Team India Mentor
-
ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని!
వన్డే ప్రపంచకప్-2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దాదాపు పుష్కరకాలం తర్వాత భారత్ గడ్డపై వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ ఏడాది ఆక్టోబర్-నవంబర్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను జూన్ 27న ఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. సొంత గడ్డపై జరగనున్న ఈ ఐసీసీ టోర్నీలో విజయం సాధించి తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. భారత జట్టు 2013 నుంచి ఎటువంటి ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. ధోనీ నాయకత్వంలో చివరగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను బీసీసీఐ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్రపంచకప్‌కు స్వదేశంలో వన్డే సిరీస్‌లను బీసీసీఐ ప్లాన్ చేసింది. అదే విధంగా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ కూడా భారత జట్టు ఐసీసీ ట్రోఫీని అందేంచేందుకు శాయశక్తులా ప్రయత్నించనున్నాడు. ధోనికి మరోసారి కీలక బాధ్యతలు..! ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారధి ఎంస్ ధోనికి మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్-2023లో భారత జట్టు మెంటార్‌గా ధోనిని నిమమించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో 2021 టీ20 ప్రపంచకప్‌లో కూడా ధోనీని భారత జట్టు మెంటార్‌గా బీసీసీఐ నియమించింది. కానీ ఆ టోర్నీలో భారత జట్టు తీవ్ర నిరాశపరిచింది. లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ధోని అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని బీసీసీఐ బావిస్తున్నట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఐపీఎల్-2023 టైటిల్‌ను ధోని సారధ్యంలోని చెన్నైసూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: T20 Blast 2023: సామ్ కర్రాన్ ఊచకోత.. కేవలం 18 బంతుల్లోనే సరి కొత్త చరిత్ర! -
దేశం కోసం ధోని.. మెంటార్‌గా ఎలాంటి ఫీజు వద్దన్న లెజెండ్
MS Dhoni Not Charging Anything For Serving As Team India Mentor: భారత టీ20 ప్రపంచకప్ జట్టుకు మెంటార్‌గా సేవలందించేందుకు గాను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన సారధ్యంలో టీమిండియాను రెండుసార్లు జగజ్జేత(2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్)గా నిలిపిన మహేంద్రుడు.. భారత జట్టుకు సేవలందించడం తన బాధ్యతగా భావిస్తానని చెప్పాడని, అందుకుగాను ఎలాంటి ఫీజులు తీసుకోనని మెంటార్‌గా ఎన్నికైన నాడే స్పష్టం చేశాడని షా పేర్కొన్నాడు. దేశం కోసం ధోని కమిట్మెంట్ గొప్పదని షా ప్రశంసించాడు. "MS Dhoni is not charging any honorarium for his services as the mentor of Indian team for the T20 World Cup," BCCI Secretary Jay Shah to ANI (file photo) pic.twitter.com/DQD5KaYo7v — ANI (@ANI) October 12, 2021 మెంటార్‌గా ధోనిని ఎంపిక చేయడం టీమిండియాకు కచ్చితంగా లాభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత టీ20 ప్రపంచకప్ జట్టులోని సభ్యులందరికీ ధోని అంటే అమితమైన గౌరవముందని, కొత్త బాధ్యతల్లో ధోని తప్పక రాణిస్తాడని, అతని ఆధ్వర్యంలో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాలని యావత్ భారత దేశం ఆకాంక్షిస్తుందని తెలిపాడు. కాగా, ప్రస్తుతం ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలో సీఎస్కే మరోసారి ఐపీఎల్ ఫైనల్‌కు కూడా చేరింది. అక్టోబర్ 15న ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. చదవండి: రైనా సహా ఆ ముగ్గురు విధ్వంసకర యోధుల ఖేల్ ఖతం..! -
"ఆ రెండు నిర్ణయాలే" కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణం..!
BCCI Did Not Consult Kohli About Appointing Dhoni As Mentor: ప్రపంచకప్ తర్వాత టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ విరాట్ కోహ్లి బాంబు పేల్చిన నేపథ్యంలో అతని నిర్ణయం వెనుక గల అసలు కారణాలపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వర్క్ లోడ్ కారణంగా పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఇదే విషయపై తాజాగా మరో వార్త నెట్టింట షికార్లు చేస్తుంది. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఆ రెండు నిర్ణయాలే కారణమన్నది ఆ వార్త సారాంశం. ఆ రెండు నిర్ణయాల్లో మొదటిది.. టీమిండియా మెంటార్‌గా ధోని నియామకం కాగా, రెండోది టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్ ఎంపిక. వివరాల్లోకి వెళితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ల్లో టీమిండియా ఓడిన నాటి నుంచి కోహ్లి కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు. దీంతో కోహ్లిని సంప్రదించకుండానే ధోనిని టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా మెంటార్‌గా నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, టీ20 ప్రపంచకప్ జట్టులో చహల్ ఉండాలని కోహ్లి పట్టుబట్టినప్పటికీ.. రోహిత్ సలహా మేరకు సెలెక్షన్ కమిటీ అశ్విన్‌ను ఎంపిక చేసింది. తన ప్రమేయం లేకుండా బీసీసీఐ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను జీర్ణించుకోలేకపోయిన కోహ్లి.. పొట్టి క్రికెట్ పగ్గాలు వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కోహ్లిని టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు అశ్విన్ ప్రధాన కారణం అని మరో వాదన వినిపిస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి.. అశ్విన్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టాడని.. ఇది బీసీసీఐకి అస్సలు నచ్చలేదని.. దీంతో కోహ్లి విషయంలో పొమ్మనలేక పొగ పెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అశ్విన్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. కోహ్లి అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఈ విషయమై కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మధ్య కూడా వాదన జరిగినట్లు సమాచారం. చదవండి: ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి -
టీమిండియాకు 'ఆ చాణక్య బుర్ర' తోడైతే..
Dhoni As Team India Mentor Is Greatest Decision Says Vaughan: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఇంగ్లండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని.. అపార క్రికెట్ పరిజ్ఞానం కలిగిన ఆటగాడని, ఆ చాణక్య బుర్ర అవసరం టీమిండియాకు ఎంతైనా ఉందని, ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ధోని లాంటి దిగ్గజం జట్టుతో కలిసి డ్రెసింగ్ రూమ్‌లో ఉండటం అదనపు బలమని పేర్కొన్నాడు. టీమిండియా మెంటార్‌గా ధోనిని నియమించడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకున్న అతి గొప్ప నిర్ణయమని, టీమిండియాకు ధోని చాణక్య బుర్ర తోడైతే టీ20 ప్రపంచకప్ తప్పక గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను అంచనా వేయడంలో ధోని మాస్టర్ అని, జట్టు మైదానంలో ఉన్న సమయంలో మహీ లాంటి వ్యూహకర్త డగౌట్లో ఉంటే అంతకు మించిన సౌలభ్యం మరొకటి ఉండదని అన్నాడు. ధోని వ్యూహాలు చాలా వరకు సక్సెస్ అవుతాయని, త్వరలో జరుగబోయే ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న భారత్‌కు ఇది తప్పక మేలు చేస్తుందని తెలిపాడు. కాగా, టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా మెంటార్‌గా ధోనిని నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐపీఎల్ రెండో దశలో ధోని నేతృత్వంలో సీఎస్కే వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విజైత్రయాత్రలో జట్టు కెప్టెన్ ధోనిదే కీలకపాత్ర. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ధోనీ తన చాకచక్య నిర్ణయాలతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. అంతకుముందు ఆర్సీబీ, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో సైతం ధోని తన చాణక్య బుర్రను ఉపయోగించి జట్టును గెలిపించాడు. ఫలితంగా పాయింట్ల పట్టికలో సీఎస్కే(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. చదవండి: మోర్గాన్‌లా చేయాల్సి వస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడిని.. -
మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టుకు మెంటర్‌గా మాజీ కెప్టెన్ ధోనిని నియమించడంపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ విభిన్నంగా స్పందించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లుండగా మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిని అధిగమించడం ఎలానో బాగా తెలుసనే కారణంతో మహీని మెంటర్‌గా ఎంపిక చేసి ఉండవచ్చంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ప్రముఖ క్రీడా ఛానల్లో జరిగిన ఓ షోలో మాట్లాడిన గంభీర్.. మెంటర్‌గా ధోని ఎంపికకు గల కారణాలను విశ్లేషించాడు. పొట్టి ఫార్మాట్లో ప్రస్తుతం టీమిండియా విజయవంతంగా కొనసాగుతోందని, ఇలాంటి సందర్భంలో మెంటర్ పోస్ట్‌ను ప్రత్యేకంగా సృష్టించి ధోనికి బాధ్యతలు అప్పజెప్పడంలో అర్ధం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మాట్లో టీమిండియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంటే మెంటర్ అవసరముండేదని, కానీ.. ప్రస్తుత పరస్థితుల్లో ధోని నియామకం హాస్యాస్పదమన్నాడు. కాగా, ధోని హయాంలో టీమిండియా కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిళ్లని, సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. బహుశా ఇదే కారణం చేత ధోని ఎంపిక జరిగి ఉండవచ్చు. ఏదిఏమైనా ఒత్తిడిని అధిగమించడంలో మాస్టర్ అయిన ధోని టీమిండియాతో పాటు ఉండడం సానుకూలాంశమే. ఇదిలా ఉంటే, టీమిండియా మెంటర్‌గా ధోని ఎంపికపై వివాదం నడుస్తోంది. లోధా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ధోని నియామకం జరిగిందంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం.. -
టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం..
Conflict of Interest Complaint Against MS Dhoni: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మెంటర్‌గా ఎమ్మెస్ ధోనిని నియమించడంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు అందింది. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ధోని నియామకం పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశాడు. లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఓ వ్యక్తి రెండు పదవులు ఎలా నిర్వహిస్తాడన్న విషయంపై సంజీవ్ గుప్తా స్పష్టత కోరారు. అయితే, దీనిపై అపెక్స్ కౌన్సిల్ తమ లీగల్ టీమ్‌ను సంప్రదించాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే, ధోని ఇప్పటికే బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతను టీమిండియాకు మెంటర్‌గా కూడా ఎంపిక కావడంతో వివాదం మొదలైంది. కాగా, సంజీవ్ గుప్తా గతంలో కూడా ఆటగాళ్లపై ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదులు చాలా చేశాడు. చదవండి: టీమిండియాలో మరోసారి కరోనా కలకలం..