Technical difficulties
-
పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం
► 92 శాతం పైగా హాజరైన అభ్యర్థులు ►‘ఎస్సై’తో పోల్చితే కాస్త ఫర్వాలేదనిపించిన పరీక్ష ► తెలంగాణ ఉద్యమ చరిత్రకు దక్కని చోటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 92.07 శాతం పైగా అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ విభాగాల్లోని 9,281 పోస్టులకు 5.35 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... పరీక్షకు 4.92 లక్షల మంది హాజరైనట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో 90 శాతానికి పైగా అభ్యర్థులు హాజరు కాగా... హైదరాబాద్ జిల్లాలో 87.16 శాతం, రంగారెడ్డి జిల్లాలో 88 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అభ్యర్థులందరి వేలిముద్రలు తీసుకున్నారు. ఎస్సై రాత పరీక్ష సందర్భంగా బయోమెట్రిక్ మిషన్లు కాస్త మొరాయించడంతో ఈసారి వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మిషన్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా నిపుణులను అందుబాటులో పీఆర్బీ ఉంచింది. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు నగర, పట్టణ శివార్ల నుంచి వచ్చే వారికి సులువుగా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించారు. ఉద్యమ చరిత్రకు దక్కని చోటు... ఎస్సై రాత పరీక్షలో తెలంగాణ ఉద్యమానికి కాస్త ప్రాధాన్యం దక్కినా... కానిస్టేబుల్ రాత పరీక్షలో స్థానం దక్కలేదు. తెలంగాణ చరిత్రకు సంబంధించి కేవలం ఒకే ప్రశ్న అడగ్గా, ఎక్కువగా శాతవాహనులు, కాకతీయుల చరిత్రకు సంబంధించిన ప్రశ్నలే అధికంగా వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. మొత్తం మీద కానిస్టేబుల్ పరీక్షా విధానం ఎస్సై రాత పరీక్షతో పోల్చితే కాస్త సులభంగా ఉన్నట్లు తెలిసింది. అర్థమెటిక్, రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు సులభంగా ఉండటంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అన్నీ సమస్యలే
- అప్పుడే కరెంట్ ‘కట్’ కట - ఊరూరా దాహం దాహం - ‘ఆసరా’కు సాంకేతిక ఇబ్బందులు - ‘మిషన్ కాకతీయ’కు బాలారిష్టాలు - నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం - నేతలు చర్చిస్తేనే ‘ముందడుగు’ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సమీపిస్తున్న వేసవి... మందగించిన ముందస్తు ప్రణాళికలు... సమస్యలతో సావాసం వీటన్నింటికి శుక్రవారం జరిగే జిల్లా పరిషత్ సమావేశంలోనైనా పరిష్కారాలు లభిస్తాయని ప్రజలు భావిస్తున్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలు, గ్రామాలలో వేసవికి ముందే తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. కొత్త ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొత్త పథకాలు, నిర్ణయాల అమలుకు క్షేత్రస్థాయిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కొంత కాలంగా జిల్లాలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులు ఇటీవలే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అయితే, ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూగర్భజలాలు అడుగంట డం, జలాశయాలు బోసిబోవడంతో తాగునీటి ఎద్దడి, కరెంట్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఎం పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ పాలకవర్గం, అధికారులు కీలకాంశాలపై చర్చించాల్సి ఉంది. జిల్లాస్థాయిలో పరిష్కారం కాని అంశాలను తీర్మానాల రూపేణా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పరిష్కారం వెతుకుతారా! వేసవి కాలం ప్రవేశించినా నీటి కొరతకు సంబంధించి ప్రణాళికలు ముందుకు సాగడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో ఈ సమస్య ఇప్పుడే ఇబ్బందికరంగా మా రింది. రక్షిత మంచినీటి పథకాలు పడకేశాయి. నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కార మార్గాలను వెతకాల్సి ఉంది. ప్రధానంగా ఇదే సమస్యపై ప్రజాప్రతినిధులు గళం ఎత్తే అవకాశం ఉంది. కరెంటు కోతలు మొదలయ్యా యి. గ్రామీణ ప్రాంతాలలో నాలుగు గంటలు, పట్టణ ప్రాంతాలలో గంటపాటు కోతలు విధిస్తున్నారు. జిల్లాలో 2,16,920 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 80,670 హెక్టార్లలో వరి నాట్లు వేశారు. ఆరుతడి పంటలు కూడా ఎక్కువ మొ త్తంలో వేశారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు రబీలోనైనా పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరికి కరెంటు కోతలు ఇబ్బందికరంగా మారా యి. రోజు వినియోగం 6.5 మిలియన్ యూనిట్ల నుంచి 7.2 మిలియన్ యూ నిట్లకు పెరిగింది. ముందుముందు 10 మిలియన్ యూనిట్ల