గుంటూరు ఎడ్యుకేషన్: ‘ఉపాధ్యాయ కొలువుల కోసం 23 ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని ఏ ఒక్కరూ ఆలకించలేదు. ఎంతో మంది సీఎంలను కలిసినా న్యాయం జరగలేదు. పోస్టింగ్స్ ఇవ్వాలని గతంలో హైకోర్టు చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. నాడు పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించాం. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ నేడు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్‌పై ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుని ఆరు వేల మంది అభ్యర్థుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగనే మా దేవుడు’ అంటూ అభ్యర్థులు తమ ఆనందం వ్యక్తం చేశారు.
శుక్రవారం గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులు ‘జగనన్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ ఆంధ్రప్రదేశ్’ రాష్ట్ర నాయకుడు ఎం.విశ్వరూపాచారి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
చదవండి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment