Team director Ravi Shastri
-
సమం చేయాల్సిందే
►నేడు రెండో టి20 మ్యాచ్ ►ఒత్తిడిలో భారత్ ►ఓడితే సిరీస్ గల్లంతు ►ఉత్సాహంగా శ్రీలంక తొలి టి20 మ్యాచ్‌లో అనూహ్య ఓటమి భారత్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఈ పరాజయంతో వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా సొంతగడ్డపై జరగబోయే వరల్డ్ కప్‌కు ముందు ద్వితీయ శ్రేణి లంక జట్టుతో సిరీస్ ఓడితేఅదిఅవమానకరమే.కాబట్టిదానితప్పించుకోవాలంటే ముందు పోటీలో నిలవాలి. అందుకు రెండో మ్యాచ్‌లోనే తమదైన శైలిలో చెలరేగాలి. మన స్టార్లు స్థాయికి తగినట్లుగా ఆడితే విజయం కష్టం కాబోదు... కానీ మరోసారి ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే మాత్రం గత ఫలితం పునరావృతం అవుతుంది. రాంచీ: ఐపీఎల్లో మున్ముందు సొంత మైదానం కానున్న పుణే ధోనికి పరాజయభారం మిగిల్చింది. ఇక తన సొంత ఊరిలో దానికి అతను మందు రాయాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు (శుక్రవారం) జరిగే రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి మ్యాచ్ ఓడి సిరీస్‌లో ఇప్పటికే వెనుకబడిన టీమిండియా ఇది గెలిస్తేనే సిరీస్‌లో అవకాశం మిగిలి ఉంటుంది. మళ్లీ ఓడితే మాత్రం భారత గడ్డపై జట్టుకు వరుసగా రెండో సిరీస్ పరాజయం ఖాతాలో పడుతుంది. మరో వైపు తొలి గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో శ్రీలంక కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే జోరులో మళ్లీ ఇండియాను కంగు తినిపించాలని వారు పట్టుదలగా ఉన్నారు. మార్పులు ఉంటాయా..? ‘అందరికీ బ్యాటింగ్ అవకాశం రావడం మంచిదే’ అంటూ తొలి మ్యాచ్ తర్వాత కెప్టెన్ ధోని వ్యాఖ్యానించాడు. అయితే అందరూ ఆడటంతో మన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలంపై కూడా ఒక అంచనా వచ్చింది. ఆల్‌రౌండర్లు పాండ్యా, జడేజా ఇంకా కుదురుకోవాల్సి ఉందని అర్థమైంది. వరల్డ్‌కప్‌లోగా ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయని కెప్టెన్ నమ్మకంగా చెబుతున్నాడు. మరి ఇదే జట్టును ఈ మ్యాచ్ కోసం కొనసాగిస్తారా లేక మార్పులు చేసి మరొకరిని పరీక్షిస్తారా చూడాలి. బ్యాటింగ్ ఆర్డర్లో దీనికి పెద్దగా అవకాశం లేదు గానీ జడేజా స్థానంలో నేగిని ఆడించే అవకాశం ఉంది. అశ్విన్ ఆల్‌రౌండ్ నైపుణ్యం కూడా జట్టుకు బలంగా మారడంతో హర్భజన్ ఈసారి కూడా డగౌట్‌కే పరిమితం. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు సమర్పించుకున్న గత మ్యాచ్ అనుభవంతో మన ప్రధాన బ్యాట్స్‌మెన్ ఈ సారి కాస్త జాగ్రత్తపడతారు. టాప్-4 రోహిత్, ధావన్, రహానే, రైనా చెలరేగితే జట్టుకు తిరుగుండదు. వీరే మ్యాచ్ దిశను నిర్ణయించగలరు. మరో వైపు వ్యక్తిగతంగా బ్యాటింగ్ ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్న ధోని కూడా తన బ్యాట్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. పుణే వైఫల్యం అరుదుగా జరిగేవాటిలో ఒకటి. కాబట్టి దానిని పట్టించుకోకుండా సహజశైలిలో ఆడితే భారత్‌ను ఆపడం లంక బౌలర్లకు కష్టంగా మారుతుంది. దిల్షాన్‌కు చోటు గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన సీనియర్ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ రెండో టి20కి అందుబాటులోకి వచ్చాడు. అతని స్థానంలో ఆడిన కీపర్ డిక్వెలా లేదా స్పిన్నర్ ప్రసన్నలలో ఒకరిని తుది జట్టునుంచి తప్పిస్తారు. ఇది మినహా స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన యువ జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. పేస్ పిచ్‌పై తొలి మ్యాచ్‌లో రజిత, చమీరా, షనక చెలరేగిపోయారు. సాధారణంగా బ్యాటింగ్ వికెట్ అయిన రాంచీలో అంతగా అనుకూలించకపోయినా గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ ముగ్గురు మరోసారి మెరుగైన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాట్స్‌మెన్ కూడా ఒత్తిడి గురయ్యారు. అయితే దిల్షాన్ రాకతో వారి బ్యాటింగ్ కాస్త పటిష్టంగా మారింది. చండీమల్, కపుగెదెర దూకుడుగా ఆడగల సమర్థులు. సిరివర్దన, తిసార పెరీరా కూడా మంచి హిట్టర్లు. భారత జట్టుతో పోలిస్తే అనుభవం తక్కువగా ఉన్నా... ఒకటి, రెండు ఓవర్లలో మ్యాచ్ ఫలితం మారిపోయే ఫార్మాట్లో లంక ఆటగాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రైనా, యువరాజ్, జడేజా/నేగి, అశ్విన్, నెహ్రా, బుమ్రా. శ్రీలంక: చండీమల్ (కెప్టెన్), డిక్వెలా/దిల్షాన్, గుణతిలక, కపుగెదెర, సిరివర్దన, షనక, ప్రసన్న, తిసార, సేననాయకే, రజిత, చమీరా. పిచ్, వాతావరణం రాంచీలో గతంలో టి20 మ్యాచ్ జరగలేదు. కానీ వన్డేల్లో భారీ స్కోర్లు వచ్చాయి. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అయితే హడావిడిగా వేదిక మార్చడంతో మైదానం పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి పిచ్ అనూహ్యంగా స్పందించవచ్చు కూడా. వాతావరణం బాగుంది. వర్షసూచన లేదు. పరిస్థితులను తొందరగా అంచనా వేయడమే కీలకం. గత మ్యాచ్ పొరపాటును ఇక్కడ పునరావృతం కానీయం. మైదానంలోకి దిగిన తర్వాతే ఎంత స్కోరు సరిపోతుందనేది చెప్పగలం. వరల్డ్‌కప్‌కు ముందు అందరు ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. ఎలాంటి పిచ్‌పైనైనా ఆటగల సామర్థ్యం భారత జట్టుకు ఉంది’ -రవిశాస్త్రి, టీమ్ డెరైక్టర్ -
ఆ ముగ్గురి కొనసాగింపు...!
బంగర్, శ్రీధర్, అరుణ్‌ల వైపే బోర్డు మొగ్గు ముంబై: భారత జట్టుకు సహాయక కోచ్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్ బంగర్, బి.అరుణ్, ఆర్.శ్రీధర్‌లను కొనసాగించేందుకే బీసీసీఐ మొగ్గు చూపనుంది. రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఈ త్రయం కూడా జట్టుతో పాటే చేరింది. వీరిలో బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల కాంట్రాక్ట్ రెన్యువల్‌పై ఇప్పటికే బోర్డు హామీ ఇచ్చినా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై స్పష్టత రాలేదు. ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్ నుంచి బంగర్‌పై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ఆయన్ని మార్చాలని బోర్డు భావించింది. ఆమ్రే, రాజ్‌పుత్, రామన్‌లు ఈ రేసులో ఉన్నా బంగర్‌కు రవిశాస్త్రి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఉద్వాసన తప్పిందని సమాచారం. -
వైస్ కెప్టెన్ రేసులో వాళ్లిద్దరు?
- టెస్టు వైస్ కెప్టెన్సీపై చర్చ - అనుభవం కంటే సమర్థతకే అవకాశం న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి నాయకుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు భారత టెస్టు వైస్ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. ఆస్ట్రేలియాలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అజింక్య రహానేతో పాటు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఇందు కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి వైస్ కెప్టెన్ ఎంపికలో కీలకం కానున్నారు. ఆయన ఆటగాళ్ల గురించి ఏం చెబుతారన్నది కీలకం. దీనిపై సెలక్షన్ కమిటీ ఆలోచనలేమిటో ఇప్పుడే చెప్పలేం. అయితే ప్రస్తుతానికి రహానే, అశ్విన్‌లలో ఒకరికి ఆ చాన్స్ ఉంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అశ్విన్ ఇప్పటివరకు తన కెరీర్లో 23 టెస్టులు ఆడాడు. అయితే ఇటీవల చాలా సందర్భాల్లో టెస్టు తుది జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు. మరో వైపు మూడు ఫార్మాట్లలో కూడా ఇప్పుడు రహానే రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. బ్యాటింగ్‌లో ఇప్పటికే తనను తాను రుజువు చేసుకున్నాడు. దూకుడైన కోహ్లి, ప్రశాంత చిత్తం ఉన్న రహానే సరిజోడిగా ఉంటారనేది ఒక అభిప్రాయం. మరో వైపు సొంతగడ్డపై సిరీస్‌లకు వైస్‌కెప్టెన్‌ను నియమించవద్దని బీసీసీఐ గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ తర్వాత మాత్రమే భారత్, బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది కాబట్టి వైస్ కెప్టెన్సీ ఎంపికకు కూడా చాలా సమయం ఉందని చెప్పవచ్చు. ఇషాంత్ ఎంపికయ్యాడా! మరోవైపు ఇషాంత్‌ను ఎంపిక చేసినట్లు భువనేశ్వర్ తన ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు వైస్ కెప్టెన్సీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే భువీ మాత్రం కంగ్రాట్స్ చెప్పేశాడు. ‘భారత టెస్టు జట్టు వైస్‌కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన ఇషాంత్ శర్మకు నా అభినందలు’ అని ఇందులో అతను వ్యాఖ్యానించాడు. -
‘ఏడాదిలో మెరుగుపడతాం’
సిడ్నీ: యువకులతో కూ డిన ప్రస్తుత భారత జట్టు రాబోయే ఏడాది కాలంలో మరింత మెరుగుపడుతుందని టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి అన్నారు. ఆసీస్‌తో సిరీస్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘సిరీస్‌లో 3-0, 4-0 తేడా గురించి ఆలోచించడం లేదు. ప్రత్యర్థులపై అటాకింగ్ గేమ్ ఆడుతున్నంత వరకు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఎలాంటి ప్రదర్శ న చూపారన్న దానిపైనే ఎక్కువగా దృష్టిసారించాలి. ఐదో బౌలర్ లేని లోటు విదేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.గట్టిపోటీ ఇచ్చి గెలవడానికే ఇక్కడికి వచ్చాం. ఇదే జట్టు రాబోయే ఏడాదిలో అద్భుతంగా మెరుగుపడుతుంది’ అని శాస్త్రి తెలిపారు. -
‘శాస్త్రి’ వేసిన మంత్రమేంటి!
►భారత జట్టులో ఒక్కసారిగా మార్పు ►ఆటగాళ్లలో తిరుగులేని ఆత్మవిశ్వాసం ►వన్డేల్లో అద్భుత ప్రదర్శన ►టీమ్ డెరైక్టర్ నివేదిక ప్రభావమేనా! నాటింగ్‌హామ్‌లో రెండో వన్డే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అండర్సన్ గార్డ్ తీసుకుంటుండగా మైదానంలో ఒక్కసారిగా ప్రేక్షకుల అరుపులు, హేళన... ఆ తర్వాత భారత్ జట్టు విజయం పూర్తయ్యాక నాటౌట్ బ్యాట్స్‌మన్ జడేజా పాటతో శృతి కలుపుతూ అభిమానుల ఆనందోత్సాహం... కొద్ది రోజుల క్రితం ఇదే మైదానంలో ఉన్న పరిస్థితికి, నేటికి ఒక్కసారిగా ఎంత మార్పు. టెస్టుల్లో ఘోర పరాజయం, అండర్సన్‌తో వివాదం వంటి పరిణామాలతో ధోని సేన ఎలా కనిపించింది? అదే ఇప్పుడు ఒకవైపు ఇంగ్లండ్ జట్టు ఓటమి భారంతో కుంగిపోయి నిర్వేదంగా ఉంటే మరోవైపు భారత ఆటగాళ్లలో మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసం. టెస్టుల్లో ఓడిన జట్టు ఇదేనా అనిపించే విధంగా... వన్డేల్లో టీమిండియా విజయాలు సాధిస్తోంది. ఒక్కసారిగా ఈ మార్పుకు కారణమేంటి... ఆటగాళ్ల ప్రదర్శనపై ‘డెరైక్టర్’ ప్రభావమేంటి? సాక్షి క్రీడా విభాగం: టెస్టు సిరీస్‌తో పోలిస్తే భారత వన్డే జట్టులో ప్రధానంగా మూడు మార్పులు జరిగాయి. రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ జట్టులోకి వచ్చారు. మిగతా ఆటగాళ్లంతా వైఫల్యంలో భాగమైనవారే. కానీ వన్డేలకు వచ్చేసరికి ఇదే జట్టు తిరుగులేనిదిగా కనిపిస్తోంది. ముఖ్యంగా జడేజా, అశ్విన్‌లాంటి ఆటగాళ్లు తమ విలువేంటో చూపించారు. రహానే కూడా విరామం తర్వాత ఓపెనింగ్‌కు వచ్చినా ఎలాంటి తడబాటుకు లోను కాకుండా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించాడు. నాలుగు, ఐదు టెస్టుల్లో రహానే అవుటైన తీరుతో పోలిస్తే అతను తన బాధ్యతను గుర్తించినట్లు కనిపించింది. వన్డేల్లో తిరుగులేని ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లి కూడా రెండో వన్డేతో మళ్లీ ఆత్మవిశ్వాసం అందుకునే పనిలో పడ్డాడు. సహచరులతో స్ఫూర్తి పొందాడేమో... ఎంతో సంయమనంతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రెండు మ్యాచుల్లోనూ జట్టులో సమష్టితత్వం కనిపించింది. ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడకుండా ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. కీలక భాగస్వామ్యాలతో బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తే... బౌలర్లూ ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. ఇక వన్డేల్లో ధోని కెప్టెన్‌గా తన మార్క్‌ను మరోసారి చూపించాడు. ఇంగ్లండ్ బలహీనతపై దెబ్బ కొడుతూ సరైన సమయంలో స్పిన్నర్లను ఉపయోగించుకున్న తీరు అతనేమిటో చూపించింది. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రధాన బౌలర్ మోహిత్ గాయపడినా ఆ ప్రభావమే కనపడనీయలేదు. చాన్స్ దక్కగానే... వన్డేల్లో రైనాకు ఎప్పటినుంచో గుర్తింపు ఉంది. కానీ గత మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం తెలుగు తేజం రాయుడు ప్రదర్శన గురించే. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే ఇంగ్లండ్ గడ్డపై అండర్-19 ఆటగాడిగా అంబటి రాయుడు 114 బంతుల్లోనే 177 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. అదే మ్యాచ్‌లో రైనా 3 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు! కానీ పుష్కర కాలం తర్వాత కూడా రాయుడు భారత ప్రధాన జట్టులో చోటు దక్కించుకునేందుకు ఇంకా శ్రమిస్తున్నాడు. రెండో వన్డేకు ముందు 13 మ్యాచ్‌లు ఆడినా... ఇలాంటి కీలక ఇన్నింగ్స్ ఆడే అవకాశం అతనికి దక్కలేదు. కానీ ఇప్పుడు మిడిలార్డర్లో స్థానానికి తానూ రేస్‌లో ఉన్నానని ఈ మ్యాచ్‌తో అతను నిరూపించుకోవడం మంచి పరిణామం. ఇదే జట్టు కొనసాగుతుందా... ‘ఓవరాల్‌గా ఇది చాలా మంచి జట్టుగా కనిపిస్తోంది. ఒకసారి మన బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే అద్భుతంగా ఉంది. రోహిత్ కూడా ఫిట్‌గా ఉంటే ఇక తిరుగు లేదు. పరిస్థితులను బట్టి ఆటగాళ్ల ప్రదర్శనను బేరీజు వేయాలి. అలా చూస్తే అందరూ బాగా ఆడుతున్నారు’... రెండో వన్డే విజయం అనంతరం భారత కెప్టెన్ ధోని వ్యాఖ్య ఇది. వరుస ఓటముల తర్వాత వన్డేల్లో విజయాలతో సహచరులు తనలో ఆత్మవిశ్వాసం పెంచారన్నట్లు ధోని మాటల్లో వినిపించింది. ఇక మన జట్టు ఫీల్డింగ్ కూడా అత్యుత్తమ స్థాయిలో ఉంది. దీనిని కూడా ధోని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇప్పుడు ఉన్న ఆటగాళ్లలో ఒక్క ధావన్ మినహా అంతా గాడిలో పడటం చెప్పుకోదగ్గ పరిణామం. అయితే ఒక్క మంచి ఇన్నింగ్స్ అతడిని నిలబెడుతుందని కెప్టెన్ భావిస్తున్నాడు. అదే జరిగితే అది జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. నయానో... భయానో... టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి బస్సులో తనలో స్ఫూర్తి నింపడమే కారణమని రైనా చెబుతున్నాడు. మరోవైపు వన్డే సిరీస్‌కు ముందు డెరైక్టర్‌ను లెక్క చేయని కెప్టెన్, ఇప్పుడు మౌనం వహిస్తున్నాడు. ఇంతకీ రవిశాస్త్రి చేసిందేమిటి... ఆయన చేతిలోకి ఏ మంత్రదండం వచ్చేసింది? జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించడం, వారితో మాట్లాడటమే కాదు... మరో ప్రత్యేక పనిని కూడా శాస్త్రికి బోర్డు అప్పగించింది. ఆటగాళ్ల ప్రవర్తన, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, ఫ్లెచర్ పని తీరు, ధోని కెప్టెన్సీ... ఇలా ప్రతీ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను శాస్త్రి బీసీసీఐకి ఇవ్వనున్నారు. ‘సరిగ్గా చెప్పాలంటే ఈ నివేదికపైనే కొందరు యువ ఆటగాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా ఆటగాళ్లపై ఎలాంటి వ్యక్తిగత అభిమానంలాంటివి లేకుండా పూర్తి పారదర్శకంగా దీనిని ఇవ్వాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నివేదిక అంశం ఆటగాళ్లను ఒక్కసారిగా ఉత్తేజితుల్ని చేసినట్లుంది. ఆడకపోతే ఇంతే సంగతులు అనే సందేశం కూడా వారికి వెళ్లింది. దాంతో టెస్టు వైఫల్యం అనంతరం అందరికీ తమ బాధ్యత గుర్తొచ్చింది. ఇకపై శాస్త్రి ‘మార్గదర్శనం’ ఇదే తరహాలో ఉంటే భారత జట్టు వరుస విజయాల జోరు సాగించడం ఖాయంగా కనిపిస్తోంది.