకాశం దక్కుతుందనే ఆశ కూడా లేని పరిస్థితి నుంచి మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని కొనియాడారు. థ్యాంక్యూ ... సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. జీవితాంతం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో 1998 డీఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు చల్లా రామాంజనేయులు, రమణ, నాగేశ్వరరావు, కిషోర్ పాల్గొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం: డీఎస్సీ–1998లో అర్హత పొంది మినిమం టైం స్కేల్ కింద పనిచేయడానికి ఆన్లైన్లో అంగీకారం తెలిపిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైనట్లు డీఈఓ కే.శామ్యూల్ తెలిపారు. జిల్లా సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 570 మంది అభ్యర్థులకుగాను తొలి రోజు 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించామన్నారు. 8 నుంచి 12 వరకు రోజూ 100 మంది చొప్పున సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. అభ్యర్థుల జాబితా డీఈఓ బ్లాగ్స్పాట్లో అందుబాటులో ఉంచామన్నారు. -
డీఎస్సీ–98 అర్హులకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–98 అర్హులందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినట్టు డీఎస్సీ–98 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ తెలిపారు. తమ సమస్యలపై ఆదివారం మంత్రిని కలిసి వివరించినట్టు తెలిపారు. అర్హత ఉన్నా దశాబ్దాలుగా తమకు ఉద్యోగాలు రావడం లేదని, ఈ విషయమై సీఎంకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సాధన సమితి గౌరవాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి రఘురామరాజు తదితరులున్నారు. -
AP: కలల కొలువు దక్కింది.. జీవిత చిత్రం మారింది
ఇంతలోనే ఎంత మార్పు. నిన్నటి వరకూ.. ఉద్యోగం కోసం అలుపెరగని పోరాటంలో అలసిపోయారు. కలలు గన్న ప్రభుత్వ కొలువు వస్తుందో రాదో తెలియదు. 24 ఏళ్లుగా వచ్చిన ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి గానీ, కొలువు మాత్రం ఇవ్వడంలేదు. కొంతమంది రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నారు. మరికొందరు మరో పని చేయలేక, పోషణ భారం అవుతుందేమోనని భయంతో పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాన్ని గడిపేశారు. వారి పరిస్థితి ఇలా ఉండగా.. 1998 డీఎస్సీ అర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించటంతో మసకబారిపోతున్న వారి జీవితాల్లో వెయ్యివోల్టుల వెలుగు నిండింది. అధికారులు ప్రకటించిన అర్హుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఒక్కరోజులోనే వారి జీవితాలు మారిపోయాయి. ఆ ఆనందంలో పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన అభ్యర్థులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలుకు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. – సీతమ్మధార(విశాఖ ఉత్తర)/ఎల్.ఎన్.పేట/ పాతపట్నం/సత్తెనపల్లి చింపిరి జుట్టు పోయింది.. చింపిరి జుట్టు. చిరిగిన దుస్తులు. డొక్కు సైకిలు. ఆ సైకిల్‌పై బట్టలు అమ్ముతూ జీవనోపాధి. భారమైన బతుకుపోరులో పెళ్లి అనే ఊసేలేదు. ఒక రోజు తింటే మరో రోజు పస్తులుండే ఒంటరి జీవితం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు పరిస్థితి ఇది. అర్హుల జాబితాలో పేరు ఉండటంతో ఇప్పుడు ఆయన జీవితమే మారిపోయింది. ఎట్టకేలకు ఉద్యోగస్తుడు అయిన ఆయన్ను స్థానిక యువకులు సెలూన్ షాప్‌కు తీసుకెళ్లి నీట్‌గా క్రాప్ చేయించారు. కొత్తబట్టలు కట్టించి.. కేక్ కట్ చేయించి సంబరాలు చేశారు. అల్లాక కేదారేశ్వరరావును ఇప్పుడు మాస్టర్ కేదారేశ్వరరావు అని పిలుస్తున్నారు. ఎదురుచూపులకు తెరపడింది.. డీఎస్సీ– 1998 అర్హుల జాబితాకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సత్తెనపల్లిలోని లక్కరాజు గార్లపాడు సెంటర్‌కు చెందిన 54 ఏళ్ల గుంటూరు మల్లేశ్వరరావు సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది. ఇన్నాళ్లు ఉద్యోగంలేక, వివాహం కూడా అవ్వక తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఇంటిలోనే ఉన్న ఆయన వద్దకు వెళ్లి.. నీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది అని సహచరులు చెప్పగానే ఆయన కంటివెంట నీటి ధార వర్షించింది. కన్నీళ్లు తుడుచుకుంటూ.. ఇకపై తాను ప్రభుత్వ ఉద్యోగినని ఆనందంతో మురిసిపోయాడు. మా జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నాడు 1998లో డీఎస్సీ క్వాలిఫై అయ్యాను, అప్పట్లో టీచర్ పోస్టులు ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా నిరుద్యోగులతో పాటు మా జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నాడు. జగన్మోహన్రెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు. నాకు ఇప్పటికే 62 సంవత్సరాలు వచ్చాయి. జీవితంలో ఒక్కరోజైనా ప్రభుత్వ ఉద్యోగం చేసి చనిపోవాలనుకున్నాను. 