16న జాతీయ బృందగాన పోటీలు
కాకినాడ రూరల్ :
భారత్ వికాస్ పరిషత్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ బృందగాన పోటీలను కాకినాడ మున్సిపల్ కార్యాలయం వద్దనున్న గాంధీభవన్‌లో అక్టోబర్ 16న నిర్వహిస్తున్నట్టు పరిషత్ కాకినాడ శాఖ అధ్యక్షుడు గళ్లా సుబ్బారావు వివరించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోటీలు హిందీ, సంస్కృతంలో ఉంటాయని, భారత్ వికాస్ పరిషత్ వారి చేతనా కే స్వర్ పుస్తకంలో గల పాటలనే పాడాల్సి ఉంటుందన్నారు. 6 నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు అర్హులని వివరించారు. చేతనా కె స్వర్ పాట లింక్స్‌ను డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ బీవీపీ ఇండియా డాట్ కమ్ నుంచి పొందవచ్చని చెప్పారు. అక్టోబర్ 14లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.