నుంచి 12 మిలి యన్ యూనిట్ల వరకు చేరే అవకాశం ఉంది. ‘ఆసరా’లో ‘సాంకేతిక’ ఇబ్బందులు నేటికీ పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం జరగడం, సదరం సర్టిఫికెట్ల జారీలో జాప్యం కారణంగా పింఛన్ల పంపిణీలో ఆటంకాలు ఎదురవుతున్నారుు. వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 3,62,144 దరఖాస్తులను పింఛన్ల కోసం సేకరించారు. ఇందులో జనవరి నెల కోసం 2,46,745 లబ్ధిదారులను గుర్తించారు. మరిన్ని దరఖాస్తుదారులను గుర్తించడానికి ఇబ్బం దులు తలెత్తుతున్నాయి. నాలుగు నెలలుగా సరైన పరిష్కారం లభించడం లేదు. జిల్లా కేంద్రంతోపాటు కొన్ని మండలాలలో పింఛన్లు అందుకోని బాధితులు చాలా మంది ఉన్నారు. పసుపు రైతుల గోడు పసుపు పంటకు ధరకు గిట్టుబాటు ధర కరువైంది. మార్కెట్ యార్డులో ఈ-మార్కెటింగ్ ద్వారా ధరను కోల్పోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా పసుపు ధర మార్కెట్లో రూ. ఐదు వేల నుంచి రూ.ఆరు వేలే పలుకుతోంది. ఒక్క రోజు మాత్రమే రూ. తొమ్మిది వేల ధర పలికింది. తరువాత పడిపోరుుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మద్దతు ధర పెంచాలని కోరుతున్నారు. కొందరు మంచి ధర కోసం పంటను మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కువగా దీనిని పండించే రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ముందుకు సాగని చెరువుల పునరుద్ధరణ 36 ప్యాకేజీల కింద బీటీ రోడ్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రూ. 27.73 కోట్ల పనులకు గత నవంబర్ నుంచి టెండర్లు పిలుస్తున్నా అధికారులకు చుక్కెదురవుతోంది. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అక్కడక్కడ కొం దరు ప్రజాప్రతినిధులు అధిక మొత్తంలో వాటాలు డిమాండ్ చేయడంతో ఈ ప నుల పక్రియ ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి. మిషన్ కాకతీ యకు సంబంధించి చెరువుల పునరుద్ధరణకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. జిల్లాలో మొత్తం 364 చెరువులకు రూ.119.07 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. టెండర్ల పక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. -
డెల్టా, కుడి కాలువ రైతుల్లో ఆందోళన
మాచర్ల టౌన్: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టం చాలా తక్కువగా ఉండడంతో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు ఈ ఏడాది సకాలంలో నీరు విడుదల చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రతియేటా ఖరీఫ్ ప్రారంభం కాగానే ముందుగానే కృష్ణా డెల్టాకు సాగర్ ప్రధాన జలవిద్యుత్కేంద్రం నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించి దిగువ కృష్ణానది ప్రాంతంలో ఉన్న డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ప్రతిరోజూ పది వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని విద్యుదుత్పాదన అనంతరం నీటిని డెల్టాకు వెళతాయి. రాష్ట్ర విభజన జరగడంతో డెల్టాకు నీటి విడుదలకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు. ఈనెల 25వ తేదీ వరకు నీటి విడుదలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడడం లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం కేవలం 517 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. 510 అడుగులకు నీరు తగ్గిపోతే డెల్టా, కుడికాలువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. సాగర్ రిజర్వాయర్‌కు ప్రస్తుతం పైనుంచి కూడా ఎటువంటి వరదనీరు రావడం లేదు. వర్షాభావ పరిస్థితి మరో వైపున కృష్ణా నదికి నీటి ప్రవాహం ప్రారంభమైనా ముందుగా అల్మట్టి డ్యామ్ పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకున్నాకే ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తారు. ఈ పరిస్థితుల్లో సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో డెల్టాకు ఏదో ఒకవిధంగా త్వరలో నీటిని విడుదల చేసినా.. కుడికాలువకు మాత్రం ఇప్పట్లో నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఓ వైపు మెట్ట ప్రాంతాలు, బోర్ల భూముల్లో వర్షాలు లేక రైతులు సాగుకు నిలిపివేయగా సాగర్ ఆయకట్టు పరిధిలోని కుడికాలువ నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో రైతులు కూడా మరో నెల రోజులపాటు కాలువ కింద భూములను సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదు. డెల్టా రైతులు నీటి కోసం ఎదురుచూస్తుంటే కాలువ రైతులు అసలు నీరు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. అటు మెట్ట భూములు ఇటు కాలువ భూముల రైతులు ఈ ఏడాది సాగు జాప్యంపై ఆందోళన చెందుతున్నారు.