1998లో సీఎంగా జగనే ఉండుంటే మాకు అప్పుడే ఉద్యోగాలు వచ్చేవి. – నరవ అప్పారావు, శెట్టిపాలెం, మాకవరం మండలం కల నెరవేర్చిన సీఎం 24 ఏళ్లు పోరాటం చేశాం. ఇన్నాళ్లకు సీఎం వైఎస్ జగన్ మాకు ఉద్యోగాలు ఇప్పించారు. కల నెరవేరింది. సీఎంకు మా కుటుంబమంతా రుణపడి ఉంటాం. – రాధా రుక్మిణి, అక్కయ్యపాలెం మాకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్‌దే వయసు పెరిగిన మాకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదే. నాకు ఇప్పడు 62 సంవత్సరాలు. మరో 8 నెలలు మాత్రమే సర్వీస్ ఉంది. ఇలాంటి సమయంలో నాకు ఉద్యోగం రావడం నమ్మలేని నిజం. మా కుటుంబాలు అన్నీ రాబోయే ఎన్నికల్లో జగన్‌కే ఓటు వేస్తాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం ఉద్యోగాలు ఇచ్చారు. – డి.ఎం.రావు, విశాఖ జిల్లా పదిరోజుల్లో రిటైరవుతా జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను. మా కుటుంబంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తాను. జూన్ నెలతో నాకు 62 సంవత్సరాలు పూర్తి అవుతాయి. నేను రిటైర్ అవడానికి ఇంక పది రోజులే సమయం ఉంది. ఈ సమయంలో నాకు ఉద్యోగం వస్తుందంటే నమ్మలేకుండా ఉన్నాను. – తమ్మిరాజు, విశాఖ జిల్లా -
డీఎస్సీకి ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరం: రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. ఈ విషయమై ఆయనను కదిలించగా.. ‘అప్పుడు నా వయసు సుమారు 30 ఏళ్లు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివాను. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకున్నాను. 1998 డీఎస్సీ రాశాను. అర్హత సాధించినా అది పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుచరునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఈ రోజు వైఎస్సార్సీపీలో సముచిత స్థానంలో ఉన్నాను. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న చొరవ వల్ల పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రికి డీఎస్సీ 1998 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అన్నారు. -
మా జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వారి 23 ఏళ్ల ఎదురు చూపులు ఫలించనున్నాయి. వారంతా డీఎస్సీలో అర్హత సాధించినా.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంతవరకూ కొలువులు దక్కలేదు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. దీంతో 1998 డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. పాదయాత్రలో మొరపెట్టుకున్న అభ్యర్థులు 1998లో అప్పటి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం చేసింది. వారిలో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలిచ్చి మరికొంతమంది భవిష్యత్తును గాలికొదిలేసింది. ఆ తరువాత 2000, 2001, 2002, 2003, 2006, 2008, 2012, 2016, 2018 సంవత్సరాల్లో సైతం డీఎస్సీలు నిర్వహించి వారికి ఉద్యోగాలిచ్చినా 1998లో అర్హత సాధించిన వారి భవితను త్రిశంకు స్వర్గంలో ఉంచారు. అప్పటి నుంచి వారు అనేక పోరాటాలు చేసినా వారి గోడును ఆలకించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో 1998 డీఎస్సీ అర్హులు కలిసి మొరపెట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తానని జగన్ అభయహస్తం ఇచ్చారు. మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయగా.. సుప్రీంకోర్టులోవేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అడ్డంకిగా మారింది. సాంకేతికంగా ఏర్పడిన ఇబ్బందిని అనంతర కాలంలో అధిగమించడంతో ఇప్పుడు సీఎం జగన్ తన హామీని నెరవేర్చడానికి అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి కూడా ఉద్యోగాలిచ్చే ఫైలులో కదలికలు వచ్చాయి. ప్రస్తుతం 1998 డీఎస్సీ అర్హులైన అభ్యర్థులు జిల్లాలో సుమారు 450 మంది ఉండగా వారిలో మెరిట్ ప్రాతిపదికన అప్పటి డీఎస్సీలో ప్రకటించిన మేరకు సమారు 275 మందికి ఉద్యోగాలొచ్చే అవకాశం కలిగింది. దీనిపై అభ్యర్థులు స్పందిస్తూ జగనన్న నిజంగానే మాటతప్పని, మడమ తిప్పని నాయకుడని మరోసారి నిరూపించుకున్నా రని కృతజ్ఞతలు తెలిపారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చాం ఇంతవరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలీచాలని జీతాలతో దుర్భరంగా నెట్టుకొస్తున్నాం. మా తరువాత ఎన్నో డీఎస్సీలు జరిగి మాకంటే జూనియర్లు ఉద్యోగాల్లో స్థిరపడగా మేం మాత్రం ఉద్యోగం కోసం పోరాటాలు చేస్తూనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ మా ఆవేదనను అర్థం చేసుకున్నారు. మాకు ఉద్యోగాలివ్వడానికి ముందుకు రావడం నిజంగా మా అదృష్టం. ముఖ్యమంత్రి పెద్ద మనసుకు కృతజ్ఞులమై ఉంటాం. – రామబ్రహ్మ పతంజలి, 1998 డీఎస్సీ అభ్యర్థి 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం 23 ఏళ్లుగా ఎంతో వేదనాభరిత జీవితం అనుభవించాం. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యకు పరిష్కారం లభించలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను పాదయాత్రలో కలిసి మా సమస్య చెప్పుకున్నాం. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన అన్ని వర్గాలకూ న్యాయం చేశారు. మాకూ న్యాయం చేస్తారనే ధీమాతోనే ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. దీనిని మేము పండుగలా చేసుకుంటాం. ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుతూ విజయోత్సవ సభను జిల్లాస్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. – వై.సుబ్బారాయుడు, 1998 డీఎస్సీ అర్హుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆశయాలను కొనసాగిస్తాం బీఎస్సీ, బీఈడీ అర్హత ఉంది. డీఎస్సీకి అర్హులమయ్యాం. కానీ ఉద్యోగం మాత్రం కలగానే మిగిలిపోయింది. అర్హతకు తగిన ఉద్యోగం కాకపోయినా కుటుంబ పోషణకు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని జగన్ చేశారు. మా ఆవేదనను అర్థం చేసుకుని మాకు ఉద్యోగాలివ్వడానికి పచ్చజెండా ఊపిన ముఖ్యమంత్రిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తాం. – పి.బెనర్జీ, 1998 డీఎస్సీ అర్హుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
జగన్ ప్రభుత్వం నిర్ణయం.. ఎన్నాళ్లకెన్నాళ్లకో వేచిన ఉదయం
పాతపట్నం: నలిగిపోయి, మాసిపోయిన షర్ట్.. ప్యాంటో లేక షార్టో తెలి యని బాటమ్.. పాత సైకిల్‌పై ఓ సంచిలో బనియన్లు, డ్రాయర్లు, చొక్కాలు పెట్టుకుని.. పాతపట్నం, కొరసవాడ, కాగువాడ గ్రామాల్లో అమ్ముతూ జీవిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు. బేరం లేని రోజు పస్తు పడుకోవడం తప్ప మరో దారి లేని ఇతను ఇలా రెండు దశాబ్దాలుగా జీవితం లాక్కొస్తున్నాడు. అరకొర ఆదాయం వల్ల పెళ్లి కూడా చేసుకోలేదు. తల్లిదండ్రులు అల్లక నీలకంఠు, అమ్మయమ్మలు మృతి చెందారు. ఎంఏ, బీఈడీ చదివి, ఇంగ్లిష్ అనర్గ ళంగా మాట్లాడే ఇతను 1998 బ్యాచ్ డీఎస్సీకి అర్హత సాధించారు. అయితే వివిధ కారణాల వల్ల అప్పట్లో ఉద్యోగం రాలేదు. తాజాగా జగన్ ప్రభుత్వం నిర్ణయంతో ఆ బ్యాచ్‌లో మిగిలి పోయిన అర్హులకు ఉద్యోగాలొచ్చాయి. ఈ విష యాన్ని గ్రామస్తులు కేదారేశ్వరరావు చెవిన వేయగా, ఆయన ఆశ్చర్యపోయాడు. చంద్ర బాబు ఇవ్వలేదు.. జగన్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇతని వయసు 57 ఏళ్లు. ఈ వయసులో ఇతని జీవితం ఇలా మేలి మలుపు తిరగడం పట్ల స్థానికులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతతెలిపారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. పలువురు మాట్లాడుతూ 24 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమ ఆకాంక్షను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని సంతోషం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి డీఎస్సీ–98 అభ్యర్థుల ఫైల్‌పై సంతకం చేశారన్నారు. సీఎం జగన్‌కు తాము జీవిత కాలం రుణపడి ఉంటామని ఉద్వేగంతో చెప్పారు. కార్యక్రమంలో క్వాలిఫైడ్ అభ్యర్థులు అగిరిపల్లి శ్రీనివాస్, జె.సీతారామిరెడ్డి, రంగాచార్యులు, కోటేశ్వరరావు, అనురాధ, దాక్షాయనిరెడ్డి, సాయిరాం ప్రసాద్ పాల్గొన్నారు. పెట్రోల్ బంక్ నుంచి ఉద్యోగానికి.. గుడివాడ టౌన్: తనకు ఉద్యోగం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సదా రుణపడి ఉంటానని క్వాలిఫైడ్ ఉపాధ్యాయుడు బండి కుమార్‌బాబు చెప్పారు. కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్దనపురం పెట్రోల్ బంకులో పని చేసుకుంటూ బతుకుబండి లాగిన తాను.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా మారానని సంతోషం వ్యక్తంచేశారు. -
సీఎం గారూ.. మమ్మల్ని ఆదుకోండి..
