Tel Aviv University researchers
-
వాసనలు పసిగట్టే రోబో
టెల్ అవీవ్: మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, అనుమతి లేని వస్తువులను వాసన ద్వారా క్షణాల్లో గుర్తించే శక్తిమంతమైన రోబోను ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో ఇలాంటి రోబో ఇదే మొదటిదట. సమీప భవిష్యత్తులో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఇవి సేవలందిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాసనను పసిగట్టే ఎలక్ట్రానిక్ పరికరాల కంటే ఈ రోబో 10,000 రెట్లు ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది. సున్నితమైన వాసనలను సులువుగా గుర్తించేలా ఇందులో బయో సెన్సార్ అమర్చారు. మెషిన్ లెర్నింగ్ అల్గరిథంతో ఈ సెన్సార్‌ను ఎలక్ట్రానిక్ వ్యవస్థగా మార్చారు. ప్రతి వాసనలోని ఎలక్ట్రిక్ చర్యను బట్టి అది ఏ రకం వాసనో చెప్పేస్తుంది. మనిషి ఎన్ని రకాల ఆధునిక టెక్నాలజీలను అభివృద్ధి చేసినా అవి ప్రకృతిలోని జీవులతో పోటీ పడలేవని వర్సిటీ ప్రతినిధులు డాక్టర్ బెన్ మావోజ్, ప్రొఫెసర్ అమీర్ అయాలీ చెప్పారు. ‘‘కొన్ని రకాల కీటకాలు వాసనలను సరిగ్గా గుర్తిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిని దోమలు కేవలం 0.01 శాతం వ్యత్యాసంతో సరిగ్గా గుర్తిస్తాయి. కీటకాల తరహాలో వాసనలను పసిగట్టే సెన్సార్ల అభివృద్ధిలో మనమింకా వెనకబడే ఉన్నాం’’ అని వివరించారు. పరిశోధన వివరాలు బయో సెన్సార్ అండ్ బయో ఎలక్ట్రానిక్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి. -
HIV-AIDS cure: ఆ ఇంజక్షన్‌తో ఎయిడ్స్‌కు చెక్!
టెల్ అవీవ్: వైద్య చరిత్రలో మేలిమలుపు. చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని ఇంజక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించి హెచ్ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. పరిశోధన వివరాలను నేచర్ జర్నల్ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోంది. ఇంజనీరింగ్–టైప్ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి హెచ్ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్ పని చేస్తుంది. వైరస్లు, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు శరీరంలో ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్ ఉండాలి. ఇవి వైరస్‌తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా జరిగే వైరస్ మార్పుల్లోనూ చోటుచేసుకొని వాటిపై పోరాడి నిర్వీర్యం చేస్తాయి. ‘‘ఇప్పటిదాకా జరిగిన ప్రయోగాల్లో హెచ్ఐవీ వైరస్‌ను ఇవి సమర్థవంతంగా తటస్థం చేస్తున్నాయి. , యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తవుతున్నాయి. ఎయిడ్స్‌పై పోరాటంలో ఇదో పెద్ద ముందడుగు’’ అని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన డాక్టర్ బర్జేల్ వివరించారు. ఎయిడ్స్‌కు త్వరలో ఔషధాన్ని కనిపెడతామని ధీమా వెలిబుచ్చారు. -
సేదదీరితే... లావెక్కుతారట!
పరిపరి శోధన తీరిక దొరకడమే తడవుగా బద్ధకంగా సేదదీరుతూ గడిపేస్తున్నారా? పనీపాటా లేకుండా, సోఫాలో చారబడి టీవీ చూస్తూనో, అందుకు కూడా బద్ధకించి, తిండి కోసం తప్ప మంచం కూడా దిగకుండా గంటలకు గంటలు గడిపేస్తున్నారా..? ఇలాంటి అలవాటు ఏమంత క్షేమం కాదు. అతిగా సేదదీరితే త్వరగా లావెక్కిపోతారని టెల్ అవివ్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎంత తీరిక దొరికినా, ఒంటికి పనిచెప్పకుండా అతిగా సేదదీరితే, శరీరంలో కొవ్వుకణాలు పేరుకుపోయి, త్వరగా లావెక్కుతారని, ఆ తర్వాత స్థూలకాయంతో తలెత్తే రకరకాల సమస్యలతో బాధపడక తప్పదని వారు చెబుతున్నారు.