సాక్షి, హైదరాబాద్: అధికారుల తప్పిదంతో నష్టపోయిన తమను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని, తమకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని డీఎస్సీ–1998 అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత అసెంబ్లీ సమా వేశాల్లో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల వ్యవహారాన్ని పరిశీలిద్దాం అని పేర్కొన్న సీఎం ఈనెల 6న జరిగే కేబినెట్ భేటీలో తమ సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 2015 జనవరిలో కేసీఆర్ వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ తర్వాత ఒక సారి జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో 1998 డీఎస్సీ లో నష్టపోయిన వారే కాకుండా 2012 వరకు నిర్వహించి మిగతా 5 డీఎస్సీల్లోనూ నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పలు కారణాలతో ఆచరణకు నోచుకోలేదు. దీంతో సీఎం తమను ఆదుకోవాలని, గురువారం తగిన నిర్ణయం తీసుకోవాలని 1998 డీఎస్సీ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. 1998లో నిర్వహించిన డీఎస్సీలో 100 మార్కుల్లో 15 మార్కులు ఇంటర్వ్యూలకు పోగా 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహించింది. ఇందులో ఓసీలకు 50 మార్కులు, బీసీలకు 45 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ వారికి 40 మార్కులను అర్హత గా నిర్ణయించింది. పోస్టుల సంఖ్యకంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను 45, 40, 35కు కుదించింది. నియామకాల సందర్భంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో ఎక్కువ వేసి, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన తమను ఎంపిక కాకుండా చేశారని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై 1999లో ట్రిబ్యునల్ అర్హత మార్కులను తగ్గించడమే సరైందికాదని, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంది. దీనిని సవాలు చేస్తూ 2000లో విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించగా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై విద్యాశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ తీర్పును అమలు చేయలేదు. అప్పటినుంచి 2010 వరకు ట్రిబ్యునల్, హైకోర్టులో మళ్లీ కేసు కొనసాగింది. చివరకు 2011 నవంబర్ 8న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, నియామక తేదీ నుంచి సీనియారిటీ, ప్రయోజనాలు కల్పించాలని పేర్కొన్నా అమలు చేయలేదు. అభ్యర్థులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యాశాఖ ఉద్యోగాలు ఇవ్వలేమని కోర్టుకు చెప్పింది. మానవతా దృక్పథంలో వారి అంశాన్ని పరిశీలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ రద్దు ఊహాగానాల నేపథ్యంలో ఈనెల 6న నిర్వహించనున్న కేబినెట్లో తమకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని 1998 డీఎస్సీ సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. -
రేపు డీఎస్సీ–98 క్వాలీఫైడ్ అభ్యర్థుల సమావేశం
ఆగిరిపల్లి : డీఎస్సీ–98 క్వాలీఫైడ్ అభ్యర్థుల అత్యవసర సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు ఏపీ డీఎస్సీ–98 క్వాలీఫైడ్ అభ్యర్థుల జిల్లా కన్వీనర్ చింతా శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక శారదా రామకృష్ణ విద్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. -
డీఎస్సీ-98 కేసు విచారణ ఆగస్టుకు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 1998లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. ఆగస్టులో ఈ కేసు తుది విచారణ చేపడతామంటూ ధర్మాసనం వాయిదా వేసింది. డీఎస్సీ-98లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, అగ్రశ్రేణిలో తమను కాదని, వెనక ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారని, వీటిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్, హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలుచేయలేదని గోపు మహేందర్‌రెడ్డి, బాధిత అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.